ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(VIVIDHA KARTA ESHA)-09
.jpg)
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః । మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః ప్రతి స్తోత్రము పూర్వము-పరము అను రెండు కొసలను కలుపుటకు సంగతి అను నడుమనున్న విషయములను ప్రస్తావించును.అదేవిధముగా ఆదిత్యహృదయ స్తొత్రము ఉపెద్ఘ్హ్తమను పూర్వభాగమును పఠించు అవశ్యకతను పూర్వభాగములో తెలియచేసినది.తరువాత సంగతిగా స్వామి యొక్క కిరనవ్యాపకత్వమును-లోక పాలకత్వమును తెలియచేయుచున్నాది. ప్రస్తుత శ్లోకము గౌణ నామములైన బ్రహ్మ-విష్ణు-శివ-స్కంద-ప్రజాపతి-మహేంద్ర-ధనద-కాల-యమ-సోమ అను నామ విశేషముల ద్వారా స్వామి మనలను ఏ విధముగా అనుగ్రహిస్తున్నాడో మరింత స్పష్టము చేస్తున్నది. ఏష-బ్రహ్మ-నీవే బ్రహ్మ రూపములో దాగిన అంతర్యామివి. బృహత్వాత్-బ్రహ్ణత్వాత్-ఇతి బ్రహ్మ ------------------------ అన్నింటికన్నా ఏది ఉత్కృష్టమో అది బ్రహ్మము.అదియే బృహతత్త్వము.అన్నింటియందు ఏది వ్యాపించి యున్నదో అంతర్యామిగా అదియే బ్రహ్మణత్వము.బ్రహ్మణత్వము ను ప్రకటించువాడే బ్రహ్మ.సర్వజీవులయందలి ఆత్మస్వరూపమే బ్రహ్మము.స్థావర-జంగమ స్వరూపముగా భాసించుచున్నది బ్రహ్మము.తాను కదలకుండా యుండి అన్నింటిని కదిలించు ...