Monday, February 27, 2023

SU-IVATANDAVASTOTRAM( TANOTU SRIYAM JAGADDURAMDHARAHA)-08

 నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-

కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః |
నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః || 8 ||


  స్వామి సేవించిన గరళము గళములో నల్లని కాంతులతో నిగనిగలాడుచున్నది.ఆ నల్లదనము  వర్షించుటకు సిద్ధముగా ఏర్పడిన మేఘసమూహముల కాంతిని తోసివేసినది.అంతే కాదు చిక్కని చీకటికి ప్రతీక అయిన కుహు అమావాస్యను మించినది.ఒక్కొక్క మాసములో వచ్చు అమావాస్య తిథి ఒక్కొక్క ప్రత్యేకతను కలిగియుంటుంది.సినీవాలి కూడ అటువంటి ప్రత్యేకతను కలిగినదే.పాములతో గట్టిగా చుట్తుకొనబడి యున్నది.నల్లని రంగులో నున్న ఏనుగు చర్మమును ధరించియున్నాడు.స్వామి నిరంజనుడు.నలుపు-తెలుపు వర్ణములకు అతీతుడు.కనుకనే నల్లని వాటితో పాటుగా తెల్లదనముతో స్వఛ్చముగా ప్రకాశించుచున్న సురగంగను-చంద్రవంకను శిరోభూషములుగా అలంకరించుకొనినాడు.సర్వము స్వామి మయమే.స్వామి ప్రకాశమే.ద్వంద్వాతీతుడు. కళానిధానమును నియంత్రించువాడు.అనగా  తిథుల

ద్వారా చంద్రుని నుండి సూర్యుని దగ్గరకు,సూర్యుని నుండి చంద్రుని దగ్గరకు కళలను చేర్చుతు పున్నమిని/అమావాస్యను కల్పించువాడు.అంతేకాదు సకల కళలలు నిధానము నెలవు అయినవాడు.సంగీతము-సాహిత్యము-నాట్యము సర్వము తానైనవాడు.కాఠిన్యము-కారుణ్యము/నలుపు-తెలుపు/సంరక్షణ-సంహరణ అన్నీ తానైన స్వామి జగములకు ఆలంబనయై మంగళములను సమకూర్చును గాక.
  ఏక బిల్వం శివార్పణం.
                    

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...