SAUNDARYA LAHARI-MARAKATA
సౌందర్య లహరి-మరకత మణి ప్రాకారము పరమపావనమైన నీ పాదరజకణము పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము వృక్షో రక్షితము-సకలము మరకత మణిమయము ముక్కోటి దేవతా విలసిత షట్కోణ భవనము ఊర్థ్వ త్రికోణ బిందువులో బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు అథోకోణ బిందువులలో వారు శక్తిసమేతులు గౌరి-వేద అక్షమాలా సమేత మేథా దక్షిణామూర్తి ఈశాన్య కోణములో తేజ రత్నగర్భ గణపతి కోటి ప్రకృతుల సౌందర్యాల కూటమియైన. మరకత మణి ప్రాకారము సంసార తారకమగుచున్న వేళ నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా మానస విహారి! ఓ సౌందర్య లహరి.