SURYA TANULEKHANAMU.

సూర్య తనూలేఖనము. ********************* " న ఉదేతివా న అస్తమేతి" -ఐతరేయ బ్రాహ్మణము. మన కంటితో నేరుగా చూడగలిగే పరమాత సూర్యభగవానుడు ఒక్కడే.ఉదయాస్తమానములు లేని పరమాద్భుతశక్తి.సూర్యుని భౌతికాంశమే మనకు కనబడే మండలము.చైతన్యాంశము మనము అనుభవిస్తున్న అనిర్వచనీయమూర్తి.తన నుండి వచ్చిన దేవతలను,సకలభువనభాండములను రక్షించుటకు అదితీగర్భ సంభూతుడైన అవ్యాజకరుణామూర్తి. "ఆదిత్యాయ నమోనమః." " అదితి" అను శబ్దమునకు "ఆకాశము-అఖండము" అను అర్థమును అనుసంధానము చేసుకుంటే అత్యంత సూక్ష్మమైన మహాశక్తి భరితము ఆకాశము.ఐతిహాసిక పరముగా దక్షప్రజాపతి కుమార్తె,కశ్యప ప్రజాపతి భార్య.ఆ మహాపతివ్రత అనుష్ఠాన ఫలితమే ఆదిత్యోద్భవము. అదితీ పుత్ర నమోస్తుతే. పలు రకములుగా సృష్టి ప్రకటింపబడి సాగుతుండగా క్రమక్రమముగా రజో-తమో గుణముల ప్రాబల్యత గలవారు దైత్యులుగను,సత్త్వగుణ సంపన్నులు దేవతలుగను వారు గుణములను బట్టి నామరూపములకు సంకేతములైనారు.కర్మానుసారముగా కాలభ్రమణములో దానవులు వీజృంభించి దేవతలపై దెబ్బతీసారు.అంటే రజో-తమో గుణములు చెలరేగి విజృంభించి,సత్త్వగుణమును మరుగున పడేటట్లు చేసినది. తమో...