MOOHOORYAE EKAVEERIKAA

ఏకవీరికాదేవి "దత్తాత్రేయ సమారాధ్యా అనసూయాత్రిసేవితా ఏకవీరా మహాదేవి మస్తకేనైవ శోభిని రేణుకామాతా మాయా సమ్హార రూపిణి కృపయా పాతునస్సర్వాన్ మయూరే ఏకవీర్యకా". ఏకైవ అనేక రూపేషు-ఏకవీరా. ఏకైక శక్తి స్వరూపము జగత్కళ్యాణము కొరకు అనేకములుగా గోచరింపచేయునది ఏకవీరాదేవి.ఏకైక వీరత్వ స్వరూపము ఏకవీరాదేవి అని లలితాసహ్స్రనామస్తోత్రములో"సమానాధిక వర్జితా" అని కీరింపబడినది.అనగా అమ్మశక్తికి సమానమైన శక్తిగాని,అధికశక్తి కానిలేదు. ఒకే స్థితిలోనున్న శక్తి అనేక గతులలో ప్రవేశించి ప్రకటింపబడునది ఏకవీరాదేవి.ఈ తల్లిని ఏకవేణిదేవి అని కూదా కొలుస్తారు.అదితి అని ఛిన్నమస్త అని కూడా భావిస్తారు. దేవీభాగవత ప్రకారము ముహూర్ క్షత్రమును మాతాపురి,మాత్రిపురపురి అని కూడా వ్యహరించెడివారు.మరాఠీభాసలోఅమ్మను ఆయీ అంటారు.ఇక్కడివారు ఏకవీరా ఆయీ అని అమ్మను కొలుస్తారు. మాయాసతి కుచేయి మాహూరప్రాంతములో పడి రేణుకాదేవిగా/ఏకవీరాదేవిగా ఆవిష్కరింపబడినదని స్థలపురాణము చెప్పుచున్నది.పరశురామునికి ఈ క్షేత్...