Posts

Showing posts from October 3, 2018

HIMALAYAKRUTA SIVASTOTRAM

Image
 ఓం నమః శివాయ-హిమాలయ కృత శివస్తుతి  **************************************  1.సృష్టికర్త బ్రహ్మ నీవు స్థితికర్త హరినీవు    సర్వసంహార కారకుడవు సదాశివ రూపుడు నీవు 2. ప్రకృతి కారణ-కారకములు రెండును నీవు    ప్రకృతి రూప-స్వభావముల ఆధారము నీవు 3. ప్రకటిత అనేకరూప ఆలంబనము నీవు    భక్తులకు ప్రీతికర రూప ప్రత్యక్షము నీవు 4. సృష్తికాధారము నీవు సూర్య తేజము నీవు    సస్య కారక శశి నీవు శీతలత్వము నీవు        నమ@ శివాయ నమః శివాయ ఓం నమః శివాయ   5..గాలి-నీరు నీవు సకలం కాల్చు అగ్గివి నీవు   పురంధరుడవు నీవు కాలకాలుడవు నీవు 6.వేద ప్రకాశము నీవు వేదవేద్యుడవు నీవు   వేదవేదాంగములునీవు వేద నాదమే నీవు 7.పండితుడవు నీవు పండిత గురువులును నీవు   మంత్ర-జపములు నీవు తత్ఫలితములును నీవు 8. వాగ్రూపములు నీవు వాక్శక్తికి గురువు నీవు    స్వయముగ సాహితి సరస్వతీ బీజము నీవు   నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ 9.వృషవాహనుని స్తవము శంకరుని కారుణ్యం   శివపాదాంబుజ సేవనము కింకరుని పుణ్యం 10...