Monday, November 15, 2021
KAMCHARA NAYANARU
" నమో కపర్దినేచ-వ్యుప్త కేశాయచ."
చిదానందరూపా-కంచార నాయనారు
*****************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
కంచార నాయనారు చోళదేశ సేనాపతి
శివతపోఫలితముగా కుమార్తె జన్మించింది
యుక్తవయసు రాగానే యోగ్యుని అల్లుడు అనుకొనె
దీవించగ ఏతెంచెను మహా వ్రతుడు "వధువును"
విధేయముగా వధువు వంగి పాద నమస్కారమును చేసె
విచిత్రముగా అతిథి వధువు కేశపాశమును కోరె
సందేహించక ఏమాత్రము కోసి ఇచ్చేసెనుగా
కైవల్యమును పొందగ కోసిన కేశపాశము కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక
శివ భక్తులను కొలుచుట ఆదరించుట శివపూజగా భావించు కంచార నాయనారు చోళరాజ్య సేనా నాయకుడు.సదాశివుడు నాయనారు భక్తికి మెచ్చి సకల సద్గుణరాశియైన ఒక కుమార్తెను అనుగ్రహించాడు.యుక్త వయసువచ్చిన ఆమెకు శివ భక్తడైన ఇయర్కాన్ కాలికమార్నుని వరుడుగా నిర్ణయించాడు శివుడు.
" ఆట కదరా శివా ! ఆట కద కేశవ- ఆట కదరా నీకు అన్ని పనులు."
భక్తుని చరిత్ర అందముగా మరందముచిందాలని నిందను స్వీకరించుటకు ముందుకొచ్చాడు ఆ నందివాహనుడు. జడలు కట్టినకొప్పును అలంకరించుకొన్నాడు. ఓం కపర్దినేచ నమో నమ: అంతటితో ఆగక కొన్ని కేశములను యజ్ఞోపవీతమును చేసుకొని అలంకరించుకొన్నాడు,నమో వృక్షేభ్యో-హరికేశేభ్యో" అని సన్నుతులందువాడు.ఒక మహావ్రతుని రూపుదాల్చి నాయనారు ఇంటికి వేంచేశాడు.మహదానంద పడిన నాయనారు శివుని పూజించి,తనకుమార్తెను పిలిచి సాధువుకు నమస్కరించమని స్వామి దీవెనలు అందుకోబోతున్న తన బిడ్డను చూసి దొడ్డ సంబరమును పొందాడు." ఆనతి నీయరా శివా" అంటు మైమరచిపోయాడు.
కపర్డిగా వచ్చిన సాధువు ఆశీర్వచనమునకై వంగిన వధువు కబరీ బంధమును (కేశ సంపద-జడ) చూసి తనను తాను వ్యుప్త కేశుడిగా (కేశములు లేని వాడిగా) భావించుకొని,నాయనారుతో అమ్మాయి కేశ సంపదను తాను మోహించానని,దానితో పంచవటిని నిర్మించుకుంటానని,
కనుక తనకు ఇయ్యమని కోరాడు."శివ శివ! అమంగళము ప్రతిహతమగుగాక"!. ధూర్జటి చెప్పినట్లు అన్నీ తన దగ్గరనే ఉన్నను ఆత్మార్పణశక్తిని పరీక్షించుచు మైమరచిపోతుంటాడు ఆ జడల రామలింగేశ్వరుడు..ఏ మాత్రము ఆలోచించకుండా తక్షణమే కోసి, దానిని శివార్పణము చేస్తూ "జటాజూట ధారి-శివా చంద్రమౌళి,నిటాలాక్ష నీవే సదా మాకు రక్ష అని ప్రార్థించిన మన కంచార నాయనారు కుమార్తెను దీర్ఘ సుమంగళిగా దీవించిన ( ఆమె కేశపాశము తిరిగి వచ్చేసింది) జటలలో గంగమ్మను బంధించిన భోళా శంకరుడు మనలందరిని తన కరుణతో బంధించును గాక.
మాన కంచర నాయనారు సంతానమునకై నీలకంఠుని అకుంఠిత దీక్షతో తపమాచరించి,ఆశీర్వచనముగా లక్ష్మీస్వరూపమైన కుమార్తెను పొందెను.
పెళ్ళికూతురును మురితుచు ముస్తాబు చేస్తున్నది బాహ్యము.పరీక్షాసమయమాసన్నమయినదనుచు ప్రవేశించుచునది దైవము ఆంతర్యము.
ఘటనాఘటనా సమర్థుడు కళ్యానమందపమునందు సమీపించాడు .ఘటనాఘటనా సమర్థుడు క్
తుమ్మెదరెక్కలౌ పోళ్యానమందపమునందు సమీపించాడు .నల్లని తుమ్మెదరెక్కల వంటి వధువు కుంతలములను నవరత్న మణులతో జడగంటలతో సూర్య చంద్రులతో పాపిడి బిళ్లలతో అలంకరిస్తున్నారు.
( ఏక బిల్వం శివార్పణం.) .
.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment