Monday, January 29, 2018

TIRUPPAAVAI-10



నోత్తుచువర్గం పుగుగిన్ర అమ్మనాయ్
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాళ్
పోత్తపఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్
కూత్తత్తిన్ వాయ్ వీళంద కుంబకరణనుం
తోత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో
ఆత్త అనందలుడయాయ్ అరుంకలమే
తేత్తమాయ్ వందుతిఱ ఏలో రెంబావాయ్
ఓం నమో నారాయణాయ-10
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
ప్రభువుల,పడతుల,ద్విజుల కర్తవ్యపాలనమైన
నెలకు, ఆరక కురియుచున్న మూడు వానలలో
బురద అంటనీయని వైరాగ్యపు భాష్యమైన
"మణి కైరవ" దిగుడుబావి విరబూసిన తామరలలో
పూర్వ పుణ్యఫలముగా యోగ తాదాత్మ్యమైన
అంభోరుహనేత్రి పోవుచున్న కుంభకర్ణుని నిద్రలో
'ఉడైయార్ ఆరుఙ్ లమే"అని అగస్త్యుని తలపించినదైన
అమ్మ కీర్తించుచున్న ఆ ఆభరణపు పాశురములో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము.
మాయ తెరను తొలగించుకొని,మాధవ సరస భావనలో నున్న గోపికను,తలుపును (మాయతెర)
దాటలేని గోపికలు,స్వామిని సేవించుటకు నిదురను చాలించి తమతో రమ్మనుచున్నారు.కుంభకర్ణుని గెలిచి,అతని వద్ద నుండి కప్పముగా నిద్దురను స్వీకరించిన దానా!(బాహ్యార్థము)
తామస గుణమును జయించి,తత్ఫలితముగా,తనలోని పరమాత్మతో రమించుచున్న దానా!(విశేషార్థము.)
సస్యశ్యామలతకు కారణమైన వానల వలన ఏర్పడిన బురద నుండి పుట్టినప్పటికిని సంసారమనే బురదను అంటనీయకుండ జ్ఞానముతో ప్రకాశించుచున్న గోపిక యొక్క యోగ తాదాత్మ్యతలో,"ఉడైయార్ ఆరుంకలమే " అని అమ్మచే కీర్తింపబడుచున్న అగస్త్య మునిలో,జ్ఞానాభరణ పాశురములో నిమగ్నమైన నా మనసు పాశురములను కీర్తించుచు,భక్తి అనే పువ్వులను శరణాగతి అను దారముతో అల్లిన హారములను స్వామికి సమర్పించుటకు చెలులారా కదిలి రండి.తెల తెలవారుచున్నది.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...