Wednesday, October 3, 2018

HIMALAYAKRUTA SIVASTOTRAM

 ఓం నమః శివాయ-హిమాలయ కృత శివస్తుతి
 **************************************

 1.సృష్టికర్త బ్రహ్మ నీవు స్థితికర్త హరినీవు
   సర్వసంహార కారకుడవు సదాశివ రూపుడు నీవు

2. ప్రకృతి కారణ-కారకములు రెండును నీవు
   ప్రకృతి రూప-స్వభావముల ఆధారము నీవు

3. ప్రకటిత అనేకరూప ఆలంబనము నీవు
   భక్తులకు ప్రీతికర రూప ప్రత్యక్షము నీవు

4. సృష్తికాధారము నీవు సూర్య తేజము నీవు
   సస్య కారక శశి నీవు శీతలత్వము నీవు

       నమ@ శివాయ నమః శివాయ ఓం నమః శివాయ

 
5..గాలి-నీరు నీవు సకలం కాల్చు అగ్గివి నీవు
  పురంధరుడవు నీవు కాలకాలుడవు నీవు

6.వేద ప్రకాశము నీవు వేదవేద్యుడవు నీవు
  వేదవేదాంగములునీవు వేద నాదమే నీవు

7.పండితుడవు నీవు పండిత గురువులును నీవు
  మంత్ర-జపములు నీవు తత్ఫలితములును నీవు

8. వాగ్రూపములు నీవు వాక్శక్తికి గురువు నీవు
   స్వయముగ సాహితి సరస్వతీ బీజము నీవు

  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ

9.వృషవాహనుని స్తవము శంకరుని కారుణ్యం
  శివపాదాంబుజ సేవనము కింకరుని పుణ్యం

10.మహా పుణ్యప్రద స్తోత్రము త్రికాలపఠనము
   పాప సంహరణము భవసాగర తరణము.

11.సౌశీల్య కళత్రం లభ్యం హిమాచల కృతస్తోత్రం
   వంధ్య పుత్రలాభం తథ్యం ఏకమాసం పఠేత్ఫలం

12.కారాగార విముక్తంచ శత్రుగ్రస్త పీడ హరం
   ప్రసన్నం పంచభూతత్వం పరమానంద సుణ్దరం

   నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ

13.వన మధ్యములో నున్న రణ మధ్యములో నున్న
   శతృ సంహార కరం శంకర కృపా ప్రసాదము.

   ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త పురాణాంతర్గత హిమాలయకృత
 శివ స్తుతి సంపూర్ణం.

  ( ఏక బిల్వం శివార్పణం.)

    ఓం తత్ సత్.

  శివస్వరూపములు నా ప్రయత్నములోని లోపములను సవరించుట శివసేవగా భావించి,సదాసివులుగా నన్ను ఆశీర్వదించెదరు గాక.


   నమః శివాయ-నమః శివాయ -ఓం నమః శివాయ

9.

5.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...