Monday, January 29, 2018

SRI SIRIVENNELA


సిరివెన్నెలలను కురిపించుట సిత్రమని అంటారా
చదువులతల్లి పోలికేమో
............
శ్రీ.సి.వి.యోగి తనయునికి
అద్భుతయోగము ప్రాపించుట సిత్రమని అంటారా
తండ్రి పోలికేమో
............
పునీత శ్రీమతి సుబ్బలక్ష్మి పుత్రునికి
నిబ్బరపు అబ్బురపాటలు అందించుట సిత్రమని అంటారా
కన్నతల్లిపోలికేమో
..............
పూజ్యులు శ్రీ.సత్యారావు శిష్యునికి
జీవిత సత్తెములను అందించుట సిత్రమని అంటారా
గురువుగారి పోలికేమో
..............
చిదానంద శివానందకర్తకి
ఆనందపు పదినందులు సిత్రమని అంటారా
పరమేశ్వరుని పోలికేమో
.......................
త్రిభువనముల శుభము కోరు సుకవికి
కలమును ఖడ్గముచేయుట సిత్రమని అంతారా
సంస్కారపు పోలికేమో
................
సన్మానములను పొందు సన్మార్గపు మనీషికి
కపివరుని ముందు కుప్పిగంతులువేయు
నా చిలిపితనం సిత్రమనే అంటాను
బహుశా మమకారపు పోలికేమో
...............
జన్మదిన శుభాకాంక్షలతో

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...