Wednesday, April 25, 2018

SAUNDARYA LAHARI-MARAKATA


 సౌందర్య లహరి-మరకత మణి ప్రాకారము


   పరమపావనమైన నీ పాదరజకణము
   పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

    వృక్షో రక్షితము-సకలము మరకత మణిమయము
    ముక్కోటి దేవతా విలసిత షట్కోణ భవనము

    ఊర్థ్వ త్రికోణ బిందువులో బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు
    అథోకోణ బిందువులలో వారు శక్తిసమేతులు

    గౌరి-వేద అక్షమాలా సమేత మేథా దక్షిణామూర్తి
    ఈశాన్య కోణములో  తేజ రత్నగర్భ గణపతి

    కోటి ప్రకృతుల సౌందర్యాల కూటమియైన.
    మరకత మణి ప్రాకారము సంసార తారకమగుచున్న వేళ


    నీ మ్రోలనే   నున్న నా కేలు విడనాడకమ్మా,నా
    మానస విహారి! ఓ సౌందర్య లహరి.



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...