TIRUVEMBAVAY-13
తిరువెంబావాయ్-13 ************** "కృపా సముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీ వామభాగం సదాశివం రుద్రం అనంతరూపం చిదంబరేశం హృది భావయామి." సందర్భము ********* శివనోమును సంక్ల్పించి,ఒకరినొకరు తన్మయావస్థ నుండి మేల్కొలుపుచుకొనుచు,స్వామి అనుగ్రహమనే మడుగులో మునకలు వేస్తూ,సకలము శివమే అను అనుభూతికి లోనవుతూ,మడుగు లోని జలము,కమలము,కలువ,హంసలు,వారు దర్శిస్తూ పొందుతున్న అనుభవమును మనకు తిరుమాణిక్య వాచగరు అందిస్తున్నారు.పురాకృత పుణ్యమే లేక పరమాత్మ అవ్యాజ అనుగ్రహమో వాటిని మనకు తెలియచేస్తున్నారు ఆ భాగ్య్శాలులు. పాశురము ********పైంగుమళై కార్మలరార్ శెంగమల పైంపోదార్ అంగం కురుగినత్తార్ పిన్నుం అరవత్తార్ తంగళ్ మనం కళవు వార్వందు సార్ధనినాల్ ఎంగళ్ పిరాట్టియుం ఎం కోన్రుం సోర్నిశెయింగ పొంగు మడువీర్ పుగప్పొందు పాయిందు శంగం శిలంబ శిలంబు కలందార్ప కొంగకళపొంగ కుడైయుం పునల్పొంగాన్ పంగయుం పూం పునల్ పాయిండేలో రెంబావాయ్ ఘనాఘనసుందర పోట్రి ********************* శ్రీ దేవులపల్లివారికి సవినయ నమస్కారములతో, తిరు మాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో మన మానవనేత్రములు...