Posts

Showing posts from November 30, 2020

MEEDHUSHtAMA SIVATAMA-19

Image
  మీఢుష్టమ శివతమ-19  ********************  నిన్ను విడిచి ఉండలేనయా-కైలాసవాసా  నిన్ను విడిచి ఉండలేను కన్నతండ్రి నీవుకావ  నన్ను విడిచి పారిపోకయా-    "పృధివీచమ ఇంద్రశ్చమ-అంతరిక్షంచమ ఇంద్రశ్చమే-ద్యౌశ్చమ ఇంద్రశ్చమే"  వినిపిస్తోంది చమకములోని అర్థేంద్ర అనువాకము.  ఈసారి భావమునుకూడ వివరిస్తున్నారు.భూమితో కూడివచ్చిన ఇంద్రుడు-ఆకాశముతో కూడి వచ్చిన ఇంద్రుడు-స్వర్గముతో కూడి వచ్చిన ఇంద్రుడు అంటూ.   రుద్రా! ప్రతిసారి ఇంద్రశ్చమే-ఇంద్రశ్చమే అని అంటున్నారు.వీరందరితో పాటుగా తాను వెళుతున్నాడు.వారు మాత్రం ప్రత్యేకముగా కనిపించటములేదు.ప్రతిసారి తనను పేరుపెట్టి పిలుస్తేనే వస్తానన్నాడా ఏమిటి? అని రుద్రుని చెవిలో గుసగుసలాడాడు.   "నమో బృహతేచ వర్షీయతేచ."  దేశము-కాలము-వస్తువు అను మూడువిధములైన పరిమితులు లేనిది బృహత్ శబ్దము అదే బ్రహ్మము.  గుణై వర్షీయతే.   గుణములచే అధికముగా నొప్పువాడు.స్వరూపమును వేడుకగా ధరించువాడు అగు రుద్రునకు నమస్కారములు.   ప్రారంభమైనది ప్రదర్శన.  మిస్టర్.పృధ్వి గొప్పదనమును చెప్పనారంభించాడు నిర్దేశకుడు ఇంద్ర. నమో విరూ...

MEEDHUSHTAMA SIVATAMA-18

Image
   మీఢుష్టమ శివతమ-18   ********************  నిన్ను విడిచి ఉండలేనయా-కైలాసవాసా.  నిన్ను విడిచి ఉండలేను కన్నతండ్రి నీవే కాద-  నిన్ను విడిచి ఉండలేనయా.  నేపథ్యములో నుండి వినిపిస్తున్నది, " శోఏమశ్చమ ఇంద్రశ్చమే-సవితాచమ ఇంద్రశ్చమే"  అంటు సుస్వరముతో వీరు తరగతి గదిలోనికి ప్రవేశించుచున్నప్పుడు.  ఆ తరగతి అమ్మాయి " సూషాచమే-సుదినంచమే" అంటు అయ్య ఈ రోజు మాకెంతో సుదినం అంటూ వారికి ఆసనములను చూపించింది.  ఇంద్ర గారికి ఛేరో పక్కన చంద్ర-సూర్య గారలు కూర్చున్నారు.    అసలు నేనే వాళ్ళు-వాళ్లే నేను అన్నట్లుగా ఉంటుంది మా చిత్రకుటుంబము.అంటూ మిస్టర్ సూర్య వంకకు తిరిగారు.  "అసౌ యస్తామ్రో అరుణ ఉతబభ్రు సుమంగళ."   ఉదయము నుండి అస్తమానము వరకు రంగులను మార్చుతు అందరికిని మంగళములను కలిగించువాడు.   ఎంతటి చతురుడంటే మా చిత్రములోని పాత్రధారులను వారి నిజరూప నామములను మరిపించేస్తాడు.తన మాటలతో-చేతలతో ఎంతో ఉత్తేజ పరుస్తూ,పనిచేస్తున్నా మన్న భావననే తొలగించేస్తాడు.   మా యజ్ఞం సినిమా కళాకారుల నుండి కొత్త ప్రతిభను అందింపచేస్తాడు.గొప్ప చతురుడులెండి.  మా స...

MEEDHUSHTAMA SIVATAMA-17

Image
  మీఢుష్టమ శివతమ-17 ************************* నన్ను వదిలి వెళ్ళిపోకయా-కైలాసవాసా నన్ను వదిలి వెళ్ళిపోకు కన్నతండ్రి నీవు కాద నన్ను వదిలి వెళ్ళిపోకయా. రుద్రా! ఇంట్లోపిల్లలు ఒకటే హడావిడి చేస్తున్నారు.ఇవ్వాళ ఉపాధ్యాయ దినోత్సవమట. రాధాకృష్ణన్ గారిని స్మరించుకుంటూ,వారు ప్రస్తుత ఉపాధ్యాయులను శ్రోతలు-ప్రేక్షకులను చేసి,వారు ఉపాధ్యాయులై ప్రవర్తిస్తారట.వింటుంటేనే వింతగా ఉంది. మనిద్దరము వెళ్ళి చూసి వద్దామా?ఆశగా అడిగాడు రుద్రుని సాధకుడు. ( ఎక్కడ పారిపోతాడో-పక్కనే కూర్చోపెట్టుకుంటే పోలా) మక్కువగా పిలుస్తున్నాడు.వెళ్ళి పక్కన కూర్చుంటే పోలా అనుకున్నాడు రుద్రుడు. ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. " శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షిణాంగే వహంతం నాగం పాశంచ ఘంటాం డమరుక సహితం చాంకుశం వామభాగే నానాలంకారదీప్తం స్పటిక మణినిభం పార్వతీశం నమామి." ఒక విధ్యార్థిని వచ్చి సభకు నమస్కరించి,మొదటగ మనము "యజ్ఞం" సినిమా నిర్మాత-దర్శకుడు ఇంద్రగారితో మాటా-మంతి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము.( పరిచయము అవసరములేని వ్యక్తి) వెనుక నుండి వినిపిస్తున్నది....

MEEDHUSHTAMA SIVATAMA-16

Image
  మీఢుష్టమ శివతమ-16. ******************* నన్ను వదిలి వెళ్ళిపోకయా-కైలాసవాసా నన్ను వదిలి వెళ్ళిపోకు కన్నతండ్రి నీవు కాద నన్ను వదిలి వెళ్ళిపోకయా. రుద్రా! నేను పిలువకున్నా వచ్చేవాడివి.ఇప్పుడు ప్రేమతో రమ్మన్నా రావటములేదు. మనసంతా చిందర-వందర. కాసేపు పార్కుదాకా వెళ్ళివస్తాను అంటు అడుగులను కదుపుతున్నాడు. ******************* మైకులో వినిపిస్తున్నది.ఇది ప్రకృతి నియమము.ఆకలి వేసినపుడు మనము ఆహారము వద్దకు వెళ్ళాలి కాని అది మన దగ్గరకు రాదు. అలాగే నది తన మార్గములో తాను ప్రవహిస్తూ ఉంటుంది.దాహము వేస్తే మనమే దానిదగ్గరకు వెళ్ళాలి.అది మన దగ్గరకు రాదు కాని మనము వెళితే నీళ్ళను తాగనీయను,-దాహము తీర్చను అనదు.. నమో భవాయచ-రుద్రాయచ. ప్రాణులందరికి కారణమైన భవునకు నమస్కారము.రోదనమునకు హేతువైన కారణమును పోగొట్టు రుద్రునకు నమస్కారము. జ్ఞానము అంతే-జతగా నడుస్తూ అన్నాడు రుద్రుడు. అంతే-అంతే అన్నాడు. సాధకుడు. పార్కులోని టి.వి నుండి వయోజనవిద్య ప్రాయోజిత కార్యక్రమము మాత్రము నేరుగా మీ దగ్గరికేవస్తున్నది. మిత్రులారా! నమస్కారము. ఇది ఏమిటో కాసేపు కూర్చుని చూద్దాము అన్నాడు రుద్రుడు. " కాచేది నీవైతే-కాసేపే ఎందుకు? "కళ్ళప్పగ...

MEEDHUSHTAMA SIVATAMA-15

Image
  మీఢుష్టమ శివతమ-15 ********************* న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రుని సేవింపలేడు. తెల్లారిందా? మీ అల్లరికి,మొదలెట్టేసారు.అర్థాంగి అంతటితో ఆగకుందా... అదృష్టవంతులు మీ నాన్న. బారెడు పొద్దెక్కినా..ఏ బాదరబందీ లేకుండ.. ఒక్కసారిగా మెళుకువ వచ్చింది సాధకునికి. అంటే- ఇప్పటివరకు నేననుభవించినది, సత్యమా? లేక స్వప్నమా? "నమ స్స్వపధ్యో జాగ్రదభ్యశ్చవో నమః". నిద్రించుచున్న రుద్రునికి నమస్కారము.మేల్కాంచుచున్న రుద్రునికి నమస్కారము వినబడుతోంది రుద్రము సాధకుని సందేహమునకు మరింత సందడి చేస్తూ. కనికట్టుచేస్తున్నావన్నానని,ఈ రుద్రుడు ఏకంగా, నా కలలలోనే అలజడిని తెప్పిస్తున్నాడు.అమ్మో! అమ్మో! సామాన్యుడు కాడు.కానే కాడు. నేను గీసినగీత జవదాటనట్లే ఉంటాడు.తనకు నచ్చిన పనులు నా చేత చేయించుకుంటూనే ఉంటాడు. అమ్మ సంగతి నాకు చెప్పనేలేదు.ఎంతసేపు తానే అనుగ్రహించువాడిగా అనిపిస్తుంటాడు. అమ్మ దగ్గర ఎన్ని నాటకాలాడాడు.నన్ను ఎన్ని మాటలన్నాడు.రెండు చేతులను కొంచము కొంచము జరుపుతు , ఇంతనా? ఇంతనా? ఇంకొంచమా? అంటు ఎంత కావాలోచెప్పమంటు ఎన్ని తిప్పలు పెట్టాడు. " నమోవంచతే పరివంచయే స్తాయునాం పతయే నమః" అ...

MEEDHUSHTAMA SIVATAMA-14

Image
  మీఢుష్టమ శివతమ-14 ********************** న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రునిసేవింపలేడు. గుడిలో సుష్టుగా ప్రసాదము తిన్నాడు.గుర్రుపెట్టాలనిపిస్తోంది మనసుకు. తెల్లవారదా, రుద్రుని నాటకములు తేటతెల్లముకావా, అనుకుంటూ,ఆవులిస్తూ,శయానేభ్యుడైనాడు సాధకుడు. ఆసీనేభ్యుడు అంతటితో ఆగనిస్తాడా? సాగకుండా , వెండికొండపై అమ్మతో నిండుగా ఆసీనుడైఉన్నాడు. వారి పాదపద్మముల చెంత ఎందరెందరో దివ్యపురుషులు సేవిస్తున్నారు. సభాభ్యో-సభాపతిభ్యశ్చవో నమో నమః. సంభ్రమాశ్చర్యములతో ఉక్కిరి-బిక్కిరి అవుతున్నాడు సాధకుడు. దేవీ! రోజూ సంభాషించి వస్తుంటానే అతనే ఇతడు.చూసి-వెళదామని వచ్చాడు అంటున్నాడు రుద్రుడు అమ్మతో. నిలదీద్దామని వస్తే-నిందిద్దామని వస్తే నా ముందరికాళ్ళకు బంధమేసాడు అనుకుంటు,చేసేదిలేక, అమ్మకు నమస్కరించాడు. అదికావాలి/ ఇది కావాలి అని అడుగనిస్తుందా ఆ అవ్యాజకరుణ. అంతకు మునుపే ఆప్యాయంగా, ఏదైనా కావాలా నాయినా? అన్నది . మమకారానికి దాసోహమైన వెటకారము పలాయనం చిత్తగించింది. తరిగిపోని ధాన్యరాశులు కావాలి అమ్మ. అక్షితిశ్చమే-అక్ష్తుతశ్చమే అర్థిస్తున్నాడు భక్తితో. ఎటువంటి ఆహారము కావాలి? నాయినా! ( ఐహిక సంబంధమా/ఆధ్యా...

MEEDHUSHTAMA SIVATAMA-13

Image
  మీఢుష్టమ శివతమ-13. ********************** న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడుకానివాడు రుద్రుని దర్శింపలేడు.దయను పొందలేడు. అమ్మో రుద్రా! నువ్వెంత గడుసరివి.నేరుగానీవు నాతో చెబితే ఎక్కడ కాదంటానేమోనని,నా కన్నుకు కట్టు వేస్తూ,మొత్తానికి నిన్ననాచే మట్టి గొప్పదని గట్టిగానే ఒప్పించావు. ఆలయములో నుండి అత్యంత మధురముగా, " నమః ఉర్వర్యాయచ-ఖల్యాయచ" అని వినిపిస్తోంది. పంటలతో-ధాన్యముతో నిండియున్నా భూమిగా-దానిలోని ధాన్యముగా నుండియున్నావాడు అని. కాని ఇప్పుడేమో ఒకటే క్షామము.ఎక్కడి ధాన్యరాశులు?ఏమాయిపోయాయి? అడుగుతున్నారు భాగవతారుని అసహనముగా భక్తులు. ఏమయినాయంటే పరమాత్మ ఎందుకో, " వర్షాయచ-అవర్షాయచ" గా తన రూపమును మార్చుకున్నాడు.వర్షపుజలాలను సముద్రజలముగా మార్చివేసాడు.అందుకు.అందులోను ఏదో పరమార్థము దాగిఉంటుంది అంటూ ఏదో చెప్పబోతున్నాడు . చిర్రెత్తుకొచ్చింది సాధకుని.నేరుగా ఆలయములోని వెళ్ళాడు.సూటిగా చురకత్తి చూపులతో నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను.రోజుకొక మాట చెబుతారు.దానికి మీరు చెప్పే వివరణ క్షణ-క్షణము పరీక్షలనే మిగులుస్తున్నది. బిత్తరపోయి చూస్తున్నాడు భాగవతారు.తత్తరపాటుత...