" హంస హంసాయవిద్మహే
పరమహంసాయ ధీమహి
తన్నోహంసః ప్రచోదయాత్"
హంస మానవ ఉపాధి చేస్తున్న శ్వస ప్రక్రియ.పరమ హంస లోపలి చైతన్యము జ్వలిస్తున్న విశ్వాస ప్రక్రియ.
పరమేశ్వరి సర్వారుణ-అనవద్యాంగి అనికీర్తిస్తున్నదిలలితా రహస్య సహస్రనామస్తోత్రము.అంటే షడంగ శక్తులూనవద్యములు.లోపరహితములు.శ్రేయోదాయకములు.
షడంగదేవతల ప్రస్తావనము అంగన్యాస/కరన్యాసముల పూజాప్రక్రియలో వస్తుంది.
పరమానందము ఎక్కడో లేదు అది పరమాత్మనివాసమైన మన హృదయము లోనే ఉన్నదను విషయము మన మిథ్యాప్రపంచ వ్యామోహము అడ్డుగా నిలిచి,అర్థము కానీయకున్నది.
దానినితొలగించుకొనినతరువాత,
ప్రతిశబ్దము ఓంకారమే
ప్రతి దృశ్యము మమకారమే
పంచభూతములు స్నేహితమే
పంచకృత్యములు పరమార్థమే.
క్షణభంగురములకు తావులేదు.
సర్వమంబామయం జగం.ప్రపంచము-పరమేశ్వరి అవిభ్ సర్వము అనాజ్యములు.అందులో నేనొక భాగము అను ఎరుకకలిగిన నాడు,సాధకుడు,
1.తనహృదయమున ప్రాణశక్తిని గుర్తించగలుగుతాడు.ఆ ప్రాణ శక్తికి తెలియని విషయములేదు.జ్ఞానమే హృదయము.కనుకనే ఆ పరమేశ్వరి
అరుణాం కరుణా తరంగితాక్షిమని,
అరుణాం కరుణ అంతరంగిత అక్షిం అని ప్రస్తుతింపబదుతున్నది.
సర్వమును తెలియునది సర్వజ్ఞ.
దృశ్య మాన సర్వ ద్రవ్య-గుణ-క్రియాదులు సర్వము అని భావించవచ్చును.జీవులజన్మాంతర పాప-పుణ్య క్రియా ఫలితములకు అనుకూలముగావారిని మలుస్తూ,ప్రపంచరూపమున కాలచక్రముగాకనబడునది.
2. హృదయ ద్వారము ద్వారా తనలో చైతన్య రూపిణిని గుర్తించగలిగిన సాధకుడు,తనశిరద్వారము ద్వారా ఆ చైతన్య స్వభావమును గుర్తించగలుగుతాడు.ఆ శక్తియే
"నిత్యతృప్తా"
ఆమె బ్రహ్మాండ స్వరూపముగా లౌకిక వాంఛలను తొలగించివేసి,సర్వకాల/సర్వావస్థలయందును
"తృప్తి"అను ఆనందానుభూతిని అనుగ్రహించునది.అంటే కోరికలు లేని స్థితి.శాంతరస తురీయావస్థ యందు చిత్తవృత్తులు ఆత్మస్వరూపమును దర్శించగలుగుతాయి.
3.మూడవ అంగదేవత-శిఖాదేవి సాధకుని పరముగా.అనాదిబోధా అమ్మ అంగరక్షపరముగా.
జనన-మరణాదులు లేని నిత్య-సత్య స్వరూపము పరమేశ్వరి అన్న విషయము బోధపడుతుంది.ఆ పరాశక్తియే,
శాశ్వతీ-శాశ్వతైశ్వర్య ప్రదాయిని గా అర్థమగుతుంటుంది సాధకునికి ,
మనసునకు-వాక్కునకు కారనమైన అనాదియై,వాటికిపూర్వమే ఉండి ,
పురాతనా-పూజ్యగా కీర్తింపబడుతున్నది.
4. నాల్గవ అంగదేవత కవచదేవి సధకుని పరముగా.స్వతంత్రతా శక్తి సర్వేశ్వరి క్రమముగా.
రక్షించే శక్తియే కవచము.ఆ శక్తికి మరొకరి రక్షణావసరములేదు.సాధకుడు తనను /తనలో ఆవరించియున్న సర్వరక్షాస్వరూపిణి ని దర్శించగలుగుతాడు.
5.ఐదవ అంగదేవత నేత్రదేవి సాధక పరముగా,అలుప్తా అమ్మపరముగా.
న-లుప్తా-అలుప్తా.లోపించనది.కనుమరుగు కానిది ఈ శక్తి.
దేశకాల అపరిఛ్చినా అయిన ఆదిపరాసక్తికి అంగదేవత.
6.ఆరవ అంగదేవత అస్త్రదేవి సాధకునిపరముగా,అమతా అమ్మ పరముగా.
అస్త్రములు సామాన్యమైనవికావు.అవిద్యానాశకరములు.జ్ఞాన సంపన్నములు.
దేవీ భాగవత భండాసుర సైన్యము గురించి,వధ గురించి లలితారహస్య సహస్రనామ స్తోత్రములో ,
"భండాసురేంద్రనిర్ముక్త శస్త్ర-ప్రత్యస్త్ర వర్షిణి,
మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైన్యకా
కామేశ్వరాస్త్రనిర్దగ్ధ సభండాసుర శూన్యకా:
అంటూ కీర్తించింది.
అమ్మత్రినేత్రోజ్జ్వలాం.సాధకుని జ్ఞాన చక్షువును సైతము ఆత్మతత్త్వమును తెలిసికొను అజ్ఞానమును ఖండించు శక్తిగా చేసి అనుగ్రహించు షడంద్గ దేవతలకు సవినయ ప్రణామములతో,
శ్రీ మాత్రేనమః.