Tuesday, November 2, 2021

CHANDEESVARA NAYNAR

యక్షరాజ బంధవే దయాళవే నమః శివాయ దక్షపాణి శోభికాంచనాళవే నమః శివాయ పక్షిరాజ వాహ హృచ్ఛయాలవే నమః శివాయ అక్షిఫాల వేదపూత తాలవే నమః శివాయ. ముట్టడించిన మన్మథుని గుట్టువిప్పిన వానికి దండాలు శివా పుట్టుట-గిట్టుటను మట్టుపెట్టువానికి దండాలు శివా బెట్టుసేయక వరములిచ్చే పట్టుకొమ్మకు దండాలు శివా గుట్టుగా నాలోన దాగిన గుట్టదొరకు దండాలు శివా

IYAR PAGAI NAYANAR.

జన్మమృత్యు ఘోర దుఃఖహారిణే నమః శివాయ చిన్మయైక రూప దేహ ధారిణే నమః శివాయ మన్మనోరథావ పూర్తికారిణే నమః శివాయ సన్మనోగతాయ కామవైరినే నమః శివాయ కందర్పుని భస్మముచేసిన వానికి దండాలు శివా కరిచర్మము వస్త్రమైన వానికి దండాలు శివా కనకకాంతి కవచమైన వానికి దండాలు శివా సామగానము ప్రియమైన వానికి దండాలు శివా ఇయర్వగై అంటే లోక విరుధ్ధ స్వభావము కలవాడు.అంతే ఇంద్రియ లౌల్యత లేనివాడు.లోక విరుధ్ధ అభ్యర్థనను ఆక్షేపించక సమర్థించగలిగిన సౌశీల్యము.సూచనగా నాయనారు జన్మస్థలము కావేరి పట్తనము సముద్రగర్భమున చేరబోవుచున్న కావేరి పూం పట్టణము. వర్తక వంశము.శివభక్తుల సేవకుడిగా లబ్ధప్రతిష్టుడైనాడు. కావేరి పట్టణ వాసుడైన ఇయర్వగై నాయనారు నరనరాల్లో దాతృత్వమును జీర్ణించుకొన్న గొప్పశివ భక్తుడు.శివ భక్తులను శివ స్వరూపముగాభావించి,అడిగిన దానిని దానమిచ్చి,వారి సంతోషమే పరమేశ్వర అనుగ్రహ విశేషముగా భావించి,సంతసించెడివాడు. జీవుడు దేవుడు కావాలంటే శివుడు ఎన్ని పావులు కదపాలో-ఎన్ని కథలను నడపాలో.ఆ రావణ బ్రహ్మకు ఆలినిచ్చిన దాత కదా.వేరొకరి ఆలినికోరగా యాచకుడిగా మారదలచాడు." ఓం నమః శివాయ" త్రిపుండ్ర ధారియైనాయనారు ఇంటిముందు నిలిచాడు.శివ స్వరూపము అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించారు నాయనారు దంపతులు.చల్లకు వచ్చి ముంతను దాచటమెందుకని చల్లగా సంభాషణలో నాయనారు అడిగినది లేదనక ఇస్తావట.నిజమేనా అని సందేహముగా అడిగాడు.స్వామి నా దగ్గర ఉన్నది అయితే తప్పకుండా ఇస్తాను అన్నాడు అమాయకంగా ఇయర్వగై. ఆటను ప్రారంభించాడు కపటయోగి తాను ప్రతినా నిబధ్ధుడినై,అవివాహితునిగా నున్నానని,ఇప్పుడు తన బాగోగులు చూసుకునే వారి సమయమాసన్నమైనదని భావిస్తున్నానని,దానికి నాయనారు భార్య తగినదని కాని..కాని అంటు నీళ్ళు నమలసాగాడు వాళ్లను చూస్తూ పోనీలే నేను రిక్తహస్తములతో వెళ్ళిపోతానులే అంటూ,నాయనారును పరికించి చూదసాగాడు. ఇంద్రియ ప్రభావ రహితుడైన నాయనారు అతిథిని నిరాశపదనీయకుండా, అయ్యా మీ మనసులోని మాటను నిస్సంకోచముగా నాతో సెలవియ్యండి. నేను మీకు ఇచ్చిన మాటను జవదాటను అన్నాడు నిశ్చలముగా. నాకు నీవు అప్పగించబోతున్న నా సేవకురాలు, అదే నీ పత్ని నిన్ను,నీ గృహమును విడిచి నావెంట నేను తీసుకుని వెళ్ళు చోటుకు ఏ మాత్రము సంశయించక అనుసరించాలి ఆలోచించుకో మరొక్కసారి అన్నాడు మరింత చిక్కులో పెడుతు ముక్కంటి. లోకవిరుధ్ధమైనప్పటికిని,ఇయర్పగై యతి నిర్ణయములోని తప్పొప్పులను ఎంచక ఎంచక్కా ఒప్పుకున్నాడు.పరమ సాధ్వి పెదవికదపలేదు. పరీక్ష మరింత కఠినము కాసాగినది.చిత్రముగా బిత్తర చూపులు చూస్తున్నది. స్వామి! ఎందులకు జాగు.నేను నా త్రికరనశుధ్ధిగా నా భార్యను మీ సేవకురాలిగా సమర్పిస్తున్నాను సంతోషముతో స్వీకరించండి అన్నాడు సవినయముగా. క్షణమాగి ఇయర్వగై నేను ఈ ప్రాంతమునకు పరిచయములేని కొత్తవ్యక్తిని. మీరు మంది-మార్బలము తో స్థానబలము కలిగియున్నారు.నేను నీ భార్యను నా వెంట తీసుకుని వెళ్ళునప్పుడు,దానిని సహించలేని వారు నాపై దండెత్తి ,నేను నీవే ఆమెను నాకు కానుకగా ఇచ్చావని చెబితే నమ్మరేమో.నీ భార్యకు అన్యాయము చేస్తున్నాననుకుంటారో.నన్ను మోసగాడిననుకొని శిక్షిస్తారేమో అంటు బిక్కమొగము వేసుకొని,బిత్తర చూపులు చూడ సాగినాడు. ఎంతటి స్థితప్రజ్ఞుడు మన నాయనారు.స్థిమిత మనస్కుడై స్వామి! మీరన్నది ఒకింత ఆలోచించ వలసిన విషయమే.కనుక మీరు మీ సేవకురాలితో మా ఊరి పొలిమేర దాటువరకు నేను మిమ్ములను సమ్రక్షించుటకు కవచధారినై,ఖడ్గ హస్తుడినై మిమ్ములను అనుసరిస్తుంటాను అంటూ వారు బయలుదేరగానే అనుసరించసాగాడు. . అడ్దుపడినవారిని ఎదురొడ్డి వారి మడమను తిప్పించాడు.ఎగుడుదిగుడు కన్నులవాడు ఎగిసిపడుతున్న ఆనందముతో నాయనారు వంక తిరిగి వీడ్కోలు చెబుతున్నాడు. అడ్దుపడనీయని అరిషడ్వర్గ జితుడు అమితానందముతో వెనుకకు తిరిగి అడుగులను కదుపుచున్నాడు. తిరుచ్చైకాడు దేవాలయము దగ్గర శివుడు నాయనారును తిరిగి వెళ్లిపొమ్మనెను.కొంత దూరము వెళ్ళినాడో లేదో నాయనారు అని గట్టిగా పిలిచి అదృశ్యమయ్యాడు (నాయనారు కీర్తిని లోకవిదితము చేస్తూ) శివుడు.వెనుతిరిగిననాయనారుకుభార్యఒక్కతే కనిపించింది.పార్వతీ పరమేశ్వరులు దీవించారు.త్రికరణ శుద్ధిగా ధర్మపత్నిని శివునకు సమర్పించిన ఇయర్వగై నాయనారును కటాక్షించిన పార్వతి పరమేశ్వరులు మనందరిని కటాక్షించెదరు గాక ఏక బిల్వం శివార్పణం. .

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...