Monday, January 29, 2018

TIRUPPAAVAI-05

మాయనై మన్ను వడ మదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్ తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోండ్రుం అణివిళక్కై
తాయైక్కుడల్ విళక్కం శెయద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూ మలర్ తూవిత్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళయుం పూగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శెప్పేలో రెంబావాయ్
ఓం నమో నారాయణాయ-5
************************
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది
పాలుతాగినంతనే పూతన పాపాలు పరిహారమైన
మురిపాల బాలగోపాలుని మేలుకొలుపులలో
యశోదమ్మ పున్నెమేమో తనకుతాను కట్టుబడిన వాడైన
మన్నుతిన్న వాడన్న దామోదర రూపములో
వ్యత్యస్త పాదారవిందములతో కాళియమర్దనమైన
ప్రస్తుతించి పులకించిన పశుపక్షి గణములలో
మధుర నిర్వాహకుడు మన వ్రతనాయకుడైన
ఆగామి సంచిత హరుని ఆగమ స్తుతులలో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా! రారె
తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె
భావము
పాలుతాగి,పూతన పాపాలను తొలగించిన నల్లనయ్య మేలుకొలుపులలో,అమ్మకు పదునాలుగు లోకములు చూపించి,తనకు తానుగా దొరికి యశోదచే రోటికి కట్టబడిన దామోదరునిలో,( పొట్ట మీద తాటిగుర్తు కలవాడు),కాళియ మర్దనముతో పశు-పక్ష్యాదులను కాపాడిన వానిలో,సర్వ పాపములను పోగొట్టువాడును,మన వ్రత నాయకుడగు కృష్ణుని యందు నిమగ్నమైన నా మనసు,పాశురములను కీర్తించుచు,భక్తి అను పువ్వులను,శరణాగతి అను దారముతో,అల్లిన హారములను,స్వామికి సమర్పించుటకు చెలులారా! కదిలి రండి.తెల్లవారు చున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...