NAH PRAYACHCHAMTI SAUKHYAM-28

నః ప్రయచ్చంతి సౌఖ్యం-28 *********************** భగవంతుడు శరణాగత రక్షకుడు-భక్తుడు శరణుఘోషల ప్రియుడు. " నమో రుద్రాయాతతావినే క్షేత్రాణాం పతయే నమః." ఎక్కుపెట్టబడిన వింటిచే భక్తుల శత్రువులను దుష్టులను సంహరించు,శరణాగత స్వామియైన రుద్రునకు నమస్కారములు. ఎందరో నర,కిన్నెర,యక్ష,గంధర్వ,సురాధిపులు మహేశుని శరణు కోరి,మాయామోహిత విముక్తులై,మాననీయులైనారు.శివుని మహిమలనువర్ణించుటకు వేయితలల ఆదిశేషునకే వశము కాలేదు,పిపీలకము వంటి నేనెంత? సకలదేవతా శివస్తుతి **************** 1. దేవదేవ త్రినేత్రాయ అందుకో వందనములు జటామకుట కపర్ది అందుకో వందనములు. 2.భూత భేతాళ నాథాయ అందుకో వందనములు రక్త పింగళ నేత్రాయ అందుకో వందనములు. 3.భైరవ ఊర్థ్వకేశాయ అందుకో వందనములు అగ్ని నేత్ర చంద్రమౌళి అందుకో వందనములు. 4.బ్రహ్మ కపాల మాలాయ అందుకో వందనములు బ్రహ్మాండ కాలాతీతాయ అందుకో వందనములు. 5.కరిగర్భ నివాసాయ అందుకో వందనములు కరి మస్తక పూజ్యాయ అందుకో వందనములు. 6.ప్రచండదందహస్త...