Saturday, March 20, 2021

TIRUVEMBAVAY-18

 



 

  తిరువెంబావాయ్-18

  ******************


 అన్నామలైయన్ అడిక్కమలం శెన్రి ఇరంజు

 విణ్ణోర్ ముడియన్ మణిత్తోకై విరట్రార్పోల్


 కణ్ణార్ ఇరవై కదిర్వందు కార్కరప్పన్

 తణ్ణార్ ఒళి మళింగి తారకైకర్ తామకల


 పెణ్ణాయ్ ఆణాయ్ అళియుం పిరన్ గొళిచేర్

 విణ్ణాణి మణ్ణాణి ఇత్తనయం వేరాగి


 కణ్ణార్ అముదమాయ్ నిన్రన్ కళల్పాడి

 పిణ్ణే ఇంపుం పూంపునల్ పాయిందు ఆడేలో రెంబావాయ్


  సర్వాత్మా-సర్వరూపా పోట్రి

  *************************

 " సర్వేంద్రియాణాం నయనం ప్రధానం

   సాక్షాత్కరాణాం నయనం ప్రమాణం."


   తిరుమాణిక్యవాచగరు మనకు నోమునోచుకొనుచున్న పడుచుల అమృతసేవనమును గురించి ప్రస్తుతిస్తున్నారు.


 ఏమా అమృతము? వారు దానిని ఏ విధముగా సేవిస్తున్నారు? అను సందేహము కనుక మనకు వస్తే, అది

 కణ్ణార్ అముదమాయ్-కన్నులను అమృతము.నయన మనోహరము.నానాదోష పరిహారము.విడివడి రాలేని సౌభాగ్యము.


 తిరుమాణిక్యవాచగరు మనకు ఈ పాశురములో స్వామిలీలా విసేషములలోని రెండింటిని మచ్చునకు మనకు వివరిస్తున్నారు.

 మొదటిది స్వామి స్వయం ప్రకాశకత్వము.

 రెండవది స్వామి సర్వ ఉపాధికత్వము.


  స్వామి స్వయం ప్రకాశకత్వము ముందు మూడు అంశములను ఉదాహరనములుగా మనకు సూచిస్తు అవి ఏ విధముగా కాంతిహీనములై,వెలవెలబోయినవో చెబుతున్నారు.

 అవి దేవతలు ధరించిన వారి కిరీటములలో నున్న మణుల ప్రకాశము.

 వారు స్వామికి పాదనమస్కారమును చేయుటకు వారికిరీటములలోని,

మణిత్తోకై-మణుల ప్రకాశము వెలవెలబోయినది మన స్వామి పాదపద్మములకు నమస్కరిస్తు.

 బహుషా స్వామిసేవా సౌభాగ్యము వాటిని తమలో కలుపుకున్నవేమో ఆ ఆశ్రిత వాత్సల్య చరనములు.


 రెండవ ఉపమానము,

 కణ్ణార్-సూర్యుడు తన కిరణ ప్రకాశమును  కోల్పోయి వెలవెలబోతున్నాడట చిన్నబోయి.

 అంతేకాదు

తణ్ణార్-చంద్రుడు-తారకై-నక్షత్రములు

 కైకర్ తామకల-మినుకు మినుకు మనుచున్నవట.

 ఈ సంకేతము మనకు దేనిని సూచిస్తున్నాయి?

 మణుల ప్రకాశము కొంత స్థలము వరకే పరిమితము.దాని దాటి ప్రకాశించలేదు.

 సూర్య-చంద్ర-తారకల ప్రకాశము (పూర్తిగా) కొంత సమయము వరకే పరిమితము.

 సూర్యాస్తమయము తరువాత చంద్రోదయము.తారక ప్రకాశము.

కాని ఫ్రకృతి ధర్మ ప్రకారము చంద్రుడు తారకలు మనకు కనుమరుగు కావలిసినదే.సూర్యోదయమును స్వాగతించవలసినదే.

 స్వామి పరంజ్యోతి తత్త్వము స్వయంప్రకాశము.సామంతత్త్వము కాదు.దానికి సమయ-స్థలములతో నిర్బంధము లేదు.అదినిస్తుల ప్రకాశము.

 ఒక్కసారి ప్రహ్లాదుడు ప్రస్తుతించిన పరబ్రహ్మ తత్త్వమును గుర్తుచేసుకుందాము.

 తండ్రి అడిగిన ప్రశ్నకు తగినరీతిలో,

 

 "కలడాకాశంబున కుంభినిన్

  కలండగ్నిన్-దిశలన్

  పగళ్ళ నిశలన్

  ఖద్యోత-చంద్రాత్మలన్

  అంతటన్ కలండీశుండు

  వెతకంగా నేల ఈ ఆ ఎడన్"

  తెలియచేసినాడు.తిరుమాణిక్యవాచగరు ఇదేవిషయమును మరొక్కసారి మనవి చేస్తున్నారు.

 అదియును దర్శించి-ధన్యత నొందిన వారి అంతరంగము ద్వారా ఈ విధముగా,

 పెణ్ణాయ్-స్త్రీ ఉపాధిలో-

 ఆణాయ్-పురుష ఉపాధిలో

 ఆళియుం-వాటికి ఇతరములైన సకల చరాచరములలో చైతన్యముగా,

 పిరన్ కొళిచేర్-పరమాత్మ ప్రకటింపబడుతు కరుణతో మనలను పరిపాలిస్తున్నాడు.

 ఇది తెలుసుకొనినవారు 

కళల్ పాడి -స్వామి మహిమలను కీర్తిద్దామనుకుంటున్నారు.

 ఏ విధముగా

నిన్రన్-నిలబడి అంటే నిలుచుని యనియా?

 కాదు ఇక్కడ నిలబడవలసినది వారి మనసు.వారి శరీరము కాదు.


 నిశ్చల భక్తితో నిరంజనుని కీర్తించుటకు 

 పిణ్నే-ఓ బాలా! రా.

మనము ఈ పువ్వులతో ప్రకాశించుచున్న మడుగులోనికి ప్రవేశించి,స్వామి పాదసేవా సౌభాగ్యమనే క్రీడతో ధన్యులమగుదాము.

 పిణ్ణే-ఓ బాలా! 

 ఇం పూంపునల్ పాయింద్- ఈ పూలమడుగులో

 ఆడేలో రెంబావాయ్-వ్రత విధిగా క్రీడిద్దాము. 

 

 తిరు అన్నామలయై అరుళ ఇది

 అంబే శివే తిరు వడిగళియే పోట్రి.

 నండ్రి.వణక్కం.

 

  

 



TIRUVEMBAVAY-17


 



  






 






 తిరువెంబావాయ్-17




 **************








 శంగనవన్ పాల్ తిశై మగన్ పాల్




 ఎంగుం ఇలాదరోర్ ఇంబం నం పాలదన్








 కొంగుం కరుణ్ కుళలి నందమ్మాఇ కోదాట్టి




 ఇంగనం ఇల్లంగళ్ ఓరుం ఎళుంది అరుళి








 శంగమల పొట్పాదం తందరళుం సేవగనై




 అంగణ్ అరసై అడియోగళ్ కారమాదై








 నంగళ్ పెరుమానై పాడి నలంతి కళల్




 పంగయపూం పునల్ పాయిందాడేలోరెం బావాయ్.


 త్రయంబక-దిగంబర పోట్రి


 **********************




  












 












 తిరువెంబావాయ్-17

 **************


 శంగనవన్ పాల్ తిశై మగన్ పాల్ దేవర్గళ్ పాల్


 ఎంగుం ఇలాదరోర్ ఇంబం నం పాలదన్


కొంగుం కరుణ్ కుళలి నందమ్మాయ్ కోదాట్టి

ఇంగనం ఇల్లంగళ్ ఓరుం ఎళుంది అరుళి


 శంగమల పొట్పాదం తందరళుం సేవగనై

 అంగణ్ అరసై అడియోగళ్ కారమాదై


 నంగళ్ పెరుమానై పాడి నలంతి కళల్

 పంగయపూం పునల్పాయిందాడేలోరెంబావాయ్.










అరుణగిరిస్వామియే పోట్రి


 *********************


 "త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం" అని రుద్రము స్వామిని సంకీర్తించుచున్నది.


 స్వామి మూడు నేత్రములు సూర్య-చంద్ర-వైశ్వానరులుగా(అగ్నిగా) భావిస్తూ,


  ముక్కంటి మా ఇక్కట్లను తీర్చవయ్యా అంటు శరణుకోరుతుంటారు.




 స్వామి కన్నులు దయాసముద్రములు.కనుకనే మార్కండేయుని చిరంజీవిని చేసినవి.




 మోహపాశమునకు స్వామి కన్నులు దహనకారకములు.కనుకనే మన్మథుడు దహించివేయబడినాడు.





   స్థితికార్యమునకు స్వామి కన్నులు ఆధారములు.చేతనప్రదములు.కనుకనే మనలోని కుండలిని జాగృతమగుచున్నది.




 స్వామి కన్నులు భక్తి పరీక్షాపరికరములు.కనకనే తిన్నని-కన్ననిగా కరుణించినవి.


 స్వామి కన్నుల సౌందర్యమును-సామర్థ్యమును-సౌభాగ్యమును వివరించుట సాధ్యము కానిదని పుష్పదంతుడను గంధర్వుడు "శివ మహిమ్నా స్తోత్రము"లో ఒప్పుకున్నాడు.


 చెలి! ఓ అరాల కుంతలా! తుమ్మెదలను ఆకర్షింపచేయకల కేశబంధము కలదానా!




 కొంగుం కరుణ్ కుళలి నందమ్మాయ్-కరుణ అను సుగంధముతో నొప్పుచు, పరిమళించుచున్న సౌభాగ్యవతి,




 మన స్వామి,


 అవన్ పాల్-మనందరి రక్షకుడు. 


  అంతే కాదు


 తిశై ముగన్ పాల్-దిక్కులన్నింటికి పరిపాలకుడు


  అది మాత్రమే కాదు


 దేవర్గళ్ పాల్-దేవతలందరికి పాలకుడు




 స్వామి చల్లని చూపే సమస్తమును చల్లగా సంరక్షిస్తున్నది.


 స్వామి కన్నులు,


 శెన్ కణ్-కెందామరలు.


 జ్ఞాన సంకేతములు-ధర్మ సంస్థాపనములు-దయాంతరంగములు.




 తిరు మాణిక్య వాచగరు మనకు ఈ పాశురములో స్వామి ఏ విధముగా మన హృదయాంతరంగ వాసియై ఆశీర్వదించుచున్నాడో వివరిస్తున్నారు


 స్వామి సర్వాంగములు శొభాయమానములే-శోక నివారణము

లే.


 స్వామి ఇల్లంగళ్ ఎళుంది అరుళి -అనుగ్రహహించుచున్న ఆశీర్వచనము మనము మన స్వామి ఉనికిని తెలియచేసినది.




 స్వామి శెన్-కమల్-కెందామర వంటి పాదపద్మములను సేవించుటకు,


అంగణ్-సార్వభౌమాధికారులు


అరసన్-దేవతా సమూహములు


నిష్ఫలులైనారు-కారమాదై-చేయలేక పోయినారు.


 అంటు వారు మడుగు వైపునకు చూడగానే విరబూసిన పద్మములు

 స్వామి పాదసంకేతములుగా ప్రకటితమగుతు-పరిమళిస్తూ-పరవశిస్తూ తామరలు కొలనులో తరిస్తూ-మనలను తరింప చేస్తూ,తాదాత్మ్యమునకు తావైన వేళ,పావన పంకజమయమైన పొయిగైలోనికి ప్రవేశించి,స్వామి పాదములను వీడక-పరవశిస్తూ పాడుకుందాము.


 తిరు అన్నామలయై అరుళ ఇది


 అంబే శివే తిరువడిగళే పోట్రి.


 నండ్రి.వణక్కం.


















 
















 
























 








 









TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...