Thursday, May 16, 2019

NAH PRAYACHCHAMTI SAUKHYAM-28

 నః ప్రయచ్చంతి సౌఖ్యం-28
 ***********************
 భగవంతుడు శరణాగత రక్షకుడు-భక్తుడు శరణుఘోషల ప్రియుడు.

 " నమో రుద్రాయాతతావినే క్షేత్రాణాం పతయే నమః."

  ఎక్కుపెట్టబడిన వింటిచే భక్తుల శత్రువులను దుష్టులను సంహరించు,శరణాగత స్వామియైన రుద్రునకు నమస్కారములు.

  ఎందరో నర,కిన్నెర,యక్ష,గంధర్వ,సురాధిపులు మహేశుని శరణు కోరి,మాయామోహిత విముక్తులై,మాననీయులైనారు.శివుని మహిమలనువర్ణించుటకు వేయితలల ఆదిశేషునకే వశము కాలేదు,పిపీలకము వంటి నేనెంత?

సకలదేవతా శివస్తుతి
  ****************

1. దేవదేవ త్రినేత్రాయ  అందుకో వందనములు
   జటామకుట కపర్ది అందుకో వందనములు.

2.భూత భేతాళ నాథాయ అందుకో వందనములు
  రక్త పింగళ నేత్రాయ  అందుకో వందనములు.

3.భైరవ ఊర్థ్వకేశాయ  అందుకో  వందనములు
  అగ్ని నేత్ర చంద్రమౌళి అందుకో  వందనములు.

4.బ్రహ్మ కపాల మాలాయ  అందుకో  వందనములు
  బ్రహ్మాండ కాలాతీతాయ అందుకో వందనములు.

5.కరిగర్భ నివాసాయ  అందుకో  వందనములు
  కరి మస్తక పూజ్యాయ అందుకో  వందనములు.

6.ప్రచండదందహస్తాయ అందుకో  వందనములు
  ప్రపంచ పూర్ణ వ్యాప్తాయ  అందుకో వందనములు.

7.నీలకంఠ త్రిసూలాయ  అందుకో వందనములు
  లీలా మానుష దేహాయ అందుకో వందనములు

8.అష్టమూర్తి  యజ్ఞమూర్తి  అందుకో వందనములు
  దక్షయజ్ఞ వినాశాయ అందుకో  వందనములు.

9.వేద వేదాంగ వక్త్రాయ  అందుకో వందనములు
  వేద వేదాంత వేద్యాయ  అందుకో వందనములు

10.సకలసన్మంగళ విగ్రహాయ అందుకో  వందనములు
   సకల దేవతాస్తుతాయ  అందుకో  వందనములు.


     ఇది మహా పురాణాంతర్గత సకల దేవతా స్తుతి సకలాభీష్ట ప్రదం. సర్వమంగళ కరం. సదా శివ కృపాకటాక్ష కరం.


  ( ఏక బిల్వం  శివార్పణం.)

     ఓం తత్ సత్.






 కావునర్య్ద్రస్వరూపులు పెద్దమనసు చేసుకొని,అసంఖ్యాకములైన ఆ సంకర సరణాగత రక్షణమును తలుచుకొని,అతి విశేషమైన క్షీర సాగర మథనమున జనించిన గరళమును సూక్ష్మముగా చేసి,శరణు కోరిన దేవతలను రక్షించుటకై తనకంఠమునందు నిలుపుకొని గరళకంఠుడైన స్వామిని,

 " నమో నీలగ్రీవాయచ-శితికంఠాయచ."

    తెల్లని కంఠముగల రుద్రునకు నమస్కారము.శరణాగత రక్షణార్థము,జగదోద్ధరణమునకై కాలకూట విషమును కంఠమునందు నిలుపుకొనిన నల్లని కంఠము గలరుద్రునకు నమస్కారము.

  భక్తుని విషయమునకొస్తే,

  శరణము శరణము శివా-శరణార్థిని శివా అని,

 అనిశము ఆ శివుని స్మరిచి ధర్మమునకు గ్లాని సంభవించుచున్న సమయమున,నందివాహనుని ఆనగా , అనుగ్రహమును తోడ్కొనివచ్చిన ధన్యుడు బసవేశ్వరుడు.

  " నమో అపగల్భాయచ" మాతృగర్భమున శిశువుగా నున్న నందీశ్వరునకు నమస్కారములు


    కర్ణాటకములో హింగుళేశ్వరము అను పట్టణమున మండెగ మాదిరాజు అను గొప్ప పండితుడుండెను.మాదమాంబ అతని ధర్మపత్ని.ఈశ్వర సంకల్పముగా  నందినోము నోచుకొని,వరప్రభావముతో పండంటి బిడ్దకు జన్మనిచ్చింది.తల్లిగర్భములో బసవన్న మూడు సంవత్సరములున్నాడని పెద్దల అభిప్రాయము.కప్పడి సంగమేశ్వర ఆలయ సమీపమున నున్నఒకయోగి బాలుని దీవించి,బసవన్న అను పేరుపెట్టెను." సహస్రాక్షాయాచ"అనంత దర్శన శక్తి గల స్వామి బాలునకు అఖండ ఆశీర్వచనములనొసగి,లింగార్చన చేసిన ప్రసాదమును,బాలునకు ఆహారముగానిమ్మని,అన్యము వద్దని చెప్పి,అంతర్ధానమయ్యెను.

  " నమో బభ్లుశాయచ" వృషభవాహనమైన స్వామి కృపాకటాక్షములతో బసవడు బహుముఖప్రజ్ఞలతో దినదిన ప్రవర్థమానమగుచున్నాడు.

  శరణు శరణు శివా-శరణార్థిని నేను శివా.

 ఆ రోజులలో కులవ్యవస్థ కుమార్గమున పయనించుచు,కుత్సిత పధ్ధతులను అవలంభించసాగినది.మంచి-చెడు అని రెండు పద్ధతులుండవలసిన చోట అగ్రవర్నములు-అథమ వర్ణములను అను పధ్ధతి ఏర్పడినది.తత్ఫలితముగా కొందరి అజ్ఞానముచే చాలామంది అంటరానివారుగా పరిగణింపబడుతు,అన్యాయముగా శిక్షలను పొందుచున్నారు.ఆ విధముగా జరుగుచున్న దురాచారములలో ఉపనయనసంస్కారము,సద్వినియోగము అగుటలేదని,బ్రహ్మణాధిపత్యమును బలపరచుచున్నదని,దానిని వ్యతిరేకించినాడు బసవడు.

 " కులాలేభ్యో కర్మారేభ్యో నమోనమః." కుమ్మరి,కమ్మరి,జాలరి,బోయవాడు మున్నగువారి రూపములలోని రుద్రచైతన్యమునకు నమస్కారములు.

 శరణుశరణు శరణు శివా- శరణార్థిని నేను శివా.

 చుక్కలు బ్రహ్మము-సూర్యుడు బ్రహ్మము
 వాక్యము బ్రహ్మము-వార్థక్యము బ్రహ్మము

 బ్రహ్మము వేరు-భక్తివేరు అని తన తండ్రికి బోధించెను. మరియును,

 తండ్రీ నేను జన్మతః శివమంత్రోపదేశిని." ఓం నమః శివాయ." భస్మము-రుద్రాక్షలు నాయొక్క వేషము.సద్యోజాత-తత్పురుష-అహోర-ఈశానాది పంచముఖలింగ సేవనమే నా స్వభావము అని వివరించి,

  లింగము సంకేతముగా,శుభరూపము శివునిగా
  సృజనాత్మక తత్త్వముతో నిశ్చయముగ శుభములొసగు
  పశ్చిమాభిముఖుడు,పరమ కరుణాంత రంగుడు
  సద్యోజాత నామ శివుడు సకల  శుభములొసగు గాక.

 లింగము సంకేతముగా,గుణరహిత మూర్తిగా
 మేథ-జ్ఞాన తత్త్వములతో సకల విద్యలనొసగు
 "దక్షిణాభిముఖుడు" దక్షరాజు అల్లుడు
 అఘోరనామ శివుడు అఘములు తొలగించుగాక.

 లింగము సంకేతముగా,మాయను కప్పువాడుగా
 తిరోధాన తత్త్వముతో,పరిపాలన సాగిస్తూ
 తూరుపు ముఖాభిముఖుడు,మార్పులేవి లేనివాడు
 తత్పురుష నామ శివుడు పురుషార్థములిచ్చుగాక.

 లింగము సంకేతముగా,పంచకృత్యములైనాడుగా
 అనుగ్రహ తత్త్వముతో భువనైక సంపదలొసగు
 ఊర్థ్వముఖాభిముకుడు పరమార్థమైనవాడు
 "ఈశాన " నామ శివుడు ఈప్సితార్థమిచ్చుగాక.

లింగము సంకేతముగా,పంచకృత్యములైనాడుగా
 అనుగ్రహ తత్త్వముతో భువనైక సంపదలొసగు
 ఊర్థ్వముఖాభిముకుడు పరమార్థమైనవాడు
 "ఈశాన " నామ శివుడు ఈప్సితార్థమిచ్చుగాక.

"శివ దర్శనం న చింత నాశనం
పాద దర్శనం న పాప నాశనం
జంగమ దేవర స్మరణం జన్మ సార్థకం."
(ఏక బిల్వం శివార్పణం) అని వివరించుచున్న బసవని విషయ పరిజ్ఞానమునకు ముచ్చటపడి,మేనమామ తనకుమార్తెయైన గంగమాబికనిచ్చి,కళ్యాణము గావించెను.

  గౌరీ కళ్యాణ వైభోగమే-బసవ కళ్యాణ సౌభాగ్యమే.

  బసవడు విభూతి-రుద్రాక్షమాల ధారియై కప్పడి సంగమేశ్వర దర్శనార్థము వెళ్ళుచుండగా ,తనను సమీపించిన వారికి శివతత్త్వమును బోధించసాగెను.ఒక్కడే రుద్రుడు.అన్యములేరెవరు అనుచు,శరణుకోరి వచ్చినవారిని రక్షించుటయే శివ సేవ యని,భక్తిని చాటుకొను విధము,భక్తుల బాగోగులను గమనించుటయే యని వివరించెను.శివునకు-శివ భక్తునకు భేదములేదని వివరించెను.ఎదుటపడినవారిలోని శివుని చూచుచు,శరణుశరణు శరణు శివా-శరణార్థిని నేను శివా అని శరణుఘోషలు చేయసాగెను బసవడు అత్యంత భక్తిశ్రద్ధలతో.

  శరణాగత రక్షకుడైన శంకరుడు బసవనికి మంత్రిత్వ బాధ్యతలను అప్పగించి,దేశపరిస్థితులను బాగుచేయదలిచాడు.బాధ్యతగా స్వీకరించాడు బసవడు." మంత్రిణాం పతయే నమః."


   మంత్రాంగ కర్తవ్య నిర్వహణను కడు నైపుణ్యముతో నిర్వహించుచున్నప్పటికిని,క్షణకాలమైనను శివసేవా కర్తవ్యమును విడనాడలేదు.శివభక్తులు వచ్చుచున్నదారులలో కస్తురి పరిమళములను జల్లించుట,జంగమదేవరలను జయజయ ధ్వానములతో ఆహ్వానించి,పూజించి,ఆతిథ్యమునిచ్చి,సంతుష్టులను చేయుట,సదా శరణుఘోషను మార్మ్రోగించుట మరువలేదు. ముచ్చట పడిన మూడు కన్నులవాడు బసవని భక్తిని లోకవిదితముచేయాలనుకున్నాడు.

    " విశ్వతః పాణిపాదాబ్జం విశ్వతోక్షి శిరోవ్ముఖం
      జ్వలంతం విశ్వమావృత్య తేజోరాశిం శివం స్మరేత్."

   జాజ్వల్యమానమైన జంగమదేవుడై బసవని దగ్గరికి ఆతిథ్యమునకై వచ్చాడు.ఆనంద మానసముతో బసవడు,


  "ఎనగింత కిరియరిల్ల
   శివభక్తరి గింత హిరియ రిల్ల
   నిమ్మ పాదసాక్షి ఎన్న మనసాక్షి
   కూడల సంగమదేవ ఎంగదే దిబ్య."


   నాకన్న అల్పులు లేరు.శివభక్తులను మించి శ్రేష్ఠులు లేరు.నీ పాద సాక్షి.నా మనసు సాక్షి.కూదల సంగమదేవ నాకిదే దివ్యం." అని స్తుతిస్తూ,పూజిస్తూ,బంగరు గిన్నెలో అన్నము కలిపి స్వామి నోరుతెరిచి ప్రీతితో తింటుంటే,భక్తితో అందించసాగెను.చూసినవారు-భావించిన వారు ధన్యులు.అంధసస్పతికి అన్నమును కలిపి ముద్దలు చేసి ఆరగింపుచేయు బసవడు భాగ్యవంతుడు.


  అక్కడే ప్రారంభమైనది అసలుకథ.భృత్యాచార సంపన్నుడైన బసవని కృతకృత్యుని గావించిన నృత్యప్రియుని మనోహర లీల.అన్నమును మాయముహేసి,ఆహారమునకై నోరుతెరిచి,అన్నముపెట్తమను,అన్నపూర్ణేశ్వరుని హేల.అర్థాకలితో అతిథిని పంపరాదు.అన్నపదార్థములు అదృస్యమైనవి.అయిననేమి? ఎంతమాత్రమును చింతించక,అన్న పాత్రలో ముడుచుకొని ఆహారముగా తానే పుడుకున్నాడు బసవడు అర్పిత భావముతో.స్వామిముద్దకోసము నోరుతెరువగానే అప్రయత్నముగా నోటిలోనికి దూకాలని.ఏంతటి ధన్యతనొందినావురా నందీశ్వర.నమో నమః

  ధూర్జటిగారు కాళహస్తీశ్వర మహాత్మ్యలో పవి పుష్పంబగు అన్నరు.శిచానుగ్రహము రాయిని వజ్రమును పువ్వుగా చేస్తుందట అనుబహవించి వ్రాసినది.
  బసవ అని భక్తితో అంటే చాలు గండ్రగొడ్డలి సౌగంధికమవుతుంది.
  బసవ అంటే చాలు అసమలోచనుడు ఆదుకుంటాడు.అదే జరిగినది.

  అపరదయాళువైన ఆ నందివాహనుడు నిజస్వరూపముతో ఎదుట నిలిచి చేయబోవు సంస్కరణలకు చేయూత తానౌతానని దీవించి,అదృశ్యుడైనాడు ఆ ఆనందలోలుడు.

 అదే కృపతో శరణార్థులను శరణుఘోష ప్రియులను ఆశీర్వదించును గాక.

 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

 (ఏక బిల్వం శివార్పణం.)


 

.
.
.

   

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...