Wednesday, April 25, 2018

SAUNDARYA-INDRANEELAMANI PRAAKAARAMU

  సౌందర్య లహరి-ఇంద్రనీలమణి ప్రాకారము

 పరమపావనమైన  నీ పాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మస్వరూపము

 బ్రాహ్మి-కౌమారి-చాముండ-వైష్ణవి-వారాహాది అష్ట
 మాతృకా శక్తుల వైఢూర్య నిలయములను దాటుకొని

 ఇంద్రనీలమణిమయ పదహారు దళములున్న
 పదియోజనముల విస్తీర్ణమున్న  పద్మాకార భవనము

 కాళి-కరాళీ-ఉష-దుర్గ-సరస్వతి-లక్ష్మి ఇత్యాది
 పదహారు శక్త్ల పరివేష్ఠిత  ప్రాకారములో

 శింజానమణి మంజీర మండితశ్రీ  పదాంబుజను
 దయాసంద్రముగా  ధ్యానములో దర్శించుచున్న వేళ

 నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ! ఓ సౌందర్య లహరి.

 అష్టమాతృకాశక్తుల వైఢూర్య నిలయములను  దాటిన తరువాత,పదహారు ఇంద్రనీలమణి రేకులున్న పద్మాకార భవనము ప్రజ్ఞావైభవమై ప్రకాశిస్తోంది.పద్మము జ్ఞానమునకు సంకేతము.పద్మము సూర్యుని ఉషోదయ కిరణాలతో వికసిస్తుంది.బురదలో పుట్టి,బురదలోనే ఉంటున్నప్పటికిని దానిచే ఏ మాత్రము ప్రభావితము కాకుండా ప్రకాశతత్త్వముతో పరిమళిస్తుంటుంది.పద్మాకారా భవనములోని పదహారు రేకులు అమ్మచే సంకల్పమాత్ర సంభవములైన జ్ఞాన సంకేతములు.పద్మాసనే-పద్మకరే సర్వలోకైక పూజితే-నమో నమః.ఇంద్రనీలమణి ప్రాకారములో దయాసింధువైన పరాశక్తిని ధ్యానములో దర్శించుచున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...