Sunday, December 26, 2021

PAASURAMU-11

తిరుచిట్రంబలం-పాశురం-11 *********************** ముయ్యార్ తడం పొయిగై పుక్కు ముగేరెన్న కయ్యార్ కుడైందు కుడైందు ఉన్ కళల్ పాడి అయ్యా వళి అడియో వాళ్దోంకాణ్ ఆరళ్ పోర్ శయ్యా వెణ్ణిరాడి శెల్వా శిరు మరుంగుల్ మయ్యార్ తడంగన్ మడందై మణవాలా అయ్యా నీరాట్కొండ అరుళుం విడయాట్రిన్ ఉయివార్గళ్ ఉయ్యాం వగయెల్లాం ఉయందోళిదోం ఎయ్యామల్ కాప్పై ఎమై ఏలో రెంబావాయ్ తిరుమాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో పుణ్యతీర్థ స్నానము మహిమ గురించి కీర్తిస్తున్నారు. " అపవిత్రో పవిత్రావ సర్వస్థాం గతోపివా యః స్మరేత్ పుండరీకాక్షం సః బాహ్య-అభ్యంతరః శుచిః" వశిష్ట ముని జనక మహారాజునకు చెప్పిన విధముగా సర్వదేవతాశక్తులును సత్వగుణసోభను సంతరించుకొని ద్రవరూపమై జలావాసమును చేయుచున్న సమయమున జీవుని పాప-పుణ్యములతో సంబంధములేక వేసిన మునక కల్మహములను హరించివేసి,సన్మార్గమును చూపి,సద్గతిని ప్రసాదిస్తుందని ఆర్యోక్తి. ప్రస్తుత పాశురములో వెణ్ణిరాడై ప్రాభవము ప్రస్తుతింపబడుచున్నది. వెణ్-తెల్లని నీర్-ఆడి-జలములో స్నానముచేసి శెల్వన్-ఐశ్వ్ర్య వంతులైన వారిని చెబుతున్నారు. తెల్లని జలములో స్నానము చేసి భగవంతుడు-భక్తుడు ఇద్దరును ఐశ్వర్యవంతులైనారు. స్వామి మడైంద-ఉత్తమస్త్రీ యైన మాత పార్వతికి, అదియును- శిరు మరుంగుల్-సన్నని నడుముగల,సిమ్హ మధ్యయైన,మంత్ర స్వరూపమైన, మయ్యార్ తడంగల్-విశాలమైన కరుణ పూరిత నేత్రములు కలిగిన అమ్మ విశాలాక్షికి, మణవాలా-భర్గా,నాధునిగా, వెణ్ణిరాడై-విబూదితో నిండి,ఐశ్వర్యప్రదాయకుడైన శెల్వ గా ఈశ్వరునిగా ప్రకాశిస్తున్నాడు. భక్తుల విషయమునకు వస్తే, వెణ్ నీరాడి-సత్వ శుధ్ధ జల పూరితమైన, పొయిగై-కొలనులో మునిగి పునీతులగుచున్నారు. ఆ పొయిగై-కొలను/పుష్కరిణి ఎలా ఉన్నదంటే, ముయ్యార్ తడం- ముయ్యార్ -తుమ్మెదలతో, తడం-నిందిపోయి ఉనది. ముయ్యార్ ఎందుకు అక్కడికి వచ్చి వాలినవి అన్న సందేహము మనకు రావచ్చును. ఆ మడుగు వికసించిన కమలములతో వింత సువాసనలతో తుమ్మెదలను ఆకర్షించుచున్నది. వచ్చి వాలిన తుమ్మెదలు పొయిగై పుక్కు-మడుగులోనికి ప్రవేశించి, ముగేరెన్న-శబ్దములను చేయుచున్నవు. చేతులతో మధువును పట్తుకొని గ్రోలుతు ఆనందముతో చేయుచున్న శబ్దములు మడుగున ప్రతిధ్వనించుచునది.ఇది బాహ్యము. మన చెలులు సైతము ఆ మడుగులోనికి ప్రవేశించి సత్వగుణశోభిత పద్మములై , కయ్యార్-చేతులనిండా జలమును తీసుకొని కుడైందు-కుడైందు-ఒకరిపై ఒకరు జల్లుకుంటూ,కేరింతలు కొడుతూ శబ్దములను చేయుచున్నారు. ఇది దృశ్యము. కాని నిశితముగా పరిశీలిస్తే స్వామి అవ్యాజ అనుగ్రహ కరుణా ప్రవాహము ఆ మడుగు/పొయిగై.సానపెట్తిన సాధనతో పరమాత్మను పరిపరివిధములుగా ప్రార్థించుచున్న ఎందరో మహానుభావులు పద్మములు. వారుచేయుచున ప్రణవమే పదిదిక్కుల వ్యాపించి పరిమళిస్తున్న తుమెదల ఝుంకారము.స్వామి వారిపై కురిపిస్తున్న అనుగ్రహమే ఆ తెల్లని ఎర్రని కళలతో కనువిందుచేసే అర్థనారీశ్వరము. చెలులద్వారా తిరుమాణిక్యవాచగరు మనలను మనము ఉధ్ధరించుకొనుటకు ఒక చక్కని మార్గమును చూపుచున్నారు. అదియే, అయ్యా-పరమేశా వళి అదియో-నీవు మాకొక మంచి వలి-మార్గమును చూపుతున్నావు. చూపతమే కాదు నీవు , ఆరోళ్పోర్ వాళ్దోకాణ్-అదరముతో మేము ఆ మార్గమున నడుచుకొనునట్లు,మమ్ములను నడుపుతున్నావు. మేమా ఎయ్యామల్-అసక్తులము కాని నీవు ఎందరినో నీ అక్కున చేర్చుకొనుట తెలిసినవారలము. ఉయ్ వార్గల్ -ఎందరినో నీ ఒడిలో ఒదిగే భాగ్యమును ప్రసాదించావు. ఎయ్యామల్-మేము అశక్తులమైనప్పటికిని, విడయాట్రిల్-నీ అవ్యాజ అనుగ్రహమును వినియున్నాము. స్వామి మమ్ములను కనికరించి ఎమై మమ్ములను కాప్పై-కాపాడు అని వేడుకొనుటకు ముందుగా పుణ్యతీర్థ స్నానమును ఆచరించి,శివనోమును నోచుకొనుటకు చెలులతో బయలుదేరినారు. అంబే శివే తిరువడిగలే శరణం.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...