Posts

Showing posts from February 21, 2026

ADITYAHRDAYAMU-28

Image
  ఆదిత్యహృదయము-శ్లోకము-28 ********************** ప్రార్థన ****** "జయతుజయతుసూర్యం సప్తలోకైక దీపం తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం సకలభువనవంద్యం భాస్కరం తం నమామి. పూర్వ రంగము ********  అగస్త్య భగవానుడు ఆదిత్యస్తోత్ర ప్రభావమును ఉపదేశించి,మరలిన తదుపరి రాముని చింతాశోకములు దూరమయి,తనలోని శక్తిని తెలుసుకుని,ప్రియ మనస్కుడై రావణునితో యుద్ధముచేయుటకు సిద్ధమగుతున్నాడు.మనలో దాగిన శక్తి మనకు మార్గదర్శకము కాగలదు గమనిస్తే .  ప్రస్తుత శ్లోకము ఆదిత్య ఆరాధనా విధానము పరోక్షముగా "రాముడు అర్ఘ్యప్రదానము చేసెను" అని చెబుతూ చేతనులు పరమాత్మకు అందించవలసిన కృతజ్ఞతావిష్కారమును సూచిస్తున్నది.  ఆచమనము అనగా భాషా[అర్థముగా) ద్రవమును స్వీకరించుట,త్రాగుట. సూర్యభగవానునికి స్థూలముగా దోసిలో జలమునునింపుకుని అర్ఘ్యమిచ్చుట,సూక్ష్మముగా ఆచమనమును చేసి లోపలి పరమాత్మకు జలమును సమర్పించుట మనము చూస్తూనే ఉంటాము.  సనాతనము సూచించిన ఈ నియమము షోడశ పూజా విధానములో/అథాంగ పూజలో, "హస్తే ఆచమనీయం సమర్పయామి" అని, పరమాత్మ మనకు అందించిన, మనలను పోషించుచున్న పంచభూతములకలోని జలమునకు కృతజ్ఞతను ఆవిష...