Posts

Showing posts from April 5, 2018

SAUNDARYA LAHARI-78

  సౌందర్యలహరి-చాముండా  పరమ పావనమైన నీ పాదరజ కణము  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము  పరమేశ్వరి క్రోధపు కనుబొమల ముడినుండి  దంష్ట్రా-కరాళ వదనముతో ప్రభవించితివి  ధర్మ సంస్థాపనమునకై ప్రచండ యుద్ధము చేసి  చండ-ముండ శిరములను ఖండించితివి, స్వస్తి.  సప్త మాతృకవో  నీవు సంతృప్త  శ్రీమాతవో  పుడమి పుణ్య క్షేత్రమైన చాముండి కొండమీద  మాయాసతి  శిరోజములు మహిమాన్వితమైనవి  కాళియే  చాముండిగా మమ్ము కాపాడుచున్న వేళ  నీమ్రోలనే నున్న నా కర్లు విడనాడకమ్మా,నా  మానస విహారి! ఓ సౌందర్య లహరి.