Monday, January 29, 2018

TIRUPPAAVAI-05

మాయనై మన్ను వడ మదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్ తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోండ్రుం అణివిళక్కై
తాయైక్కుడల్ విళక్కం శెయద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూ మలర్ తూవిత్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళయుం పూగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శెప్పేలో రెంబావాయ్
ఓం నమో నారాయణాయ-5
************************
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది
పాలుతాగినంతనే పూతన పాపాలు పరిహారమైన
మురిపాల బాలగోపాలుని మేలుకొలుపులలో
యశోదమ్మ పున్నెమేమో తనకుతాను కట్టుబడిన వాడైన
మన్నుతిన్న వాడన్న దామోదర రూపములో
వ్యత్యస్త పాదారవిందములతో కాళియమర్దనమైన
ప్రస్తుతించి పులకించిన పశుపక్షి గణములలో
మధుర నిర్వాహకుడు మన వ్రతనాయకుడైన
ఆగామి సంచిత హరుని ఆగమ స్తుతులలో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా! రారె
తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె
భావము
పాలుతాగి,పూతన పాపాలను తొలగించిన నల్లనయ్య మేలుకొలుపులలో,అమ్మకు పదునాలుగు లోకములు చూపించి,తనకు తానుగా దొరికి యశోదచే రోటికి కట్టబడిన దామోదరునిలో,( పొట్ట మీద తాటిగుర్తు కలవాడు),కాళియ మర్దనముతో పశు-పక్ష్యాదులను కాపాడిన వానిలో,సర్వ పాపములను పోగొట్టువాడును,మన వ్రత నాయకుడగు కృష్ణుని యందు నిమగ్నమైన నా మనసు,పాశురములను కీర్తించుచు,భక్తి అను పువ్వులను,శరణాగతి అను దారముతో,అల్లిన హారములను,స్వామికి సమర్పించుటకు చెలులారా! కదిలి రండి.తెల్లవారు చున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

TIRUPPAAVAI-06



పుళ్ళుం శిలంబినకాణ్ పుళ్ళరైయన్ కోయిలల్
వెళ్ళై విళి శంగన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్ఎళుందిరాయ్  పేయ్ములై నంజుండు
కళ్ళాచ్చగడం కలక్కళియక్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉళ్ళత్తుకొండు మునివర్గళుం యోగిగళుం
మెళ్ళ ఎజుంద్ అరి ఎన్న పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుంద్ ఏలో రెంబావాయ్.
ఓం నమో నారాయణాయ-6
*************************
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
నాయందే కలడనుకొనుచు బృందావన వాసుడైన
గోవిందుని అనుగమించు గొల్లెతల పెడకొప్పులలో
వేదవేదాంత వేద్యుని వేణుగాన పరవశులైన
యమునా రాస విహార రమణుల కుడిపైటలలో
మధురానగర విహారి మధుర గంభీర ధ్వనియైన
శంఖధ్వనితో కూడిన మోగిన జేగంటలలో
ఆ మాయావి ఏమిచేసెనో శతక్రతు సమానమైన
వ్రత వైభవమును మరచి నిదురించుచున్న గోపికలో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె
భావము
పదిమందికి స్వామి అనుగ్రహమును పంచదలచి,గొల్లెతగా కుడిపైట-పెడకొప్పు ధరించి,శంఖధ్వనిని వినమని,వ్రతము మరచి నిదురించుచున్న గోపికను జేగంట వినపడుచున్నది కనుక నిద్రలెమ్మని అనుచున్న అమ్మలో,నిమగ్నమైన నా మనసు పాశురములను కీర్తించుచు,భక్తి అను పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను,స్వామికి సమర్పించుటకు,చెలులారా! కదిలి రండి.తెల్లవారుచున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం

TIRUPPAAVAI-07

కీశు కీశెన్రెగుం మానై  చత్తాన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిరయ్యో పేయ్పెణ్ణే
కాశుం పెఱప్పుం కలకల్ప్పైకె పేర్తు
వాశ నఱుం కుజలాయిచ్చయర్ మత్తినాల్
ఓశై పడుత్త తయిర రవం కేట్టిలైయో
నాయగ పెణ్ పిళ్ళాయ్ నారాయణ మూర్తి
కేశవునై పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశ ముడైయాడ్ తిఱన్వేలో  రెంబావాయ్



ఓం నమో నారాయణాయ-7
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది
భరధ్వాజ పక్షులకు భగత్చింతన యైన
ఖగరాజ వాహనుని సుప్రభాత సేవలలో
ముద్దరాలు ఈమె అని నిద్దురలేపుచున్నదైన
ప్రేమ పూరితమగు "పిచ్చి పిల్లా " అను పిలుపులో
నవ మన్మథుని మించిన నగధర రూపమైన
అగణిత గుణగణుని కొలుచు అగరు ధూప పరిమళములో
రేపల్లెలో గొల్లెతలు చల్ల చిలుకు వేళయైన
నల్లనయ్యను పిలుచు కవ్వపు సవ్వడులలో
తెల్లవర వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్ల బరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము
పుణ్యాల పంటైన భరధ్వాజ పక్షుల కిచకిచలలోను,ఆండాళ్ తల్లి గోపికను ప్రేమతో పిలిచిన "పిచ్చిపిల్ల" అను పిలుపులోను,స్వామి కైంకర్యములో ధన్యమగు చున్న అగరుధూపముల లోను,గొల్లెతల కవ్వపు శబ్దములలోను నిమగ్నమైన నా మనసు,
పాశురములను సంకీర్తించుచు,భక్తి అను పూలను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను సమర్పించుటకు చెలులారా కదిలిరండి.తెల్లవార వచ్చుచున్నది.
(ఆండాళ్ తిరువడిగళే శరణం )..

TIRUPPAAVAI-08

కీళ్ వానం వెళ్ళెన్రు ఎరుమై శిఱువీడు
మేయ్వాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం
పోవాన్ పోగిన్రారై ప్పోగామల్ కాత్తు ఉన్నై
క్కూవువాన్ వందు నిన్న్రోం కోదుకుల ముడైయ
పావాయ్ ఎళుందిరాయ్ పాడిప్పఱైకొండు
మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చెన్రురాం శేవిత్తాల్
ఆవా వెన్రా రాయుందరుళ్ ఏలో రెంబావాయ్
ఓం నమో నారాయణాయ-8
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరి నామసంకీర్తనమే కోరుతోంది
వేణుగానలోలునినయన భానూదయ ప్రసాదమైన
లేగ దూడలు మేయుచున్న లేలేత చిగురు పచ్చికలో
రేపల్లెలలో రేయి-పవలు గోవింద రూపములైన
గోపాలుర-గొల్లెతల పావై-పామర భాషలలో
చందన చర్చిత ధారి చదరంగపు పావులమైన
ఇదిగో! అని ఇస్తున్న "పఱి" అను పురుషార్థములో
పదిమందికి పంచగలుగు పారమార్థికమైన
భువనమోహనుని కొలుచు బుద్ధి పాశురములలో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము
ఉదయముననే లేత పచ్చిక తినుచున్న లేగ దూడలలో,రేపల్లె వాసుల పండిత-పామర భాషలలో,స్వామి అనుగ్రహించబోతున్న పఱి అను వాయిద్యములో,పదిమందితో కలిసి జరుపుకునే పరమ పావనమైన పెరుమాళ్ సేవతెలుపు బుద్ధి పాశురములో నిమగ్నమైన నామనసు పాశురములను కీర్తించుచు,భక్తి అను పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను స్వామికి సమర్పించగ చెలులారా కదిలిరండి.తెల్లవార వచ్చు చున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

TIRUPPAAVAI-09



తూమణి మాడత్తుచ్చుత్తం విళక్కెరియ
తూపం కమళత్తుయిలణైమేల్ కణ్వళరుం
మామాన్ మగళే! మణిక్కదవం తాళ్తిరవాయ్
మామీర్! అవళై ఎజుప్పీరో ఉన్మగళ్ తాన్
ఊమైయో అన్రి చెవిదో అనందలో
ఏమపెర్రుందుయిల్ మందిరప్పట్టాళో
మామాయన్ మాధవన్ వైగుండన్ ఎన్రెన్రు
నామం పలవుం నవిన్ర ఏలో రెంబావాయ్ .
ఓం నమో నారాయణాయ-9
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
వేద సం రక్షణార్థము " వేదాంతవేద్యుడైన"
జలచరమై జయమొసగిన "మత్స్యావతారములో"
"ధర్మ సంస్థాపనకు" క్షీరసాగర మథనమైన
ఉభయచరమై ఉద్ధరించిన " శ్రీకూర్మావతారములో"
" పరమపునీత భూమాత" అసురహస్తగతమైన
అమ్మను రక్షించిన " ఆదివరాహరూపములో"
"దశేంద్రియములు మేల్కొలుపు" దశావతారములైన
వివిధరూపములు ధరించిన " విరాట్రూపములో"
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము
పరిశుద్ధమైన మణిసదనములో ఆదమరచి నిదురించుచున్న గోపిక స్వామిసేవకు సిద్ధముకాలేదని,పిలుచుచున్నను మేల్కొనుటలేదని,అమె పక్కనున్న తల్లిని మేలుకొలుపమని,వైకుంఠవాసా-మాధవ అని కీర్తించుచు పూజకు తోడ్కొనవలెనని గోదాతో కూడిన గోపికలనుచున్నారు ఇది బాహ్యార్థము.ఆంతర్యమును అవలోకించగలిగితే ఆళ్వారుల అంశయై గోపిక యోగనిద్రలోనుండి బహిర్ముఖము కాక తనలో తాను రమించుచు ధన్యతనొందుచున్నది. .
( దశ,శత,సహస్ర మొదలగు శబ్దములు సంఖ్యను తెలియచేటయే గాక విశేషార్థములో లెక్కలేనన్ని అనికూడా సూచించు చున్నవి."దశ" అను శబ్దమునకు పది అను సంఖ్యవాచకము మాత్రమే కాకుండా ధర్మమును రక్షించే స్థితి అను అర్థమును ఆర్యులు సెలవిచ్చారు కదా!ఉదా దశ తిరుగుట-స్థితి మారుట.) నాలుగు వేదములను కాపాడిన స్వామి చేప అవతారములోను,మంధర పర్వతమును మునుగకుండ కాపాడిన తాబేటి అవతారములోను,భూమాతను రక్షించిన ఆదివరాహస్వామి లోను,నాలోని దశేంద్రియముల (జ్ఞానేంద్రియములు 5,కర్మేంద్రియములు 5) బాధ్యతను తెలియచేయుచున్న స్వామి మూలరూపమునందు నిమగ్నమైన నా మనసు,పాశురములను కీర్తించుచు,భక్తి అను పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను స్వామికి సమర్పించుటకు చెలులారా! కదిలి రండి. తెల్లవారుచున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

TIRUPPAAVAI-10



నోత్తుచువర్గం పుగుగిన్ర అమ్మనాయ్
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాళ్
పోత్తపఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్
కూత్తత్తిన్ వాయ్ వీళంద కుంబకరణనుం
తోత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో
ఆత్త అనందలుడయాయ్ అరుంకలమే
తేత్తమాయ్ వందుతిఱ ఏలో రెంబావాయ్
ఓం నమో నారాయణాయ-10
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
ప్రభువుల,పడతుల,ద్విజుల కర్తవ్యపాలనమైన
నెలకు, ఆరక కురియుచున్న మూడు వానలలో
బురద అంటనీయని వైరాగ్యపు భాష్యమైన
"మణి కైరవ" దిగుడుబావి విరబూసిన తామరలలో
పూర్వ పుణ్యఫలముగా యోగ తాదాత్మ్యమైన
అంభోరుహనేత్రి పోవుచున్న కుంభకర్ణుని నిద్రలో
'ఉడైయార్ ఆరుఙ్ లమే"అని అగస్త్యుని తలపించినదైన
అమ్మ కీర్తించుచున్న ఆ ఆభరణపు పాశురములో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము.
మాయ తెరను తొలగించుకొని,మాధవ సరస భావనలో నున్న గోపికను,తలుపును (మాయతెర)
దాటలేని గోపికలు,స్వామిని సేవించుటకు నిదురను చాలించి తమతో రమ్మనుచున్నారు.కుంభకర్ణుని గెలిచి,అతని వద్ద నుండి కప్పముగా నిద్దురను స్వీకరించిన దానా!(బాహ్యార్థము)
తామస గుణమును జయించి,తత్ఫలితముగా,తనలోని పరమాత్మతో రమించుచున్న దానా!(విశేషార్థము.)
సస్యశ్యామలతకు కారణమైన వానల వలన ఏర్పడిన బురద నుండి పుట్టినప్పటికిని సంసారమనే బురదను అంటనీయకుండ జ్ఞానముతో ప్రకాశించుచున్న గోపిక యొక్క యోగ తాదాత్మ్యతలో,"ఉడైయార్ ఆరుంకలమే " అని అమ్మచే కీర్తింపబడుచున్న అగస్త్య మునిలో,జ్ఞానాభరణ పాశురములో నిమగ్నమైన నా మనసు పాశురములను కీర్తించుచు,భక్తి అనే పువ్వులను శరణాగతి అను దారముతో అల్లిన హారములను స్వామికి సమర్పించుటకు చెలులారా కదిలి రండి.తెల తెలవారుచున్నది.

TIRUPPAAVAI-11



కత్తు కఱవై కణంగళ్ పలకఱందు
శెత్తాల్ తిఱల్ అరయ చెన్రు శెరుచ్చెయుం
కుత్తం ఒన్రిల్లాద కోవలర్ దం పొఱ్కొడియె
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తుత్తోరిమార్ ఎల్లారుం వందు నిన్
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్పాడ
శిత్తాదే పేశాదే శెల్వ పెణ్డాట్టి నీ
ఎత్తుక్కుఱగుం పొరుళ్ ఏలో రెంబావాయ్.
ఓం నమో నారాయణాయ-11
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
" మాధవ కణంగల్" అనబడు సాధురూపములైన
అరిషడ్వర్గములంటని సురభుల గోష్ఠములో
అస్ఖలిత బ్రహ్మమునకు అనిశము శిరోధార్యమైన
అస్ఖలిత బ్రహ్మచారి ఆ బర్హి పింఛములో
"సెండ్రుం-సెరుం-సెయ్యం" అంటు అతిపరాక్రమములైన
అరి సం హారముచేయు బుద్ధికుశలతలో
పుట్టలోపల చుట్టినదేహముతో పడగ విప్పినదైన
పుట్టినింటి గౌరవమును పెంచు ఆ " బంగరు మొలకలో"
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్ల బరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము
లెక్కపెట్టలేనన్ని సద్గుణముల ప్రోవులైన గోగణములున్న గోశాలలలోను,ప్రశాంత ప్రసన్న సౌందర్యమైన నెమలి లోను,దుష్టత్వమను శత్రువును గుర్తించి,తనకు తానుగా దండెత్తి,శాంతిని నెలకొల్పు భుజ పరాక్రమములోను,పుట్టలో చుట్టుకున్న దేహముతో,పడగ విప్పి పరవశించు పామువంటి గోపిక యందు, ( ఇది సామాన్యార్థము )
లెక్కలేనన్ని సద్గుణములు కల సాధు పుంగవుల ఆశ్రమములలోను,శిఖిపింఛమౌళి అనుగ్రహ సౌందర్యములోను,మనలోని దుర్గుణములను శత్రువులను గుర్తించి తనకు తానే వాటిపై దండెత్తి సమసింపచేయు గొల్లస్వామి పరాక్రమమునందును,వినయ ప్రతీకగా తన శరీరమును పుట్టయందు చుట్టుకొని, (మాయా జగతి పుట్టలో తన శరీరమునుంచి-భక్తి అను పడగను విస్తరింప చేసిన)భక్తిభావ పడగను విస్తరింపచేయుచున్న,"బంగరు మొలక" అని అమ్మచే పిలిపించుకుంటున్న గోపికలో,( ఆళ్వారులో) నిమగ్నమైన నా మనసు,పాశురములను కీర్తించుచు,భక్తి అను పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లుచున్న హారములను స్వామికి సమర్పించుటకు చెలులారా! కదలి రండి. తెల్లవారు చున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

TIRUPPAAVAI-12

కనైత్కిళంక తెరుమై కన్రుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్రుపాల్ శోర
నన్నైత్తిల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
ప్పనిత్తిల్లె వీజనిన్ వాశల్ కడైపత్తి
శినత్తినాల్ తెన్నిలంగై క్కోమానై చ్చెత్త
మనత్తు కినియానై పాడవుం నీ  వాయ్ తిరవాయ్
ఇనిత్తాల్ ఎజుందిరాయ్ ఈదెన్న పేరుఱక్కుం
అనైత్తిల్లత్తారుం అరిందే ఏలో రెంబావాయ్.
ఓం నమో నారాయణాయ-12
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది
మూగదో,చెవిటిదో అని, ముదితల పరిహాసమైన
ముద్దరాలు నిద్దరోవు అద్దాలున్న పానుపులో
ఉవిద భక్తి ఉత్కృష్టమై కృష్ణునితో మమేకమైన
వక్షస్థలమందు నున్న పుండరీకాక్షునితో
పక్కనున్న అత్తను నిద్దురలేపమనిన వారైన
బద్ధకమును వదిలి,లేచి గడియ తీయమనుటలో
అనవరత ధ్యానములో ఆమె-అంతర్ముఖమైన
బహిర్ముఖము చేయుటకు "ఎన్ఱెన్ఱు నామం పలవుం" అనుటలో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్ల బరచగ భక్తిపూల మాలలతో నేడె.
సురభులు వర్షించిన పాలమడుగుల అడుసుగల ఇంటిలో నిద్రించుచున్న గోపికను నిద్రలేపుచుండుట సామాన్యార్థమైన ఈ పాశురములోని పాలమడుగు సత్వగుణ భూయిష్టమైన గోపిక మనసుయే. పాలమడుగుల అడుసు చంచలము కాని దాని గట్టితనము..ఆ మనసు లోపలి స్వామి యొక్క నిశ్చల ధ్యానమే ఆమె నిద్ర,పరిసరములను పట్టించుకొనక పోవుట దానికి పరాకాష్ఠ.పాల కడలి తల్లియే నిదురలేపుచున్న-నిదురపోవుచున్న ఇద్దరు గోపికలుగా ప్రకటింప బడుటయే లీల.
వ్రత సమయము సమీపించుచున్నను నిదురలేవని గోపిక వద్దకు వచ్చిన గోపకాంతలు, ఆమెను మూగదో,చెవిటిదో, మూఢురాలో అని అపహాస్యము చేసారు.అయినప్పటికి నిదురలేవలేదని పక్కనున్న ఆమె తల్లితో అత్తా! ఆమెను నిద్దురలేపి గడియతీయించమనిరి.తల్లి లేపినను ఆమె నిదురను చాలించకపోతే,ఆమె చెవిలో మాధవ నామమును చెబుతూనే ఉండమన్నారు.(ఇది సామాన్యార్థము.)
నెమలిలో,పాములో,గోవులలో,సాధువులలో కృష్ణభక్తిని దర్శించిన గోపిక,ఆ పరమాత్ముని దయతో నేడు కృష్ణభక్తిలో అంతర్ముఖమైన మరొక గోపికను చూస్తోంది.వ్రతమాచరించుటకు బహిర్ముఖము చేయవలెను కనుక అత్తా!
నిద్దురలేపమన్నది.(అత్తరూపములోనున్నది భాగవతోత్తముడు) అయినను గోపిక నిద్దురలేవక పోవుటచే( కారణము ఆమె భక్తి పరాకాష్ఠత మాత్రమే కనుక )ఆమె చెవిలో మాధవ నామమును కీర్తించుచునే ఉండమన్నారు.అంతర్ముఖములో దర్శనీయములు బాహ్యములో స్మరణీయములు కావలెనుకదా అని గోపిక చింతలో నున్న నా మనసు,పాశురములను కీర్తించుచు,భక్తి అను పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను,స్వామికి సమర్పించ,చెలులారా! కదిలి రండి.తెల్లవారుచున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

TIRUPPAAVAI-13



పుళ్ళిన్ వాయ్ కీండానైప్పొల్లా అరక్కనై
కిళ్ళిక్కళైందానైకీర్తిమై పాడిప్పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుంపావైక్కళం పుక్కార్
వెళ్ళి ఎజుందువియాజ ముఱంగిత్తు
పుళ్ళుం శిలంబిన కాణ్పోదరిక్కణ్ణినాయ్
కుళ్ళ కుళిరక్కుడైందు నీరాడాదే
పళ్ళిక్కిడత్తియో పావాయ్ నీవన్నానాల్
కళ్ళం తవిరిందు కలంద్ ఏలో రెంబావాయ్.
ఓం నమో నారాయణాయ-13
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
శిరములజారిన క్షీరము "స్థితికారణ గుణమైన"
సురభుల పాలను తడిసిన " అడుసంటిన గోపికలో"
మంచు కురియుచున్నదని " హేమంతపు ఛత్రమైన"
ఇంటిచూరు కిందచేరి నిలబడిన గోపికలో
"గురు నక్షత్రపు చీకటి " కనుమరుగైనదైన
శుభకరమగు" ఉదయించుచున్న శుక్ర నక్షత్రములో"
భక్తులు కొలిచెడి దైవము " భక్త పరాధీనమైన"
"రామ -కృష్ణ రూపములను ప్రీతి పాశురములలో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము.
గోవుల పాలతో తడిసిన బురద అంటుకున్న గోపికలో,మంచు కురియు చున్నదని ఇంటిచూరుకింద నిలబడిన గోపికలో,అస్తమించిన గురు నక్షత్రములో,ఉదయించు చున్న శుక్ర నక్షత్రములో,రాముని కృష్ణుని రూపములలో కనిపించిన పరమాత్ముని చూచుచున్న గోపికను,( ఇది సామాన్యార్థము.)
అంటుచున్న సంసారము అను బురదలో కృష్ణభక్తి అను గోక్షీరమును మేళవించిన గోపికను,కట్టుబాట్లు అను చలిని తట్టుకోలేక విష్ణుపాదములు అను చూరు కిందనున్న గోపికను, గురుడు దేవతలకు గురువు.కాని కపటముతో కచుని సంజీవిని విద్యకై శత్రువులవద్దకు పంపి స్వచ్చతను కోల్పోయాడు.శుక్రుడు రాక్షస గురువు కాని కచునికి " మృత సంజీవిని విద్యను" నేర్పి సంస్కారమనే వెలుగుతో ఉదయించుచున్నాడు.భక్త పరాధీనమైన భగవంతుని రామకృష్ణ రూపములను చూచుటలో నిమగ్నమైన నా మనసు, భక్తి అను పువ్వులను శరణాగతి అను దారముతో అల్లిన హారములను స్వామికి సమర్పించుటకు చెలులారా! కదిలి రండి.తెల్లవారు చున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

TIRUPPAAVAI-14

ఉంగళ్పుళుక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెంగళ్ నీర్వాయ్ నెగిజింద్ ఆంబల్వాయ్ కుంబినగాణ్
శెంగల్ప్పొడి క్కూరై వెణ్పల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్రార్
ఎంగళై మన్నం ఎజుప్పువాల్ వాయ్ పేశుం
నంగాయ్ ఎళుందిరాయ్ నాణాదాయ్ నావుడయాయ్
శంగోడు చక్కరం ఏండుం తడక్కైయన్
పంగయ కణ్ణానై ప్ప్పాడ్ఏలో రెంబావాయ్
. ఓం నమో నారాయణాయ-14
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
"ముష్టికాసుర చాణూరులను" మట్టికరిపించినవారైన
ఉల్లము ఝల్లనిపించిన " మల్లయుద్ధ క్రీడలలో"
" చింతచెట్టు క్రింద కూర్చున్న" చిత్ప్రకాశరూపమైన
మధురకవితో మాట్లాడిన " శ్రీ నమ్మాళ్వారులో"
"త్రేతా-ద్వాపర యుగముల" రామ-కృష్ణ నామభేదాలైన
భక్తిభావము ఎక్కువైన " చీలిన రెండు వర్గములో"
శ్రీ రామాలింగనమునకు " ధ్యానించిన వారైన"
"శ్రీ కృష్ణ పరిష్వంగమును" కోరుచున్న గోపికలలో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె
తామ్రపర్ణీ నదీ దక్షిణతీరములో కురుకూరులో ఉదయనంగ-కారికి దంపతులకు పుత్రుడుగా ఆదిశేషువు జన్మించాడు.మాటాడుటలేదని గుడికి తీసుకువెళితే చింతచెట్టు తొఱ్రలోనికి పోయి,పద్మాసనుడై యోగ నిష్ఠలో ఉండిపోయెను.తిరుక్కోవలూరునందు పరమభక్తుడైన నారాయణ దీక్షితునకు కుముద ఆళ్వార్ (ముదలి వారికి సంబంధించిన) పుత్రునిగా కరుణించెను.అతడే మధురకవి నామధేయుడుడైన భాగవతోత్తముడు.మధురకవికి మొదటిసారిగా నమ్మళ్వారుతో మాట్లాడించగలిగినమహద్భాగ్యము దక్కినది.అదే విధముగా మన గోపికకు శ్రవణేంద్రియము జాగృతమై వారి సంభాషణను వినగలిగినది.పంచేంద్రియములు పంచభూతములు తానే అయిన పరమాత్మ అవ్యాజ కరుణ శ్రీ వ్రతమును చేయుటకు సంకల్పించినంత మాత్రముననే అవధులు లేనిదై అనుగ్రహిస్తున్నది.
.మల్లయుద్ధములో చాణూర-ముష్టికాసురులను మట్టు పెట్టిన స్వామిలో,చింతచెట్టుక్రింద దివ్యమైన ప్రకాశముతోనున్న(5వ ఆళ్వార్) శ్రీ నమ్మళ్వార్ తన మౌనముద్రను వీడి మొదటిసారిగ శ్రీ మధురకవితో మాట్లాడుటను ,రాముని ధ్యానించిన మునులను,శ్రీకృష్ణుని ఆలింగనమును కోరుచున్న గోపికలను చూచినది.(ఇది సామాన్యార్థము)
ఇక్కడ భవబంధములకు-భగవతత్త్వమునకు మల్లయుద్ధము జరుగుచున్నది.మహనీయుల దర్శనము మహా మహిమోపేతము అనుటకు నిదర్శనముగా,చింత చెట్టుక్రింద భగవత్చింతనలోనున్న మధురకవి -నమ్మళ్వార్ వారిని సందర్శించుటయే కాకుండా, మన గోపికయుస్వామి దయచే (ఆమె) శ్రవణేందియము జాగృతమై వారి సంభాషణను సైతము వినగలుగుతున్నది. రామునిలోను-కృష్ణునిలోను అభేదమును,జీవాత్మ-పరమత్మల అవినాభావ సంబంధమును గుర్తించుటకు ప్రయత్నించుచున్నది.గోపిక సాధనను సఫలీకృతము చేయుట
కు సం స్కారములు జాగృతమగుచుండుటలో నిమగ్నమైన నా మనసు, పాశురములను కీర్తించుచు,భక్తి అను పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను స్వామికి సమర్పించుటకు చెలులారా! కదిలి రండి.తెల్లవారు చున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం)

TIRUPPAAVAI-15



ఎల్లే! ఇళం కిళియే! ఇన్నం ఉరంగుదియో
శిల్ ఎన్రారై యేన్మిన్ నంగైమీర్ గిన్రేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయదిఱిదుం
వల్లీర్గళ్ నీంగళే నానే తానాయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్ -ఎణ్ణిక్కొళ్
వల్లానై కొన్ఱావై మాత్తారై మాత్తళిక్క
వల్లానై మాయనై పాడ ఏలో రెంబావాయ్.
ఓం నమో నారాయణాయ-15
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది.
లేమ!" లేత చిలుకతో' పోల్చబడినదైన
పరిణితముగ పలుకుచున్న "పదియవ గోపికలో"
"నీంగళే-నీవల్లే" అను వాదోపవాదములైన
కృష్ణమాయ కమ్ముకునిన " గోపికల సం శయములో"
బంధింపబడిన తలుపు అటు-ఇటు వాక్చమక్కులైన
చక్కని చుక్కల మక్కువ పరిహాసోక్తులలో
" తిరు-పావై" అను వేదబీజ స్వరూపమైన
పదిహేను రోజుల వ్రత పుణ్య పూర్వ భాగములో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము
అమ్మచే నిద్రలేపబడుతున్న చిన్ని చిలుకవలె పలుకుతున్న పదియవ గోపికలో,ఇదంతా నీవల్లే అంటే నీవల్లే అని నిందించుకొనుచున్న గోపికలలో,మూసిఉన్న తలుపునకు రెండువైపులనుండి పరిహాసపు మాటలాడుకొనుచున్న గోపికలలో,వ్రతములో సగభాగము పూర్తియైనదన్న విషయములో గోపిక మనసు లగ్నమైనది.(ఇది సామాన్యార్థము.)
పరమ భాగవతోత్తములైనను గోకులము నందు గోపికలుగా జనించి,మధురభక్తితో
మధుసూదనుని కొలువగా సిద్ధమగుచునారు.భక్త సులభులైన లక్ష్మీనారాయణులు పామరులుగా కనిపించు గొల్లెతల ద్వారా అమ్మ పాశురముల అమృతభాండము నందించుటకు కదులుచున్నారు.లేత చిలుక అను సంబోధన జ్ఞానమూర్తి యని చెప్పకనే చెప్పుచున్నది.ఆళ్వారులనందరిని తమతో కలుపుకొని సఖ్యభక్తికి సాకారమైన ఆండాళ్ అమ్మను అనుసరించుచు మధుర భక్తితో సేవనమునకై తరలుచుండుటలో పూర్వభాగము సుసంపన్నమైనది.
తెల్లవార వచ్చెను అనగా నల్లనైన తమోగుణము అస్తమించి,తెల్లనైన సత్వగుణము ఉదయించుటకు సిద్ధముగా నున్నది.అమ్మచే నిద్దురలేపబడుతున్నది పదియవ గోపిక అను పదియవ ఇంద్రియము.(బుద్ధి)కనుకనే "లేత చిలుక" శుక మహర్షి పలుకులను తెలిసికొనగలుగుచున్నది.మూసిన తలుపు భగవంతునికి -భక్తులకు మధ్యనున్న" మాయతెర".చక్కని చుక్కలు అనగా" ఆధ్యాత్మిక పరిజ్ఞానముగల అనుభవజ్ఞులు".వారు "తర్క-మీమాంసాది శాస్త్ర విచారణల" గురించి చేయు చర్చలే నీవల్లే నీవల్లే అని చేయుచున్న వాదోపవాదములు.తెర తొలగించమని చేయుచున్న ప్రార్థనలు..అవి పండితులకు మాత్రమే కాకుండా గొల్లలకు సైతము అందుబాటులో ఉండుటకై" ఆండాళ్ తల్లి" పరమ దయతో అనుగ్రహించిన శ్రీవ్రత పాశురములు అని గ్రహించిన మనగోపిక, అమ్మ గోదాదేవి చేయించుచున్న వ్రతములో తానును,
స్వయముగా పాల్గొనవలెనని సంకల్పించుకొన్నదన్న ఆలోచనలో నిమగ్నమైన" నా మనసు",పాశురములను కీర్తించుచు,భక్తి అను పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను స్వామికి సమర్పించుటకు చెలులారా! కదిలిరండి.తెల్లవారుచున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

TIRUPPAAVAI-16



నాయగనాయ్ నిన్ర నందగోపనుడైయ
కోయిల్కాప్పానే! కొడి తోన్రు తోరణ
వాశల్ కాప్పానే మణిక్కదవం తాళ్ తిరవాయ్
ఆయర్ శిరు మియరో ముక్కు అఱై పఱై
మాయన్ మణివణ్ణన్ నెన్న వేవాయ్, నేరందాన్
తూయో మాయ్ వందోం తుయిలెరప్పాడువాన్
వాయాల్ మున్నం మాత్తాదే అమ్మ
నీ నేశ నిలైక్కదవం నీక్కు ఏలో రెంబావాయ్.
ఓం నమో నారాయణాయ-16
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది.
"మాధవం-మణివణ్ణన్ సేవకు ఆటంకించుచున్న వారైన
ద్వారకాపతి " ఆ"నందభవనపు ద్వారపాలకులలో
"శిఱు మియరో ముక్కు " అనుభావము అనుభవైకవేద్యమైన
చిన్నవారమని అన్న గోపికల ఉన్నత సంస్కారములో
సంకల్పము సాధ్యపరచు భక్త కల్పతరువైన
శిరమొడ్డిన పరవశమై విడిన అడ్డ గడియలో
సిరిసంపదలను మించిన సౌభాగ్యప్రదమైన
తులసిదళముతో స్వామిని తులతూచిన తక్కెడలో
అతి పవిత్రమైన వ్రతము ఆచరింప రారె
" ఆముక్త మాల్యద" ఆండాళ్ అమ్మ వెంట నేడె.
భావము
ఐదు జ్ఞానేద్రియములు-ఐదు కర్మేంద్రియములు కలిపి పది ఇంద్రియములు పది గోపికల రూపమున నిద్రించుచున్న సమయమున అమ్మ ఆండాళ్ వాటిని జాగృతము చేసి, తనతో వ్రతమునకు తీసుకొని వళ్ళుచున్నది.కనుక వారు నిస్సంగులై ,స్వామి నిస్తుల వైభవమును కీర్తించుటకు వచ్చినపుడు,ద్వార పాలకులు వారిని అడ్డగించిన సమయమున ఏ మాత్రమును చలించకుండ,వినయ సంభాషణమును చేయ గలిగిన వివేక సంపన్నులైనారు.నియమ నిష్ఠలను పాటిస్తున్నామన్న అహంకారముతో నున్న విప్రులు పరమాత్మ సందర్శనమునకు,సేవా సౌభాగ్యమునకు( వారిలో నున్న అహంకారముచే) నోచుకోలేదు.
నంద భవన ప్రవేశమునకు గోపికలను ద్వార పాలకులు అడ్దగించినారు.అప్పుడు గోపికలు తాము నియమ నిష్ఠలు లేనివారమని,ముక్కుపచ్చలారని చిన్నివారమని
ఒక్కసారి స్వామిని దర్శించి మరలివెళ్ళెదమనితలుపుతీయమని,శిరసువంచి ద్వారపాలకులను అర్థించినారు.వంగిన వారి శిరము(లు) తగిలి,తలుపు గడియ విడినది.దానిని దగ్గరుండిచూసిన మన గోపికకు తులసిదళముతో స్వామిని తూచిన తక్కెడ గుర్తుకు వచ్చినది.(ఇది సామాన్యార్థము)
"మా" మాయొక్క "ధవన్" వాడు/దేవుడు.శ్రీ కృష్ణుడు గోపికల యొక్క సఖుడు/దేవుడు.ఆ మాధవుడు ఎటువంటి వాడంటే "మణివణ్నన్" మణివలె స్వయం ప్రకాశము కలవాడు మాత్రమే కాదు.కోరిన కోరికలు తీర్చు చింతామణి.కనుక తప్పక మాకు దర్శనమును అనుగ్రహిస్తాడు.కాని గోపికలను లోనికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్న ద్వారపాలకులు కామము-క్రోధము,మదము-మాత్సర్యము,అహంకారము-అజ్ఞానము అను క్షణమాత్రము కమ్మివేసిన వారి గుణదోషములు.వారు నియమ నిష్ఠలు లేనివారము అని అన్నారు.అంటే వారు ప్రాపంచిక విషయములకు అతీతులైన నిస్సంగులు. వారి నిష్కళంక భక్తి, శిరమువంచి నీలమేఘశ్యాముని శరణాగతిని కోరగానే, కల్పతరువైన పరమాత్మ వారిని అనుగ్రహించి,తరువుతో చేయబడిన మణిమయాలంకృతమైన తలుపు అడ్దగడియ విడిపోవునట్లు అనుగ్రహించాడు అంటే మాయామోహ
తెరలు తొలగి స్వామితొ మమేకము కాగలిగినారు..పరమాత్ముని పరమాద్భుతమును చూడగానే స్వామి భక్తపరాధీనతను ప్రకటించు తులసిదళముతో స్వామిని తూచిన తక్కెడ, మన గోపికకు తలపుకు వచ్చి,తానును "సర్వస్య శరణాగతికి"సిద్ధమవుతున్నదన్న తలపులో నిమగ్నమైన నా మనసు,పాశురములను కీర్తించుచు,అమ్మతో వ్రతమునకు సాగుచున్న చెలులతో కలిసి ముందుకు అడుగులు వేయుచున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

TIRUPPAAVAI-17

అంబరమే తన్నీరే శోఱే అఱుం శెయ్యుం
ఎంబెరుమాన్ నంద గోపాలా! ఎళుందిరాయ్
కొంబనార్క్కెల్లాం కొళుందే! కులవిళక్కే
ఎంబెరుమాట్టి యశోదాయ్ అరివురాయ్
అంబరం ఊడ~అరుత్తు ఓంగిఉళగళంద 
ఉంబర్ కోమానే! ఉఱంగాదు ఎళుందిరాయ్
శెంబుఱ్ కరలడి శెల్వా బలదేవా
ఉంబియుం నీయుం ఉఱంగ్ ఏలో రెంబాయ్.
ఓం నమో నారాయణాయ-17
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరి నామసంకీర్తనమే కోరుతోంది
మోదపు ప్రదానముతో " దానపు నిధానమైన"
ఆనంద గోపాలుని తండ్రి " ఆ నంద మహారాజులో"
" నదీతీరముల మొలుచు" అతిసుకుమారములైన
" ప్రబ్బలి" చిగురుబోడి గొబ్బెత" యశోదమ్మలో"
" ఆదిశేషుడే" స్వయముగ స్వామికి" అన్నగారైన"
హలాయుధుడు " బలరాముని కాలి కడియములో"
స్థూల-సూక్ష్మములన్నింట్లో " మూలము" తానేయైన
పంకేరుహలోచనుని " శంఖు-చక్ర పాదములలో"
అతి" పవిత్రమైన వ్రతము" ఆచరింప రారె
" ఆముక్తమాల్యద" ఆండాళ్ " అమ్మ వెంట" నేడె.
భావము
గోపికలు యశోదను-నంద ప్రభువును,బలరామ కృష్ణులను కీర్తించుచు,వారిని మేల్కొలుపుచున్నారు.ఇది సామాన్యార్థము.మన గోపిక అమ్మ అనుగ్రహముతో దాన యశో విరాజితుడగు నంద ప్రభువును,పవిత్ర నదీ తీరములందు మొలచు ప్రబ్బలి చెట్తు యొక్క సౌకుమార్యతను గలిగిన యశోదను( యశమునిచ్చు తల్లిని)బలరాముని కాలి కడియమును,శంఖ-చక్రములున్న స్వామి పాద పద్మములను భావించగలుగుతున్నది.(సామాన్యార్థము.)
గోకులము వైకుంఠము.బ్రహ్మానందము నందుడు.ముక్తి కాంత యశోద.గోపికలు ఉపనిషత్మంత్రములు.బలరామ-కృష్ణులు వేదము-అర్థములు.
దాన యశోవిరాజితుడగు నంద మహారాజుని,ప్రబ్బలి సౌకుమార్యముగల యశోదమ్మను,బలరాముని కాలి కడియమును,శంఖు-చక్రములున్న స్వామి పాద పద్మములను,అమ్మ వెంటనున్న మన గోపిక భావించగలుగుతున్నది.(ఇది సామాన్యార్థము)
స్వామి పాదములోని శంఖము సకల జీవుల నాద రూపమునకు ( ఓంకారము),చక్రము సకలజీవుల తేజో రూపములకు సంకేతములు.మన గోపిక,ఆండాళ్ తల్లిలో యశోద సౌకుమార్యమును,నందుని సౌశీల్యమును దర్శించ గలుగుతున్నది.(శ్రీ మహా విష్ణువు ఎనిమిదవ అంశ నలుపు-తెలుపు రంగులలో ఏర్పడి తెలుపు అంశ దేవకీ గర్భమునుండి రేవతీ గర్భమునకు తరలించబడినదని భాగవతోత్తములు చెబుతుంటారు).స్వామికి అన్నయైన రాముడు అతి బలపరాక్రమవంతుడగుటచే బలరాముడని,బలవంతుడని నామసార్థక్యతము పొందినాడు.రెండు గర్భములలో ఎదిగిన వాడగుటచే సంకర్షణుడు అని కీర్తింపబడుచున్నాడు.హలము (నాగలి)ఆయుధముగా కలవాడు కనుక బలరాముని హలాయుధుడు అని కూడా వ్యవహరిస్తారు." రామో రామశ్చ రామశ్చ" త్రయములో ఒకడు.
శ్రీ కృష్ణుడు పాడికి,బలరాముడు పంటలకు (స్థితి కార్యములకు) నిర్వాహకులు.సమర్థ స్థితి కార్య నిర్వహణకు యాదవులు సమర్పించిన గౌరవ సూచనలే కాలి కడియములు.ప్రబంధ యుగములోని గండపెండేరమునకు మూలముగా తోచుచున్నవి.మన గోపిక స్థితికారుని ద్వైత (రెండు) రూపాలలోని ఒక్క (అద్వైత) రూపమును అనుభవించుటకు అమ్మవెంట నడుచుచున్నదన్న తలపులో నిమగ్నమైన నా మనసు పాశురములను కీర్తించుచు అమ్మతో వ్రతము చేయుటకు సాగుచున్న గోపికలతో కలిసి,ముందుకు అడుగులు వేస్తున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

TIRUPPAAVAI-18



ఉందు మద కళిత్తన్ ఓడాద తోళ్వళియన్
నంద గోపాలన్ మరుమగళే ! నప్పిన్నాయ్
కందం కమరుంకురలికడై తిఋఅవాయ్ వంద్
ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాధవి
ప్పందల్ మేల్ పల్గాల్ కుయిలినంగళ్ కూవిన కాణ్
పందార్ విరలి ఉన్మైత్తునన్ పేర్ పాడ
శెందామరై క్కెయాల్ శీరార్ వళై ఒళిప్ప
వందు తిఱవాయ్ మగిరింద్ ఏలో రెంబా వాయ్.
ఓం నమో నారాయణాయ-18
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణిచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది.
"భక్తాంఘ్రిరేణుం- భగవంతుమీడే" అని కీర్తించుచున్నవైన
తొండరడిప్పొడి ఆళ్వార్ విరచిత " తిరుప్పళ్ళి యళుచ్చి"లో
ముదితలార! ముచ్చటగ "మదమును స్రవించుచున్నవైన"
మాతంగములను "మర్దించు " మదన గోపాలునిలో
పోటీ పడుచు చేరుచున్న " మళ్లలేని నోళ్ళవైన"
కోళ్ళ కొక్కొరోకో అను " కోటి కోటి పిలుపులలో"
"మాధవీలత"" పందిరిపై " గుంపులుగా కూర్చున్నవైన
గోపికమ్మలను నిద్రలేపు" కోకిలమ్మ గానములలో"
అతి" పవిత్రమైన వ్రతము " ఆచరింప రారె
" ఆముక్తమాల్యద ఆండాళ్" అమ్మ వెంట నేడె.
భావము
తిరుప్పళ్ళి యళుచ్చి స్తుతులను,మత్త గజమునణిచిన శ్రీ కృష్ణుని,ఉదయముననే వినిపిస్తున్న కోడి కూతలను,తీగెల పందిరిపై నున్న కోకిల గానములను (నప్పిన్నాయ్-చిన్నపిలా) మన గోపిక వినుచున్నది. ఇది సామాన్యార్థం.
మన గోపిక వ్రత ప్రారంభ శుభ సూచకముగా,రూప సౌందర్యమునధిగమించి,భావ సౌందర్యముతో పయనిస్తూ,అద్భుతానుభూతికి లోనవుతోంది.
మదపుటేనుగు మనలోని ఇంద్రియములు.వానిద్వారా లభించే అహంకారమే స్రవించుచున్న మదజలము అటువంటి ఏనుగును లోబరుచుకోగలిగినది ఆ గోపాలుని కరుణ అను అంకుశము.
అయితే మళ్లలేని నోళ్లు గల కోళ్ళు మనము రోజు చూస్తున్న కోళ్లేనా?అవి ఎందుకు ఆపకుండా "కొక్కొరోకో" అంటున్నాయి.మీకు తెలియని విషయమా ఇది-అవి మన స్వామికి ఆప్తమిత్రుడైన కుక్కుటేశ్వరస్వామి (కోడి రూపములో నున్న శివుని)సుప్రభాత సేవలు.శుభోదయ శుభాకాంక్షలు.
నిరంతరము కొనసాగే మాధవనామ స్మరణల మాలికలే ఈ మాధవీలతలు.వానిని అల్లుచున్న పరమాత్మయే పందిరి.ఆ పందిరిపై గుంపులుగా కూర్చుని మధుర గానము చేస్తున్నవి మన నల్లనయ్య బహురూపముల పిల్లన గ్రోవి పిలుపులే. మాధుర్యములో.గోపిక రూప భావ సౌందర్యములను సమన్వయించి సాధనకు సాగుచున్నది.
మన రామదాసు తన దాశరథి శతకములో "పరమ దయానిధే.......".హరే" అటంచు సుస్థిర మతులై సదా భజనచేయు మహాత్ముల పాద ధూళి నా శిరమున దాల్తు,మీరటకు పోవకుడంచు...అదే భక్తాంఘ్రి రేణుం భవతారమీడే.అని కీర్తించిన శ్రీ తొండరడిప్పొడి ఆళ్వారుని (అదేనండి మనము ఆప్యాయంగా పిలుచుకొనే విప్ర నారాయణుని) దర్శించి భక్తిలో మరొక మెట్టు ఎక్కుతోందని ఆలోచిస్తున్న నా మనసు అమ్మ వెంట వ్రతముచేయుటకు అనుసరించుచున్న గోపికలతో తన అడుగులను కదుపుతోంది.
( ఆండాళ్ తిరు వడిగళే శరణం )

TIRUPPAAVAI-19



కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్మేల్
మెత్తెన్ఱ పంచ శయనత్తిన్ మేల్ ఏఱి
కొత్తలర్ పూంగురల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తు క్కిడంద మలర్ మార్బా! వాయ్ తిఱవాయ్
మైత్తడంకణ్ణినాయ్! నీ ఉన్-మణాళనై
ఎత్తనై పోదుం తుయిలెర ఒట్టాయ్ కాణ్
ఎత్తనై యేలుం పిరివాత్తగిల్లాయాల్
తత్తువమన్ఱు తగవ్-ఏలోర్ ఎంబావాయ్
" నీళాతుంగ స్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శృతిశతశిర స్సిద్ధమధ్యాసయంతీ
స్వాచ్చిష్టాయాం స్రజినిగళితం యా బలాత్ కృత్యభుఙ్క్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ:"-శ్రీ పరాశర్ భట్టర్.
ఓం నమో నారాయణాయ-19
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది
అమ్మ యదపై నిదురించు అచ్యుతుడు అందించుచున్న
"అంబరమే-తన్నీరే-శిఱే" మరియు పఱ వాయిద్యములో
గోపికలు మేల్కొలుపుతునున్న తాను మౌనముగానున్నదైన
"నప్పిన్నాయ్ వాయ్ తాల్తిరవాయ్" తల్లి పలుకే బంగారములో
శ్రీ పరాశర భట్టు స్తుతించు యశోద మేనకోడలైన
పూబంతి చేతనున్న నీళ ముఖ యశోకాంతులలో
అమ్మ పుట్టినింట ఏడుగురు అసురులు నిక్షిప్తమైన
ఆబోతుల స్వామి హతమార్చెనన్న ఆ పోతన స్తుతులలో
అతి పవిత్రమైన వ్రతము ఆచరింప రారె
ఆముక్త మాల్యద ఆండాళ్ అమ్మ వెంట నేడె.
భావము
మన గోపిక పర ఇస్తానని చెప్పి నీలాదేవి ఎదపై నిదురిస్తున్న స్వామిని,అమ్మ ఎంత పిలిచినా తలుపుతీయక పోగా,వస్తున్నా!తీస్తున్నా అని పలుకైనా పలికని నీలాదేవిని,శ్రీ పరాశర భట్టర్ చే చేతిలో పూబంతి ధరించి చిద్విలాసముగా ప్రకాశింపబడుతున్నావని స్తుతియింపబడే నీలను,స్వయంవర నియమమైన, నీలయింట నున్న ఏడు ఆబోతులను వధించి, నీలను పెండ్లాడాడన్న బమ్మెర పోతన స్తుతులను వినుచు,మనో నేత్రముతో చూడగలుగుతున్నది కనుక మనము దీనిని కేవలము సామాన్యార్థముగా పరిగణించలేము .స్వామి కరుణచే సామాన్యార్థము సం స్కరింపబడి సంకీర్తనముగా రూపుదిద్దుకుంటోంది.
స్వామి మనకు అనుగ్రహించేవి అంబరమే-వస్త్రములు,తన్నీరే-మంచినీరు,శిఱే-అన్నము.ఇది బాహ్యార్థము.శరీరాభివృద్ధికి ఇవి పోషకములు. కాని ఇహపర పోషకములు అంబరే-పూర్తిగా వ్యాపించిన( ఆకాశము) వేదములు.ఇవి అపౌరుషేయములు.ఎవరు వ్రాసినవి కావు.వేదమే ఋతము అదియే నిజము.వేదము అంబరమయితే దానిని వివరించే ఆచార్యులే మంచినీరు అదే జ్ఞాన తృష్ణను తీర్చే తన్నీరు.వారు నేర్పు మంత్రమే అన్నము.(శిఱే) అధ్యయనము చేసి పరమాత్మ తత్వమైన పరమపదమునకు పోవుటకు గల మార్గమే పఱి.ఈ నాలుగు చతుర్విధ పురుషార్థములు.వాని రూపమే అమ్మ చేతిలోని పూబంతి
నప్పినాయ్ అమ్మవారిని ముద్దుగా తమిళభాషలో పిలుచుకునే పేరు.అంటే లక్ష్మీదేవి.లక్ష్మీదేవి అంశలు మూడుగా విడివడి ఆదివారహునిని భూమాతగాను,(భూదేవి) శ్రీ రాముని సీతాదేగాను (శ్రీదేవి) శ్రీ క్రిష్ణుని నీలాదేవిగాను అనుసరించారు.నప్పిన్నాయ్ ని ఉత్తర భారతీయులు రాధా దేవిగా కొలుస్తారు. అమ్మ స్వామి ఆత్మైక స్వరూపులు.దేహములు రెండు కాని ఆత్మ ఒక్కటే.స్వామి నిదురించుట అంటే అంతర్ముఖమైనారు.స్వామి-అమ్మ అంతర్ముఖమైనారు కనుక అమ్మ నోరు తెరచి మాట్లాడుట లేదు అని మన గోపిక అర్థము చేసుకొనుచున్నదన్న తలపుతో నిమగ్నమైన నా మనసు, ఆండాళ్ అమ్మ వెంట నడచుచున్న గోపికలతో తన అడుగులను కదుపుచున్నది..
( ఆండాళ్ తిరు వడిగళే శరణం)

TIRUPPAAVAI-20



ముప్పత్తు మూవర్ అమరర్కు మున్శెన్రు
కప్పం తవిర్కుం కలియే ! తుయిల్ ఏరాయ్
శెప్పం ఉడయాయ్ ! తిఱలుడైయాయ్ శేత్తార్కు
వెప్పం కొడుక్కుం విమలా!తుయిల్ ఎరాయ్
శెప్పన్మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱుమఱుంగళ్
నప్పినై నంగాయ్ తిరువే తుయివెళాయ్
ఉక్కముం తట్టొళియుం తందు ఉన్ మణాళనై
ఇప్పోదో ఎమ్మై నీరాట్టు ఏలోర్ ఎంబావాయ్.
ఓం నమో నారాయణాయ-20
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
"ముప్పదిమూడుకోట్ల దేవతల" ధర్మ సం స్థాపనమైన
శిష్ట రక్షణమను కృష్ణుని " భుజ పరాక్రమములో"
శరణాగత రక్షణమున " శత్రువులను వణికించినదైన"
సర సరా పాకుతున్న " భయము తెచ్చు వెప్పంలో"
మండుచున్న కట్టెలు " చిగురించుచున్నవైన"
"వేణుగానమును ఆపమన్న" బువ్వ వండు తల్లిలో
గోపాలునితో గోపికలు " స్నానమాడుటకు కోరినవైన"
" విసనకర్ర-అద్దమును" అమ్మను ప్రసాదించమనుటలో
అతి పవిత్రమైన వ్రతము ఆచరింప రారె
ఆముక్తమాల్యద ఆండాళ్ అమ్మ వెంట నేడె.
భావము
ముప్పదిమూడు కోట్ల దేవతలనిశ్చింతను,శ్రీ కృష్ణుని శరణార్థుల శత్రువులకు భయముతో వచ్చిన జ్వరమును (తెప్పం) వేణుగానమును ఆపమని స్వామిని ప్రార్థించిన తల్లిని,స్వామితో కలిసి స్నానమాచరించుటకు విసనకర్రను-అద్దమును అడిగిన గోపికలను మన గోపిక చూచుచున్నది.దీనిని పరిశీలిస్తే,
అష్ట వసువులు-8,ఏకాదశ రుద్రులు-11,ద్వాదశాదిత్యులు-12,అశ్వినీదేవతలు-2,మొత్తం 33 మంది,ఇక్కడ కోట్ల అను పదము సమూహమునకు అన్వయిస్తుంది వారందరు శ్రీ కృష్ణునిచే పరి రక్షింపబడుతున్నారు.
శ్రీ కృష్ణుని శరణముకోరిన వారు తమలోని దుర్గుణములు శ్రీ కృష్ణుని అజేయుని చేయునని నిలువెల్ల వణికించుచున్న( వెప్పంలో) జ్వరముతో నున్నారు.వారి శరీరమును వారి పాపకర్మ ఫలితములు వణికించుచున్నవి.
" జాన పదమా-జ్ఞాన పథమా" అని, ఈ తల్లి స్వామిని వేణుగానమాపమని శాసించుచున్నది.పిల్లవాడు ఆకలీఅని ఏడుస్తున్నాడు.తల్లి త్వరత్వరగా ఎండుకట్టెలు పొయ్యిలో పెట్టి అన్నము వండుచున్నది.ఇంతలో పొయ్యిలో మండుతున్న కట్టెలు
మండటము మరిచి,చిగురించి వేణుగానమునకు ఆనందముతో తలలూపుచున్నవి.తల్లిప్రేమ నల్లనయ్యని శాసించినది.స్వామి తల్లికి తలవంచినాడు.కట్టెలచే బువ్వ వండించి తరింపచేసినాడు..భక్తవశుడు మన భగవంతుడు.
గోపికలు స్వామితో స్నానమాడవలెనని కోరారు.స్వామితో స్నానమాడుట అంటే.స్వామి మంగళ గుణగానములో మునిగిపోవుట.స్వామికి-స్వామి దయకు అభేదమును సూచించు చున్నది.స్నానమునకు వారికి కావలిసినవి అద్దము-విసనకర్ర.అద్దము అనగా స్వస్వరూపమైన స్వామిరూపమును చూచుకొనుటకు స్వచ్చమైన మనసు..రాగి అద్దము శ్రేష్ఠమైనది.వైరాగ్యమునకు ప్రతీకయే రాగి అద్దము.పూరిక్షేత్రములో జగన్నాథస్వామికి రాగి అద్దమును చూపిస్తారట!విన్నాను.
విసనకర్ర .తాను నిశ్చలమైనదైనా చలనముతో అందరికి గాలిని,గాలితో పాటు హాయిని ఇస్తుంది.సుగంధమైన దుర్గంధమైన ఒకటిగానే స్వీకరిస్తుంది.మిత్రులని-శత్రువులని భేదములేకుండా చేయు సహాయతాభావ నిదర్శనమే ఆ విసనకర్ర.శేషత్వ తత్వము-పరతత్వము,తిరుమంత్రము-ద్వయమంత్రము అని కూడా ఈ భావమును గౌరవిస్తారు అని తెలుసుకొనుచున్న గోపికతో పాటుగా నా మనసు వ్రతముచేయుటకు అమ్మను అనుసరిస్తున్న గోపికలతో తాను అడుగులు వేస్తున్నది
.
( ఆండాళ్ తిరువడిగళే శరణం)

TIRUPPAAVAI-21

ఏత్త కలంగల్ ఎదిర్ పొంగి మీదళిప్ప
మాత్తాదేపాల్ సొరియుం వళ్ళల్పెరుం పశుక్కళ్
ఆతప్పడైత్తాన్మగనే అఱి ఉఱాయ్
ఊత్తముడైయాయ్ !పెరియాయ్!ఉలగనిల్
తోత్తమాయ్ నిర్రశుడరే! తుయిల్ ఎరాయ్
ముత్తార్ ఉనక్కు వలి తొలైందు ఉన్-వాశఱ్క్ణ్
ఆత్తారు వందు ఉన్ -అడిపణియుమా పోలే
పోత్తియుం వందోం పుగరందు ఏలోర్ ఎంబావాయ్.
ఓం నమో నారాయణాయ-21
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
"విష్ణు పాద లక్ష్మీ సంకేతముగ" ఊర్థ్వ పుండ్రమైన
ఫాలభాగ ప్రకాశిత "తిరుమాన్ శ్రీ చరణములో"
" ధారకము-పోషకము భోగము" తానేయైన
మందస్మిత వదనుని " బృందావనములో"
"కోదై" అను నామముతో " కొంగు బంగారమైన"
పెరియాళ్వార కూతురు " పెద్ద ముత్తైదువలో"
"'క్రిష్' అపరిమితమైన "ణ" ఆనందము" నామరూపములైన
భక్తజన రంజనుడు " ఆ నిత్య నిరంజనునిలో"
అతి" పవిత్రమైన వ్రతము" ఆచరింప రారె
" ఆముక్త మాల్యద" ఆండాళ్ అమ్మ వెంట నేడె.
భావము
పరమాత్ముని ప్రతిరూపములైన పశుసంపద పవిత్రతను,వానికి లభించిన
విష్ణుపాదములను,లక్ష్మీ ముద్రగా భావించే స్వామివారి తిరునామమును,కర్త-కర్మ-క్రియ మూడు తానేయైన శ్రీకృష్ణుని బృందావనమును,పెద్ద ముత్తైదువును గోదాదేవిని మన గోపిక చూచినది.
తిరునామ పవిత్ర విశేషములను చతుర్ముఖుడైన బ్రహ్మకు,వేయి పడగల ఆదిశేషునకు శక్యముకాదు.యథాశక్తి ప్రయత్నిస్తాను.మథ్వాచార్యులవారు ఈ పవిత్ర సంప్రదాయమును పరిచయము చేసిరి.పరాశర స్మృతి దీని విశేషతను వివరిస్తుంది.వాసుదేవ ఉపనిషత్తు త్రిమూర్తి స్వరూపముగా భావిస్తుంది.యజుర్వేద-సామవేదములు గాయత్రీమంత్రముగ (భు: భువ స్వర) కీర్తిస్తాయి.శివ కేశవ తత్వములే త్రిపుండ్రములు.ఒకటి నిలువు మరొకటి అడ్డము,నిద్ర.సుషుప్తి,జాగ్రదావస్థలుగాను,స్థూల,సూక్ష్మ,కారణ శరీరములుగాను భావించబడినవి.శ్రీ కృష్ణుని పాద పద్మములు ముద్రింపబడిన 12 స్థానములలో పూజనీయ ద్వాదశ పుండ్రములకు నమస్కారములు.
ధారకము అనగా ఆధారము,పోషకము ఆధేయము,భోగ్యము ఆత్మారామము అయిన పరమాత్మను గోపిక గుర్తించుచున్నది
.
ఒక్కరే భగవదారాథన చేస్తే అది భక్తి.పదిమందితో కలిసి తను చేయించి వారిని కృతార్థులను చేస్తున్న గోపికా రూపమున నున్న గోదాదేవిని గుర్తించగలుగుతున్నది.( ఇది జ్ఞానము)
.
శ్రీకృష్ణుని మనోహర నామరూపములు గొల్లెతల తాదాత్మ్యము కొరకు,రంగు రూపులేని శాశ్వతునిచే," ప్రకటించబడినదని "గ్రహించుచు,మరొక మెట్టు ఎక్కుతున్న గోపిక గురించి ఆలోచిస్తు,నా మనసు అమ్మవెంట వ్రతము చేయుటకు నడచుచున్న గోపికలతో తన అడుగులను కదుపుతోంది.
( ఆండాళ్ అమ్మ తిరువడిగళే శరణం )"

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...