GIRISAMCHA-ABHICHAKASE-SIVARATRI


 గిరిశంచ-అభిచాకశీ

****************


శివుని కరుణ అర్థముకానిది కాని అద్భుతమైనది.

గిరిశంచ అను పదమునకు పెద్దలు,

కొండయందు-మన గుండెయను కొండయందున్నవాడు,

వేదములయందుండి జగములకు మోదమొనరించువానిగను,

ఇచ్చిన మాటయందుండి-అభయమిచ్చి-ఆర్తరక్షణమును చేయువానిగను భావిస్తారు.

సర్వ వ్యాపకత్వముతో తానున్నానని (నమకములో) చెప్పుటయేకాక,


తన ప్రకాశకత్వముతో సర్వ సమర్థవంతముగా చేస్తున్నాడు కనుకనే,

 ఆ పరమాత్మ,

 "గిరిశంచ-అభిచాకశీ"

***************

 నమకములో దర్శనీయమైనది పరమేశ్వరము.

             చమకములో దర్శకత్వమై మనలను ఉధ్ధరిస్తున్నది.

   నమకములో దర్శించిన ఒక వెదురు చమకములో ఒక నిచ్చెనగా మారి మనలను ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితికి చేర్చుచున్నది.


చమక పారాయణము ,

'అజ్ఞా-విష్ణుసజోష" అంటు అగ్ని-విష్ణు నామములుగల రెండు చైతన్యవంతమైన శక్తులను ప్రార్థించుటతో ప్రారంభమవుతుంది.ఇవి ఆ శక్తుల కేవల వ్యవహారిక నామములా/ కావుకదా! అయితే సాధకుడు ఆ మహాద్భుతశక్తులను సూక్ష్మముగా తన శరీరములో-స్థూలముగా విశ్వశరీరములో దర్శిస్తు ఎందుకు ఆరాధిస్తూ ఆహ్వానిస్తున్నాడు అన్న సందేహము మనకు కలుగవచ్చును.


ఏమా అగ్ని? 

ఎవరా విష్ణువు? ,

అన్న సందేహమునకు పెద్దలు ఏమి చెబుతున్నారంటే,

మనలో నిద్రాణమై యున్న కుండలిని శక్తిని జాగృతపరచుశక్తియే ఆ అగ్ని..

జాగృతమైన కుండలిని శక్తి ముడులు విప్పుకుంటూ సహస్రారమును చేరి,అమృతకలశము నుండి సుధాసారమును వర్షింపచేయ శక్తియే ఆ విష్ణు..

కుండలిని జాగృతపరచు శక్తిని అగ్నిగా,దానిని వ్యాపింపచేయుశక్తిని విష్ణువుగా సార్థక నామధేయములతో ఆ పరమాత్మ సమర్థవంతములు చేయుచున్నాడు.


వాజశ్చమే-

.........


స్వామి నాకు పోషకత్వముకల ఆహారము/అన్నము కావాలి.దానిని భుజించుటకు తగిన ఆసక్తి/అర్హతయైన ఆకలిని నేను కలిగియుండాలి.దానిని జీర్ణముచేసుకునే( శక్తిని) నా శరీరము యజ్ఞనిర్వహణము కలదిగా యుండాలి.నా ఇంద్రియ యజ్ఞము నిరంతర నియమబధ్ధమై "యజ్ఞేన కల్పంతాం" గా ఉండాలి.అందులకు,


శంచమే-మయశ్చమే.

********************

ఇహలోక సౌఖ్యమును-పరలోక సౌభాగ్యమును అందింపచేయగల,

యంతాశ్చమే-ఆచార్యుడు కావలెను.


అంతే కాదు అభ్యాస సమయమున నా మనసు,

జ్యేష్ఠంచమ-ఆధిపత్యంచమే,

ప్రతికూలతలను ఎదురుకొనగలిగే స్థితిలో నుండాలి.


  నా యజ్ఞ నిర్వహణ సమయమునందు నీవు,కార్య-కారణ సంబంధములకు సోదాహరణములుగా,


అగ్నిశ్చమ ఇంద్రశ్చమే-సోమశ్చమ ఇంద్రశ్చమే, అంటు,

మహేశ్వరత్వమును-మహేంద్రత్వముగా మలుస్తూ,కార్య-కారణ సంబంధమును విశ్లేషిస్తూ,జంటగా వచ్చి నా యాగ హవిస్సులను స్వీకరించు.వర్షములను కురిపించు.

అశ్వమేథశ్చమే

..............

 యజ్ఞఫలితముగా అశ్వ శరీరముునుండి తలను వేరుచేసినట్లుగా,విషయవాసనలను శరీరమును-మేథస్సు అను తలనుండి వేరుచేసి(నరికివేయమనికాదు-తొలగించి)

శివశక్త్యాత్మక భగవతత్త్వమును దర్శింపచేయుము.

 మానవత్వముతో ప్రారంభించిన దీక్షను మాననీయ

అవబృథస్నానముతో ముగింపచేసి,సాధకుని లక్ష్యము సకల మంగళములనొనరించుము..సన్మార్గమును చూపించుము.

.

సర్వే జనా సుఖినో భవంతు.స్వస్తి.


ఏక బిల్వం శివార్పణం. 


Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI