Thursday, April 5, 2018

SAUNDARYA LAHARI-78

  సౌందర్యలహరి-చాముండా

 పరమ పావనమైన నీ పాదరజ కణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 పరమేశ్వరి క్రోధపు కనుబొమల ముడినుండి
 దంష్ట్రా-కరాళ వదనముతో ప్రభవించితివి

 ధర్మ సంస్థాపనమునకై ప్రచండ యుద్ధము చేసి
 చండ-ముండ శిరములను ఖండించితివి, స్వస్తి.

 సప్త మాతృకవో  నీవు సంతృప్త  శ్రీమాతవో
 పుడమి పుణ్య క్షేత్రమైన చాముండి కొండమీద

 మాయాసతి  శిరోజములు మహిమాన్వితమైనవి
 కాళియే  చాముండిగా మమ్ము కాపాడుచున్న వేళ

 నీమ్రోలనే నున్న నా కర్లు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...