GIRISAMCHA-ABHICHAKASE-SIVARATRI
గిరిశంచ-అభిచాకశీ **************** శివుని కరుణ అర్థముకానిది కాని అద్భుతమైనది. గిరిశంచ అను పదమునకు పెద్దలు, కొండయందు-మన గుండెయను కొండయందున్నవాడు, వేదములయందుండి జగములకు మోదమొనరించువానిగను, ఇచ్చిన మాటయందుండి-అభయమిచ్చి-ఆర్తరక్షణమును చేయువానిగను భావిస్తారు. సర్వ వ్యాపకత్వముతో తానున్నానని (నమకములో) చెప్పుటయేకాక, తన ప్రకాశకత్వముతో సర్వ సమర్థవంతముగా చేస్తున్నాడు కనుకనే, ఆ పరమాత్మ, "గిరిశంచ-అభిచాకశీ" *************** నమకములో దర్శనీయమైనది పరమేశ్వరము. చమకములో దర్శకత్వమై మనలను ఉధ్ధరిస్తున్నది. నమకములో దర్శించిన ఒక వెదురు చమకములో ఒక నిచ్చెనగా మారి మనలను ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితికి చేర్చుచున్నది. చమక పారాయణము , 'అజ్ఞా-విష్ణుసజోష" అంటు అగ్ని-విష్ణు నామములుగల రెండు చైతన్యవంతమైన శక్తులను ప్రార్థించుటతో ప్రారంభమవుతుంది.ఇవి ఆ శక్తుల కేవల వ్యవహారిక నామములా/ కావుకదా! అయితే సాధకుడు ఆ మహాద్భుతశక్తులను సూక్ష్మముగా తన శరీరములో-స్థూలముగా విశ్వశరీరములో దర్శిస్తు ఎందుకు ఆరాధిస్తూ ఆహ్వానిస్తున్నాడు అన్న సందేహము మనకు కలుగవచ్చును. ఏ...