Monday, November 15, 2021
RUDRA PASUPATI NAYANAR
ఉరుత్తిరు రుద్ర పశుపతి నాయనారు.
*****************************
" పంచాక్షరీ శివపదేన విభాతి నిత్యం
రుద్రస్తయా స్ఫురతి తేన చతుర్య్హ కాండః
కాందేన తేన యజురేవ విభాతి నిత్యం
ఋక్సామ మధ్య మణివాచ విభాంతి వేదా"
నమః శివాయ అను పంచాక్షరి మంత్రము "శివ" అను పదము చేత ప్రకాశించుచున్నది.
శివపంచాక్షరిని ప్రశంసించి నిర్దేశించుటచే రుద్రాద్యాయము ప్రశస్తమగుచున్నది.
రుద్రుడు తేజోరూపము.
రుద్రాధ్యాయము వైదికమగు స్తుతి.రుద్రాధ్యాయమనగా నమకము మరియు చమకము.నమః అను శబ్దము పలుమార్లు ఆవృత్తమగుటచే నమకము అనియును,చ-మే పలుసార్లు చెప్పబడుటచే చమకము అనియు సార్థకనామములను సంతరించుకున్నవి.
"తిరుతొండర్దొగై" సనాతన వైదిక బ్రాహ్మణ కుటుంబమున తిరుతలయూరు నందు జన్మించారు.
" నమః కాట్యాయచ-నీప్యాయచ
నమః సూద్యాయచ-సరస్యాయచా"
కొండమీది నుండి జారిపడే జలము నీప్యము.కొద్దిపాటి జలము కాటము.
" నమో నాద్యాయచ-వైశంతాయచ"
నదీ జలములములలో నుండువాడు నాద్యాయచ,
స్వల్పజలము కలది వేశంతము.అవి మన భాషలో చెప్పుకోవాలంటే, కోవెలలోని దైవ తర్పణము కొరకు ఏర్పరచిన దేవ ఖాతములు.పుష్కరిణులు.
ఆ పుష్కరిణి జలమును సాక్షాత్తు పరమేశుని ఆవాసముగా ఆరాధిస్తూ,
త్రికాలములందు -తిరుతలయూరు నందలి పార్వతీ శ్రీ బాలేశ్వర స్వామి పుష్కరిణీ తీర్థమునందు తలలోతు మునిగి,
బురదంటని పద్మమువలె ఊర్థ్వ ముకుళిత హస్తములతో,సూత సంహిత నుడివినట్లు,
'వృక్షస్య మూలసేకేన శాఖాః పుష్యంతి యైయదా
శివే రుద్రే జపాత్ ప్రీతే ప్రీతా ఏ వాన్య దేవతాః"
రుద్రాధ్యాయము వేదములలో ఉత్తమము.హోమాది కర్మలలో ప్రధానము,అమృతప్రదము కనుక,
రుద్రపారాయణను చేసేవాడు
నాయనారు అచంచల భక్తికి నిదర్శనమా అన్నట్లుగా, --
బాహ్యము సైతము రుద్రాక్షమాలలతో తన భక్తిని ముద్రించుకునేది.తిరుపుండ్రములు నిరంతర విభూతిని/ఐశ్వర్యమును ప్రకటిస్తూ పరమేశ ప్రస్తుతిని చేస్తుండేవి.సత్వగుణ సంపన్నమైన నాయనారు ముఖము సాక్షాత్తు సదాశివ రూపముగా తేజరిల్లుతుండేది.నాభినుండి శోభాయమానముగా వెలువడుతున్న నమక-చమకములు నలుదిక్కులా నినదిస్తుండేవి.
నిద్రాహారములు దరిచేరుటకు ధైర్యము చేయలేకపోయేవి.అన్యమునకు స్థానము నాస్తి నాస్తి.
శ్వాస మాత్రమే రుద్రనాయనారు అనుష్టానమునకు ఆలంబనగా ఉండేది.
ఇక్కడ మనము కొంచము పరిశీలిస్తే అనేకానేక జన్మల చక్రములలో నిరంతరముగా తిరుగుచున్న జీవునికి దాని నుండి విముక్తి లభించాలంటే, దానికంటే బలమైన శక్తి అవసరము.ఆ శక్తి సత్యమైనది-శుభప్రదమైనది-శాశ్వతమైనది అయితేనే తాత్కాలితను తొలగించగల సామర్థ్యతను కలిగియుంటుంది.
మనకు పాశము-పశుపతి-పశువు అను మూటిని కనుక పరిగణిస్తే ,
పాశమును వేయగల/తీయగల సామర్థ్యము కలవాడు శాశ్వతుడు.పాశము శాశ్వతుని చేతిలో నున్నది కనుక అదియును శాశ్వతమే.కాకపోతే పశుపాశ బంధితుడు తన పూర్వజన్మల పుణ్య-పాప కర్మల అవశేషములను ముగించుకొనుటకై ,పునరపి జననం-పునరపి మరనం-పునరపి జనననీ కఠరే సయనం" అని శంకర భగవత్పాదులు సెలవిచ్చినట్లు ఉపాధి అను పాశముతో భగవతత్త్వమునకు-జీవనకృత్యమునకు ముడివేయబడి జన్మరాహిత్యమును పొందుటకు దయాంతరంగుడైన "పతి" చే మరొక్క అవకాశమును పొందుచున్నాడు.
జీవన పరమార్థమును ఆకళింపు చేసికొనిన నాయనారు నమక-చమక పారాయణమును సంసారపు సాగరమును దాటించు నావగా భావించిన వాడు.
ఆంతర్యమును అభివ్యక్తీకరించుటలో కూడా తన అనుష్టాన భంగిమను ఒక అద్భుత సందేశముగా చూపుతు మనలను అనుగ్రహిస్తున్నాడు పశుపతి రుద్రనాయనారు.
ప్రతిజీవి సంసారమనే ప్రవాహమును ఈదలేక తలమునకలవుతుంటాడు.ఆ సాగరము చిక్కటి బురదతో, పెక్కు మొసళ్ళతో
కాలు తీసి,పైకివేసి,కదిలి వద్దామన్న విడిచిపెట్టక మనలను ఒడిసి పట్టుకుని ఉంటుంది.
అటువంటి బురదతో నిండిన చెరువులో ఉన్నప్పటికిని పద్మము ఏ విధముగా దినపతి అయిన సూర్యకిరణముల సహాయముతో,తన పుట్టినిల్లైన బురదను ఏ మాత్రము అంటనీయక స్వచ్చముగా ఉంటుందో,సుగంధభరితమవుతుందో,అదే విధముగా తాను పుట్టిన /తనకు పుట్టినిల్లైన సంసార బంధములను పశుపతి కరుణ అనెడి కిరణముల ద్వార తన ఉపాధిని సంస్కార భరిత సుగంధ మయము చేసుకోవాలని తానొక నిదర్శనమై,నీలకంఠుని నిస్తుల కరుణను పొందిన నాయనారు ప్రాతస్మరణీయుడు
తామర తటాకములో తానొక తామరయై జలములో-జగములో జంగమదేవరను కాంచి-జపించి,పరమేశ్వర సాక్షాత్కారమును పొందుటయే కాక స్వామిచే ఉరు-తిరు-రుద్ర-పశుపతిగా అనుగ్రహింపబడినాడు.
భగవంతుడు-భక్తుడు అను ద్వంద్వము మమేకమై నాయనారు కీర్తిని లోకవిదితము చేసినది.
నాయనారును అనుగ్రహించిన నాదనాధుడు మనలనందరిని అనిశము సంరక్షించును గాక.
ఏక బిల్వం శివార్పణం.
.
.
KAMCHARA NAYANARU
" నమో కపర్దినేచ-వ్యుప్త కేశాయచ."
చిదానందరూపా-కంచార నాయనారు
*****************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
కంచార నాయనారు చోళదేశ సేనాపతి
శివతపోఫలితముగా కుమార్తె జన్మించింది
యుక్తవయసు రాగానే యోగ్యుని అల్లుడు అనుకొనె
దీవించగ ఏతెంచెను మహా వ్రతుడు "వధువును"
విధేయముగా వధువు వంగి పాద నమస్కారమును చేసె
విచిత్రముగా అతిథి వధువు కేశపాశమును కోరె
సందేహించక ఏమాత్రము కోసి ఇచ్చేసెనుగా
కైవల్యమును పొందగ కోసిన కేశపాశము కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక
శివ భక్తులను కొలుచుట ఆదరించుట శివపూజగా భావించు కంచార నాయనారు చోళరాజ్య సేనా నాయకుడు.సదాశివుడు నాయనారు భక్తికి మెచ్చి సకల సద్గుణరాశియైన ఒక కుమార్తెను అనుగ్రహించాడు.యుక్త వయసువచ్చిన ఆమెకు శివ భక్తడైన ఇయర్కాన్ కాలికమార్నుని వరుడుగా నిర్ణయించాడు శివుడు.
" ఆట కదరా శివా ! ఆట కద కేశవ- ఆట కదరా నీకు అన్ని పనులు."
భక్తుని చరిత్ర అందముగా మరందముచిందాలని నిందను స్వీకరించుటకు ముందుకొచ్చాడు ఆ నందివాహనుడు. జడలు కట్టినకొప్పును అలంకరించుకొన్నాడు. ఓం కపర్దినేచ నమో నమ: అంతటితో ఆగక కొన్ని కేశములను యజ్ఞోపవీతమును చేసుకొని అలంకరించుకొన్నాడు,నమో వృక్షేభ్యో-హరికేశేభ్యో" అని సన్నుతులందువాడు.ఒక మహావ్రతుని రూపుదాల్చి నాయనారు ఇంటికి వేంచేశాడు.మహదానంద పడిన నాయనారు శివుని పూజించి,తనకుమార్తెను పిలిచి సాధువుకు నమస్కరించమని స్వామి దీవెనలు అందుకోబోతున్న తన బిడ్డను చూసి దొడ్డ సంబరమును పొందాడు." ఆనతి నీయరా శివా" అంటు మైమరచిపోయాడు.
కపర్డిగా వచ్చిన సాధువు ఆశీర్వచనమునకై వంగిన వధువు కబరీ బంధమును (కేశ సంపద-జడ) చూసి తనను తాను వ్యుప్త కేశుడిగా (కేశములు లేని వాడిగా) భావించుకొని,నాయనారుతో అమ్మాయి కేశ సంపదను తాను మోహించానని,దానితో పంచవటిని నిర్మించుకుంటానని,
కనుక తనకు ఇయ్యమని కోరాడు."శివ శివ! అమంగళము ప్రతిహతమగుగాక"!. ధూర్జటి చెప్పినట్లు అన్నీ తన దగ్గరనే ఉన్నను ఆత్మార్పణశక్తిని పరీక్షించుచు మైమరచిపోతుంటాడు ఆ జడల రామలింగేశ్వరుడు..ఏ మాత్రము ఆలోచించకుండా తక్షణమే కోసి, దానిని శివార్పణము చేస్తూ "జటాజూట ధారి-శివా చంద్రమౌళి,నిటాలాక్ష నీవే సదా మాకు రక్ష అని ప్రార్థించిన మన కంచార నాయనారు కుమార్తెను దీర్ఘ సుమంగళిగా దీవించిన ( ఆమె కేశపాశము తిరిగి వచ్చేసింది) జటలలో గంగమ్మను బంధించిన భోళా శంకరుడు మనలందరిని తన కరుణతో బంధించును గాక.
మాన కంచర నాయనారు సంతానమునకై నీలకంఠుని అకుంఠిత దీక్షతో తపమాచరించి,ఆశీర్వచనముగా లక్ష్మీస్వరూపమైన కుమార్తెను పొందెను.
పెళ్ళికూతురును మురితుచు ముస్తాబు చేస్తున్నది బాహ్యము.పరీక్షాసమయమాసన్నమయినదనుచు ప్రవేశించుచునది దైవము ఆంతర్యము.
ఘటనాఘటనా సమర్థుడు కళ్యానమందపమునందు సమీపించాడు .ఘటనాఘటనా సమర్థుడు క్
తుమ్మెదరెక్కలౌ పోళ్యానమందపమునందు సమీపించాడు .నల్లని తుమ్మెదరెక్కల వంటి వధువు కుంతలములను నవరత్న మణులతో జడగంటలతో సూర్య చంద్రులతో పాపిడి బిళ్లలతో అలంకరిస్తున్నారు.
( ఏక బిల్వం శివార్పణం.) .
.
Subscribe to:
Posts (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...