Posts

Showing posts from April 10, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(SURYAAYADITYAVARCHASE-19)

Image
  బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య-వర్చసే । భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః ॥ 19 ॥  ఒకే పరమాత్మ అనేక విధములుగా పాలనను నిర్వహిస్తూ అనేకానేక గౌణనామములో ప్రస్తుతింపబడుతున్నాడు.  బృహతి-బృమ్హణతి విశృతమైనది -చైతన్యవంతమైనది యైన పరబ్రహ్మము తనను తాను సృష్టి-స్థితి-లయ అను మూడు ప్రధాన లక్షణములను చేయుచు బ్రహ్మ-ఈశాన-అచ్యుత నామములతో ప్రకాశిస్రున్నది.దీనినే లక్షంఇ అష్టోత్తరము,  బ్రహ్మ-విష్ణు-శివాత్మికగా ప్రస్తుతించింది.  మండలాకారములో నున్న పరమాత్మయే సూర్యునిగా కూడా కీర్తిస్తున్నాడు.  సురతి-ప్రేరయతి సూర్యః అన్నది ఆర్యోక్తి.  సు-రయతి-జనములను/జగములను కర్మలయందు ప్రేరేపించువాడు సూర్యుడు.  సుష్టు-ఇరయతి సూర్యః అనునది మరొక సమర్థనము.  సకలమును వ్యాపించి-పాలించువాడు సూర్యుడు.  అంతరో యమయతి సూర్యః-అంతర్యామిగా దాగి అన్ని నామరూపములలో చైతన్య ప్రసరణమును చేయువాడు సూర్యుడు.  అంతరాత్మయే సూర్యునిగా భావిస్తారు.భాసిస్తాడని అంటారు.  భావనలో సైతము భాసించబడుటయే వపు-శరీరముగా/రూపముగా/ఉపాధిగా భావనలోను-బాహ్యములోను ప్రకాశించు లక్షణమే వర్చస్సు.   ఒక సూర్యుండు సమస...