Tuesday, January 9, 2024

TURUPPAAVAI-PAASURAM-25


  1.పరమాత్మతన విభూతిగా తాను సృజించిన సంసారమనే సాగర్ములో తిరుగాడుచున్న మత్స్యము.దానికికారణము సోమకుడు అను తమో-రజో గుణములు,వేదములు అనే జ్ఞానమును/సత్వగుణమును దాచివేసి,రజో-తమో ప్రవృత్తులను అధికముచేయుటయే.

 2.తాను సృజించిన/తన విభూతి యైన సంసారమను పెద్ద కొండను మునగకుండా చేయుటకై,తమో-రజో గుణముల నుండి సత్వమును సంరక్షించుటకై సిద్ధపడిన సత్యస్వరూపమే కూర్మము.కల్పవృక్షము-కామధేనువు,ఐరావతము,తెల్లగుర్రము ఇలా ఎన్నో ప్రలోభములు పక్కదారిపట్టిస్తున్నప్పటికిని అమృతమే గమ్యము కనుక దానిమర్మమును చెప్పునదియే కూర్మము.

 3.భూసంరక్షణమే/ఉపాధి సంరక్షణమే,"శరీరమాద్యంఖలు ధర్మసాధనం"కనుక పరమపద పథమును సూచించు ఉపాధి సంరక్షణమే వరాహావతారము.

 4.నరత్వము-సింహత్వము సగముసగముగా నున్నది నారసింహము.ఇప్పటివరకు ఉపాధికి దూరముగానున్న తమో-రజో గుణములు ఉపాధిలోనే ,సత్వము సగము తరలి వచ్చినను,కదలక-మెదలకనున్నవికనుక,

 ఐహికమును/ఉపాధిని/తమో-రజో గ్య్ణములను హింసించి,నరత్వమును హింసించి,చైతన్యమును గమనించుటయే నారసింహము.

 5.మనకు ఉన్నదనుకున్న జ్ఞానము వామనము/అసంపూర్ణము.దానిని త్రివిక్రమము చేసుకోవాలి.త్రిగుణములను జయించాలి అనిచెప్పేది త్రివిక్రమావతారము.

 6.బలరామ-పరశురామ అవతారములు తమో-రజో గుణ సంకేతములుగా భావిస్తారుకనుక మనము ఆ దశను సైతము దాటి,

 7.సత్వగుణ సంకేతమైన శ్రీరామావతారమునకు చేరగలగాలి.

 అంటే స్రీరామ చంద్రావతార-పరిసమాప్తి,శ్రీకృష్ణుని గా అవతరించుట ఎందుకు?అన్న సందేహము కలుగుతుంది.

 గుణాతీత/నిర్గుణ దశకు ప్రతిరూపమే శ్రీకృష్ణావతారము.

 ఇందులో మనసు ప్రమేయముండదు.పాప-పుణ్యములుండవు.రాసలీల గాభ్రమింపచేసే సారలీల.

 మన స్వామిని అవతార వైభవమును అర్థము చేసుకోవాలంటే గోపికల వలె,జ్ఞానదశను దాటి-ప్రేమదశను,

 ప్రేమదశను దాటి అమనస్క దశను చేరగలగాలి.

 ఎందుకంటే స్వామి,

 "షడేంద్రియ సమస్త ప్రీతియున్ దవ్వునన్ దివి భంగి గొను"

 ఆకాసము ఏ విధముగా వానకురిపించినప్పటికి,జలమును తాకదు.ఎండ ప్రసరించినప్పటికిని వేడినిపొందదు.అదే విధముగా పరమాత్మ ప్రణయము నిత్య ఉపోషము-అస్ఖలితము.

  దీనిని అర్థము చేసుకొనుటయే "అవతార రహస్యం/జ్ఞానము" పరమాత్మదివ్యానుభవమును పొందుటకు భక్తి-జ్ఞాన-కర్మలతో పాటుగా అవతార జ్ఞానము సైతము అత్యుత్తమ సాధనమని వైష్ణవము నమ్ముతుంది. 

 దేవకీదేవి గాయత్రీ మంత్రము-యశోదదేవి అష్టాక్షరీ మంత్రము.స్వామి మంత్రానుగ్రహము.

 కనుకనే ఒక మాట్ర్మూరి-మరొక మాతృమూర్తి అని వారి నామములు రహస్యముగా ఉంచబడినవి.

  ఓరి రవిల్-ప్రత్యేక మైన ఒకేఒక రాత్రి అది.పరమాత్మ అమనస్క దస/పరిపూర్ణ దశ పరమాద్భుతము.


3.ఇరవై ఐదవ పాశురం

*****************
ఒరుత్తు మగనాయ్ పిరందు,ఓర్ ఇరవిల్
ఒరుత్తు మగనాయ్ ఒళిత్తు వళర

తరుకిల్లానాంగి తాంతీంగు నినైన
కరుత్తై పిళ్ళైపిత్తు క్కంజన్ వయిత్తిల్

నెరుప్పెన్న నిన్ర నెడుమాలే! ఉన్నై
అరుత్తిత్తు వందోం ; పరై తరుదియాగిల్

తిరుత్తక్క శెల్వముం శేవగమం యాంపాడి
వరుత్తముం తీరందు మగిళిందు ఏలోరెంబావాయ్!

" వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం."

ఎన్నినోములు చేసినదో-ఎన్ని పూజలు చేసినదొ-ఏమి సమర్పనమును చేసినదో ఆ,

ఓరిరవల్-ఆ అర్థరాత్రి.

స్వామిని ఎంత ప్రసన్నుని చేసుకున్నదో ఆ శ్రావణ బహుళాష్టమి రాత్రి-

భవదీయమై భాగ్యవంతమై-బహుముఖప్రదమై ఎన్నెన్నో రహస్యములకు నిధియై,నిస్తులమై,నిర్మలమై-నీలమేఘశ్యాముని లీలలో తానొక భాగమై తాను తరిస్తు-మనలను తరింపచేసేందుకు.

రహస్యాతి రహస్యములను సదస్యముగాకుండ తనలోనే దాచుకుని తేజరిల్లుతున్నందుకు..ధన్యురాలివి నీవు.

అర్థరాత్రి సమయముసార్థకతను సంచరించుకుని,మనకు సాక్షాత్కరింపచేయుచున్నది గోదమ్మ ఈ పాశురము.లో

"రహస్యానాం రహస్యంచ-మంగళానాంచ మంగళం"

ఏమిటా రహస్యములు? అని మనము కనుక ప్రశ్నించుకుంటే అనేక మారులు బాహ్యములో /ఆంతర్యములో బహుముఖ్ముల ప్రకటింపబడుతు మనలను పరవశులను చేస్తాయి.అవి మచ్చునకు కొన్ని,

1.పిరందు-అవతారము/జన్మము/

ఏమిటా జన్మమునకు గల ప్రత్యేకత?

పూర్వజన్మ కర్మములను అనుభవించుటకు వాటి ఫలితములను మూటకట్టుకుని తమతో పాటుగా జన్మించుట చేతనులది.

పూర్ణానుగ్రహముతో కరుణను పెద్దమూటగట్టుకొని సంకల్పమాత్రమున సారూప్యతను సంతరించుకొనునది స్వామి ఆవిర్భావము.స్వామి తనమూలతత్త్వమునుండి(నిరాకారతను విస్మరించి) సాకారుడై సాక్షాత్కరింపచేసుకొనిన అదృష్టము ఆ అర్థరాత్రిది.

మాతృవాత్సల్యముతో ఆ దేవకీమాత స్వామిని చిన్నిశిశువుగా ప్రకటింపబడమని కోరగానే స్వామి తల్లి ఆజ్ఞను పరిపాలించుత కనులార చూడగలిగిన అదృష్టము ఆ అర్థరాత్రిది.కంసుని భయము తల్లిది.తల్లిమాతను జవదాటని స్వభావము ఈ చిన్నిశిశువుది.

3.తనను గంపలో పరుండపెట్టుకుని రేపల్లెకు తరలించే అవకాశమును స్వామి వసుదేవునకు ప్రసాదించుట చూడగలిగినది ఆ అర్థరాత్రి.

4.ఓరిరవిల్-ఆ రాత్రి,
జదములైన చెరసాల తలుపుగడియలను సైతము స్వామిసేవాపరులగుటను సందర్శించినది.జడత్వమునువీడి చేతనమై తమ వంతు స్వామి అనుగ్రహమును పొందినవి ఆ చెరసాల తలుపులు.

5.పాంచజన్యుని రేపల్లెకు తరల్చు సమయమున నేల-నింగి-నీరు నిశ్చలమనస్సుతో నీలమేఘస్యామిని దయతో తామును సంసిధ్ధులమే అని,వర్షమునకు తడవకుండా ఆదిశేషుడు గొడుగైనాడుగా.దానిని దర్శించినది ఆ ఓరిరవల్ ధన్యతనందినది.

పట్టలేని సంతోషముతో పరవళ్ళుతొక్కు యమున దారినిచ్చుటను దర్శించినది.నేల నీరు ఏమి మా భాగ్యము మాకు తారణమైన స్వామి రేపల్లె చేరుటకు మమ్ములను దారిగా మలచినాడని మరిమరి మురియుట చూసినది కదా.

అంతేకాదు పరమాత్మ తనకు తానుగా ప్రకటింపబడిన ఇద్దరు స్త్రీమూర్తులను దేవకీదేవిని-యశోదను అతి రహస్యముగా కాంచి,"ఆనంద గోపాలుని"-ఆ "నందగోపాలుని"గా చేసి,మహదానందభరితమైన ఓరిరవిల్,జగత్సాక్షికి జన్మవేడుకలలో సాక్షివైన నీవెంత ధన్యురాలివి.

ఇంకొక పెద్ద రహస్యము ఈ పాశురములో ఎవరి పేరులు ప్రస్తావింపబడలేదు.బాహ్యమునకు గోపికలు స్వామికి కంసుని బాధ ఉంది కనుక కృష్ణ అని పిలిస్తే,యశోద అతనిని పెంచే తల్లి యని,దేవకీదేవి జన్మనిచ్చిన తల్లియని గుర్తిస్తాడని ,

ఒరుత్తి మగనాయ్-ఒకదానికి కొడుకుగా,
ఒరుత్తి మగనాయ్-ఇంకొక దాని దగ్గర కొడుకుగా,పెరుగుతున్నాడట.

ఏ విధముగా నంటే,
ఒళిత్తు-తనకు తాను దాగుతు,బయటకు తెలియకుండా,
వళరద్-పెరుగుచున్నాడు.

స్వామి ఒక తల్లికి కొడుకుగా పుట్టి మరొక తల్లి దగ్గర రహస్యముగా పెరుగుతున్నాడట.

రహస్యము అంటే ఇద్దరి మధ్యన ఉండేదికదా.

కాని కృష్ణ జననమును రాత్రిచూసినది.చెరసాల చూసినది.యమున చూసినది. శేషుడు .దేవకీ వసుదేవులైతే సరేసరి.
పుట్టటమే కాదు స్వామి నామకరణమును కూడ రహస్యముగానే (గర్గ మహా మునిచే)కష్టనివారకుడు కృష్ణుడు) జరిపించుకున్నాడట.

ఏమిటీ విచిత్రము? వేయినామాల స్వామి పేరు,ఇద్దరమ్మలపేర్లు ఎందుకు గోప్యములు? అని మనము కనుక ఆలోచించుకుంటే,

నిరాకార-నిర్గుణ-నిరంజన-నిర్మల శక్తికి ఏ పేరు పెట్టగలము? ఏమని పిలువగలము?

కంస భయముచే స్వామి రహస్యముగా పెరుగుచున్నాడంటే దానిలో సత్యము ఎంతవరకు ఉన్నది? అదే నిజమైతే స్వామి తనంతట తానే వెళ్ళి వానిని పరిమార్చుతాడ?పాపమును పరిహరించుతాడ?

మనమున్న సంసారమే కంసత్వము.దాని వికారములే స్వామి బాల్యక్రీడలుగా సంహరించిన అనేకమంది అసురులు.

ఇచ్చినమాట నిలుపుకొనుటకు,గొల్లెతల ఈవిని ఇనుమడింపచేయుటకు కావింపబడిన పరమాత్మ ప్రకటనమే కృష్ణావతారమనుటలో ఏ మాత్రమును సందేహము లేదు.

నందగోపాలాయ-నానా రూపాయ నమో నమః

తరికిల్లానాంగి తాంతీగుం నినైంద

నినైంద-నిన్ను తలచినంతనే,
తాంతీంగు-ఎటువంటి ఆపదయైనా,
తరుకిల్లానాంగి-సంసారములో తట్టుకోలైనిదైన,
కంచవెళ్ళి-కంసుని కౄరత్వము వంటిదైన,

నీ యొక్క కరుణ దానిని,

నిన్ర-నిలబడిన/దృఢమైన,
నెరుపెన్న-అగ్నివలె, దహించివేసి,

వరుత్తమం-మా విచారమును
తిరందు-తొలగించివేసి,
మళిందు-మమ్ములను సంతోషులను చేస్తుంది.

అరిత్తిందు-యాచకులమై,మేము
వందోం-వచ్చాము
మేము నిన్నే మా నోమునకు సాక్షాత్తు,
తిరుత్తక్క శెల్వం-లక్ష్మీ సమేతుడవై వచ్చి,

మేము,
యాపాడి-సంకీర్తనములతో మిమ్ములను,
సేవగం-సేవించుకొనే భాగ్యమును ప్రసాదించుటకు.,
పావై-నోమునకు
ఎం-విచ్చేయండి అని
ఆహ్వానించుచున్న గోపికలను అంటియున్న గోదమ్మ చేతిని పట్టుకుని,లక్ష్మీ సమేతుడైన స్వామిని నోరార కీర్తించుటకు వ్రతమునకు రమ్మని వేడుకుందాము.

ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...