Wednesday, September 14, 2022

SHADANGADEVATA MANDALAMU


 


 షడంగదేవతా మండలము

 ***************

 " ఐశ్వరస్యచ సర్వస్య వీర్యస్య యశసః శ్రియం

   జ్ఞాన వైరాగ్య యోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణా."

 

 1.ఐశ్వర్యము

 2.వీర్యము

 3.యశము

 4.శ్రీ

 5.జ్ఞానము

 6.వైరాగ్యము అను ఆరు పురాణోక్త గుణములే

...

 1.హృదయదేవి

 2.శిరోదేవి

 3.శిఖాదేవి

 4.కవచదేవి

 5.నేత్రదేవి

 6.అస్త్రదేవి  అను పేర్లతో పిలువబడుచున్న

 న్యాస/అంగ దేవతలు/శక్తులు.

     వీరిని పరమేశ్వరి సన్నిధానవర్తులుగా భావిస్తూ బిందువును ధ్యానించే సమయములో వీరిని కూడా భావిస్తూ ధ్యానిస్తారు.

GURUMANDALAMU



  గురుమండలము

  ************

 గు కారో అంధకారస్య ర కారో తత్ నివారణం-ఆర్యోక్తి.

   గురువుల/శక్తుల సమూహముగురుమండలము.శ్రీచక్రము బిందువు ను ఆవరించియున్న త్రికోణము చుట్టు విరాజిల్లుతున్న శక్తులు.

 గురుమండలము- ఎవరి అభిప్రాయము /సిద్ధాంతము వారిది.శైవ సాంప్రదాయమును అనుసరించేవారికి దక్షిణామూర్తి ఆదిగురువు.వైష్ణవ సంప్రదాయము హయగ్రీవుని సర్వ విద్యలకు ఆధారముగా కీర్తిస్తుంది.

   శాక్తేయము బిందువు నావరించి యున్న త్రికోణములో భాసించుచున్న అద్భుత చైతన్య శక్తులను గురువులుగా ప్రస్తుతిస్తోంది.

  అనేకసుగుణములను అభ్యాసము చేయించగల అంతర్ముఖుడు గురువుగా కనుక భావిస్తే మనలోనిద్రాణముగా  ఉన్నయనుకొనే శక్తులను చైతన్యవంతములుగా మనము గుర్తించునట్లు చేయగలిగేవి గురుమండల శక్తులు.


 శ్రీవామకేశ్వర తంత్ర దేవిఖడ్గమాలా విధానము ప్రకారము గురుమండలము, కామ-కామేశ్వరి రూపానికి ప్రతీకయైన బిందువు చుట్టు మూడు వరుసలలో                మూడు వర్గముల గురువులను వారి అనుగ్రహమును మనకు వివరించుచున్నది.

  దేవౌఘ/శక్తులు ,సిద్ధౌఘ,మానవౌఘ గురువులు వర్గములుగా  సాధకుని మార్గమును సుగమము చేస్తున్నారు.

 దివౌఘ గురువులు మొదటి వర్గము వారు.

1.పరమేశ్వర పరమేశ్వరి

2.మిత్రేశమయి -సూర్యశక్తి

3.షష్ఠీశమయి-సమన్వయశక్తి(షట్ చక్ర)

4.ఉడ్డీశమయి-చంద్రశక్తి

5.చర్యానాథమయి-క్రియాశక్తి

6.లోపాముద్రమయి

7.అగస్త్యమయి


 సిద్ధౌఘ గురువులు

 *************

  1.కాలతాపనమయి

  2.ధర్మాచార్యమయి

  3.ముక్తకేశీశ్వరమయి

  4.దీపకళానాథమయి

    

 ముక్త కేశీశ్వరమయి శక్తి సాధకునికి బంధవిముక్తిని ప్రసాదించేశక్తి.తపముతో కాలదోషములను తొలగించుకొనశక్తిని ప్రసాదించునది కాలతాపనమయి.తద్వారా ధర్మాచరణము నందు ఆసక్తిని కలిగించే క్రియాశక్తి.పర్యవసానము జ్యోతిదర్శనము/తిమిరహరణము.



 మూడవ వర్గ గురులు మానవౌఘులు

 ************************

1. విష్ణుదేవమయి

2. ప్రభాకరదేవమయి

3.తేజోదేవమయి

4.మనోజదేవమయి

5.కళ్యాణ దేవమయి

6.వాసుదేవమయి

7.రత్నదేవమయి

8.శ్రీరామానందమయి

 శ్రీలలితారహస్య సహస్రనామ స్తోత్రము తల్లిని గురుమూరి గుణనిధుగా ప్రస్తుతించుచున్నది.

 

 " శ్రీగురు సర్వకారణ భూతా శక్తిః" నమోస్తుతే.



     

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...