Thursday, July 28, 2022

BHAVANAMAATRA SAMTUSHTA

 హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వసుధాదౌతాం; త్రినేత్రోజ్జ్వలామ్‌ వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్‌!!

 శ్రీదేవిఖడ్గమాల అమ్మవారి యంత్రస్వరూప వివరనము.పది ఆవరణములలో అమ్మ సంకల్పముతో విస్తరింపబడిన ప్రకృతిశక్తులు సాధకునకు ఆత్మతత్త్వమును అర్థముచేసుకొనుటకు            ఏవిధముగా సహాయపడుచున్నవో ,అడ్దంకులను ఏ విధముగా తొలగించుచున్నవో,ఆకరషణలను ఏ విధముగా దూరముచేయుచున్నవో అమ్మ మనకు వివరించే అనుగ్రహము.
  విస్తరించిన అనేకానేక శక్తులలో కొన్ని రహస్యముగా,మరికొన్ని ప్రకటనముగా,కొన్ని దండిస్తూ,కొన్ని దయచూపుతూ,కొన్ని శరీర వ్య్వస్థలను సక్రమముగా నియంత్రిస్తూ,మరికొన్ని మానిసిక స్థిరత్వమును కలిగిస్తూ,ఒక్కొక్క అవరనమనే మెట్టును ఎక్కిస్తూ మనలో దాగిన మనను పరిచయము చేస్తుంది.మనలోని చైతన్యముతో మమేకము చేస్తుంది.   ఐం క్లీం సౌం అను మూడు బీజాక్షరలు నన్ను నాలోఉన్న నన్ను మధ్యలో దాగిన ప్రపంచమనే తెరను ఒకే వేదిక మీద చూపిస్తుంది.   ధన్యోస్మి మాతా ధన్యోస్మి.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...