కులయోగినులు
************
శ్రీదేవి ఖడ్గమాల/శక్తి శుధ్ధమాలామంత్రములోని ఐదవ ఆవరణములో మనచే కీర్తింపబడుచున్న అద్భుతశక్తుల సాంకేతిక నామమే కులయోగినులు.
అసలు కులము అంటే ఏమిటి?యోగము అంటే ఏమిటి?యోగినులు అనగా ఎవరు? అనే సందేహమును పోగొట్టుకుంటేకాని మనము శ్రీమాత అవ్యాజకరుణాతత్త్వమును అర్థము చేసుకొనలేము.అమ్మదయతో పెద్దలు మనకు అందించిన అనుగ్రహముతో,తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.
శ్రీమాత్రేనమః.
*********
కులము అను పదమును దేహముగా.అవయవముల సమూహముగా మనము కనుక అన్వయించుకోగలిగితే,అప్పుడు మనము యోగము అను శబ్దము యొక్క గొప్పతమును తెలుసుకునే ప్రయత్నము చేయగలము.
దేహములోదాగి (సూక్ష్మముగా) దానిని చైతన్యముచేయుచున్న మరొకశక్తి మరొకటి గలదని తెలుసుకొనగలుగుటయే యోగము.కన్ను దర్శనశక్తి అనే చైతన్యముపై ఆధారపడి చూడగలుగుచున్నదనుట ఎంత నిజమో ఆ దర్శనశక్తిని కన్నుకు భేదముగా గ్రహించగలుగుటయే యోగము.చూడకలుగుట కన్ను అన్న అవయవము యొక్క యోగ్యత.
ఏవిధముగా దర్శనశక్తి కన్ను అను అవయవముద్వారా ప్రకటింపబడుతున్నదో,అదేవిధముగా మనశరీరములోని ప్రతి అణువు మనలో దాగిన చైతన్యశక్తి యొక్క అనుగ్రహముతో మన ఉపాధి సజీవముగా ఉన్నది.దానికి సహాయపడు పది అద్భుతశక్తులకు మనము కులయోగినులను నామముతో కీర్తిస్తున్నాము.
అంటే మనకు యోగ్యతనందించు గొప్పశక్తులు కులయోగినులు.
రేఖాచిత్రముగా వీరిని మనము ఊహించుకుంటే ఒక డైమండ్ నాలుగు వైపుల రెండేసి త్రికోణములు కనపడుతూ,పది బిందువులు బయటకు కనిపించుచుండుటచే బహిర్దశారచక్రముఅని, దేహికి చైతన్యమును చూపునది కనుక సర్వార్ధసాధక చక్రమని స్తుతింపబడుతుంది.
మన శరీరములో కంఠస్థానము/విశుధ్ధి చక్రము దగ్గర పదిశక్తులు మనకు సహాయపడుతుంటాయంటారు సాంప్రదాయమును గౌరవించువారు.
ఈ పదిశక్తులలో
శుభములను కలిగిస్తూ,
1.సిధ్ధిప్రద,
2.సంపత్ప్రద,
3.ప్రియంకరి,
4.మంగళకారిణి
5.ప్రియంకరి
అను నామములతో
ఐదు శక్తులు,
అడ్దంకులను తొలగిస్తూ,
1.విఘ్ననివారిణి
2.దుఃఖహ్నివారిణి
3.సర్వమృత్యూప్రశమని
అన్న శుభనామములతో ,
దుష్టశిక్షణ-శిష్టరక్షణ చేస్తూ, సర్వవేళలలో/సర్వజీవులపై అన్న స్వభావమునకు గుర్తుగా సర్వ అన్న ఉపసర్గను కలుపుకొని
సర్వాంగసుందరత్వముతో-సౌభాగ్యములను వర్షిస్తున్నారు అమ్మ ఆనపై...
దేహాల నైజము వేరు.నిజమైన ఆత్మ తత్త్వము ఒకటే అని మనకు అర్థమయ్యేందుకే చెబుతున్నారా అన్నట్లు చేప-తాబేలు-పంది-సగముసిమ్హము/సగము నరుడు-మరుగుజ్జు ఇలా ఉపాధులలో వైవిధ్యమేకాని అందులో దాగిన చైతన్యముయొక్క ప్రత్యేకతను వివరిస్తున్నవి ఈ కులయోగినులు.
దశావతారములే ఈ పదిశక్తుల మరో కోణముగాను భావిస్తారు
అంతే కాకుండా మన దేహమును శక్తివంతముచేసే పది ముఖ్యమైన గాలులతో కూడా/అనారోగ్య సమస్యలను సమాధానపరచే శక్తులగాను భావిస్తారు.ఈ పది శక్తుల సహాయముతోనే మనము ఊపిరితీసుకొనుట వదులుట,కళ్ళరెప్పలు మూయుట-తెరచుట,విసర్జనలను చేయగలుగుట ఆవులింత మొదలగు పనులను చేయగలుగుతాము.
.