TIRUVEMBAVAY-11
తిరువెంబావాయ్-11 ************ "కృపాసముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీ వామభాగం సదాశివం రుద్రం అనంతరూపం చిదంబరేశం హృది భావయామి" సందర్భము ********** "న అన్య పశ్యంతే" -పరమాత్మను తక్క అన్యమును చూచుటకు ఇష్టపడని స్థితిలోనున్న భాగ్యశాలురైన కన్నియలు ఒకరినొకరు మేల్కొలుపుకుని,ఆశీర్వాదముగా ఆత్మజ్ఞానమనే శివజ్ఞానమును అందుకుంటూ,శివనోము చేయు దీక్ష లోని భాగమైన స్నాన ఘట్తములోనికి ప్రవేశిస్తున్నారు.వారితో పాటుగా మనలను ప్రవేశింపచేస్తున్నారు.అదియే వెణ్-నీర్-ఆడి తెల్లని స్వచ్చమైన నీటిలో మునిగి. పరమాత్మ అనుగ్రహము జలములో ప్రకటనమగుతూ మనలను కరుణిస్తుంటే అదియే తీర్థము.మనము తరచుగా తీర్థయాత్రలకు వెళుతున్నాము అని వింటుంటేనే ఉంటాము.తీర్థ ప్రాశస్త్యమును తిరుమాణిక్యవాచగరు మనకు ప్రస్తుత పాశురములో అనుగ్రహిస్తున్నారు. పాశురము ********* ముయ్యార్ తడం పొయిగై పుక్కు ముగేరెన్న కయ్యార్ కుడైందు కుడైందు ఉన్ కళల్ పాడి అయ్యా వళి అడియో వాళ్దోంకాణ్ ఆరళ్ పోర్ శయ్యా వెణ్ణిరాడి శెల్వా శిరు ...