Wednesday, March 15, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(VIVIDHA KARTA ESHA)-09


ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః ।

మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః 

  ప్రతి స్తోత్రము పూర్వము-పరము అను రెండు కొసలను కలుపుటకు సంగతి అను నడుమనున్న విషయములను ప్రస్తావించును.అదేవిధముగా ఆదిత్యహృదయ స్తొత్రము ఉపెద్ఘ్హ్తమను పూర్వభాగమును పఠించు అవశ్యకతను పూర్వభాగములో తెలియచేసినది.తరువాత సంగతిగా స్వామి యొక్క కిరనవ్యాపకత్వమును-లోక పాలకత్వమును తెలియచేయుచున్నాది.
  ప్రస్తుత శ్లోకము గౌణ నామములైన బ్రహ్మ-విష్ణు-శివ-స్కంద-ప్రజాపతి-మహేంద్ర-ధనద-కాల-యమ-సోమ అను నామ విశేషముల ద్వారా స్వామి మనలను ఏ విధముగా అనుగ్రహిస్తున్నాడో మరింత స్పష్టము చేస్తున్నది.
 ఏష-బ్రహ్మ-నీవే బ్రహ్మ రూపములో దాగిన అంతర్యామివి.  

 బృహత్వాత్-బ్రహ్ణత్వాత్-ఇతి బ్రహ్మ
 ------------------------
 అన్నింటికన్నా ఏది ఉత్కృష్టమో అది బ్రహ్మము.అదియే బృహతత్త్వము.అన్నింటియందు ఏది వ్యాపించి యున్నదో అంతర్యామిగా అదియే బ్రహ్మణత్వము.బ్రహ్మణత్వము ను ప్రకటించువాడే బ్రహ్మ.సర్వజీవులయందలి ఆత్మస్వరూపమే బ్రహ్మము.స్థావర-జంగమ స్వరూపముగా భాసించుచున్నది బ్రహ్మము.తాను కదలకుండా యుండి అన్నింటిని కదిలించు శక్తియే బ్రహ్మ.
   

 ఏష విష్ణుశ్చ
 --------------
 పురాణకథనము ప్రకారము ఉపేంద్రునిగా కీర్తింపబడు వామనుడు అదితిపుత్రుడు.సూర్యుడు సైతము అదితిపుత్రుడు.
 స్వభావ ప్రకారముగా వ్యాపకత్వ లక్షణము గలవారు ఇద్దరు.
 దేవనములు అనగా కిరణములు.నాడులన్నింటి యందు ప్రవహించు ప్రాణశక్తియే విష్ణువు/విష్ణువుగా సంకీర్తించబడుతున్న సూర్యుడు.
 అస్తమానే స్వయం విష్ణుః అన్నది ఆర్యోక్తి.
 ఒక విధముగా జలతత్త్వమును అందించు వానిగా కీర్తించబడుతున్నాడు సూర్యుడు విష్ణు శబ్దముచే.
 ఏష శివశ్చ
-----------
 శివనామధారిగా వృషభవాహనునిగా ప్రస్తుతింపబడుచున్న రూపములో దాగిన పరమాత్మ ప్రకాశమే సూర్యుడు.
 ప్రకాశకత్వముతో నిండి వర్షించే స్వభావము కలిగినవి/కిరణములు కలిగినవి /వృషభమును అధిష్ఠించిన సూర్యునికి నమస్కారములు.
 ప్రాతఃకాలే స్వయం బ్రహ్మ-మధ్యాహ్నేషు మహేశ్వరః-సాయం సంధ్యా స్వయం విష్ణుః అన్న వాక్యము ప్రకారము సృష్టికి కావలిసిన అగ్నిని-జలమును పరమాత్మ యైన సూర్యశక్తి బ్రహ్మ-విష్ణు-శివ అను గౌణ నామములద్వారా అందించుచున్నది.
ఏష స్కందః
 ----------
 "శోషయతి శత్రుః స్కందః"
 శత్రువులను నశింపచేయువాడు స్కందుడు.అనారోగ్యమును-మానసిక రుగ్మతలను కలుగచేయువానిని తన తేజోకిరణములచే నిర్మూలనము చేయగల శక్తికలవాడు సూర్యభగవానుడు.
  "సంసార దుఃఖం స్కందం కరోతి"
  సంసారమనే జన్మదుఃఖం-జాయాత్ దుఃఖం-సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత-జాగ్రతః-భజగోవిందం
 అట్టి సంసార దుఃఖమును నాశనము చేయువాడు ఆదిత్యుడు.

   సర్వాని ఇంద్రియాని స్కందయతి
 ఇంద్రియములను సమన్వయపరచి పుష్టినిచ్చువాడు స్కందుడు.

 


 ఏష ప్రజాపతిః 
 ************
  పురాణకథనము ప్రకారము కశ్యప ప్రజాపతి కుమారునిగా సూర్యభగవానుడు ఆరాధింపబడుతున్నాడు.
 ప్రజ అనగా సంతానము.సంతానమును పాలించెడివాడు అనగా కావ;ఇసిన ఆహారమును-ఔషధములను,చైతన్యమును,వివేకమును తన కిరనములద్వారా అనుగ్రహించువాడు.
 దీనినే "ఇనాలోక సంయోగము" అని కూడా చెబుతారు.
 ప్ర కృష్ట జనయతి ప్రజా అని ఆర్యోక్తి.ఇది
 ఎందరో పరిపాలకులకు సమిష్టిగా వాదపడు "జాత్యైక వచనము."
 మరీచి-కర్దమ-పులస్త్య-దక్ష-అంగీరస-అత్రి మొదలగు పాలనాకర్తల సామూహికనామమె "ప్రజాపతి."
 సృష్టి విస్తరణమునకు అనుకూల కిరణములను విస్తరింపచేయువాడు "ప్రజాపతి".

 ఏష మహేంద్రః
 ************
 "ఇతం రాతి మహేశ్వరః"/ఇందం రాతి మహేశ్వరః" 

  ఇతి పరమైశ్వర్యః"
 ఇంద అను పదము గొప్ప ఐవర్య సంకేతము.పర్జన్యములద్వారా/మర్ఘముల ద్వారా వర్షముననుగ్రహించి సకల ఐశ్వ్ర్యములను ప్రసాదించువాడు.శత్రువులను నాశనము చేయువాడు మహేంద్ర నామముతో నున్న సూర్యుడు.
 ఆరోగ్యం భాస్కరాదిత్యేత్-అనారోగ్య కారకములగు క్రిములను తన వేడిమిచే సంహరింపచేయువాడు సూర్య భగవానుడు.

 ఏవ ధనదః
 ************
  సూర్య భగవానుదే ప్రాకృతిక సంపదలను భూమికి తగిన ఉష్ణోగ్రత గల కిరణ ప్రసరణముచే గనులను-పంటపొలములను-నదీజలములను-ఉద్యానవనములను తుష్టి-పుష్టి నొసగునట్లు చేయును.
 ఇది నైసర్గిక ధనము.
 మన శరీరములోని నాడీ వ్యవస్థను పుష్టికరము చేయుటకు సూర్యభగవానుడు కావలిసిన పోషకములను తన చైతన్యము ద్వారా కలుగచేస్తున్నాడు.
 శాస్త్ర విజ్ఞానమును ఖగోళ శాస్త్రమును సూర్యుడు తాను స్థిరముగా నుండి తన చుట్టు తిరుగుచున్న భూగోళము గమనింపచేస్తూ ధనమును అనుగ్రహిస్తాడు.


 ఏష కాలః
 ********
 కలయతీతి కాలః అన్నది ఆర్యోక్తి.కదులుతుండేది కాలము.దాని గమనమును నియంత్రించుట మానవులకు అసాధ్యము.
 కాలమును మనము మానసికముగా-యాంత్రికముగా విభజించుకుంటే 
 యాంత్రికాల గమనము తిధి-వార-నక్షత్ర-యోగ-కరనములను అనుసరించి సాగుతుంటుంది.
 అదే కాల ప్రభావము మానవులు సంతోషముతో నున్నవేళ త్వరగా కదిలినట్లు-విచారముగా నున్న వేళ మెల్లగ కదులుతున్నట్లు భావింపచేస్తుంది.
 జీవులు తాము చేసుకున్న పాప-పుణ్యముల ననుసరించి కాల చక్ర భ్రమణములో దానిచే పట్టుకొనబడి-కొంతదూరము సాగి,విడిచివేయబడుతుంది.  

 ఏష యమః
 ******
 ధనం చైతన్యం సర్వానుగ్రహాయ -సర్వస్య అంతర్యామి దదాతి-స్థాపయతి-ధనదః. 
 జనన-మరణములను నిర్ణయించేవాడు యముడు.చిత్రముగా లెక్కలు వ్రాసి వానిని గుప్తముగా ఉంచి సమయమాసన్న మైనపుడు తన విధిని నిర్వర్తించు సూర్యుడే యముడు.

 "అంతరో యమయతి-లోపలినుండి సర్వులను నియమించువాడు.

 ఏష సోమః
 ******* 
స ఉమ సోమ.అమృతకిరణములను వెదజల్లు సూర్యుడు సోముడు.విరోధభావనమును విడిచివేయుటయే అమృతత్త్వ పానము.సమభావనమును కలుగచేయువాడు సూర్యుడు.

 మ-ప్రభ అన్న అర్థములో అన్వయించుకుంటే తన కిరణములద్వారా చంద్రుని వెన్నెల కిరణములను తయారుచేయు పరమాత్మ సోముడు.శక్తిని కలిగిన వాడు.

 ఏష అపాంపతిః
 *********
 భౌగోళిక పరముగా భావిస్తే తన కిరనముల ద్వారా పర్జన్యములను కలిగించి వర్షపాతము ద్వారా తగిన జలవనరులను కలిగించువాడు.
 ఇదే విషయమునుద్వాదశాదిత్య ప్రస్తావనలో ఒక్కొక్క నెల ఒక్కొక్క అప్రసను తోడ్కొని భానుడు తన గమనమును చేస్తాడని చెప్పబడింది.
 కాని మనసుకు కావలిసిన సత్వగుణమును సమృద్ధిగా చేయువాడు సూర్య భగవానుడు.
 ఇదే విషయమును లక్ష్మీదేవి పరముగా "ఆర్ద్రాం-జ్వలంతీం" అని అగ్ని-సోమాత్మకతను ప్రస్తావిస్తుంది శ్రీసూక్తము.






No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...