Posts

Showing posts from February 3, 2026

ADITYAHRDAYAMU-16

Image
        ఆదిత్యహృదయం-16   "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం    కిరణసమిత పాపం క్లేశ దుఃఖస్య నాశం    అరుణకిరణగమ్యం ఆదిం  ఆదిత్యరూపం    సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."  పూర్వరంగము *********** ఏదీ అంటని ఆత్మస్వరూపమైన పరమాత్మ ఆదిత్యునిగా ఆకాశ నివాసియై,మండలము నుండి తన రశ్ములను భూమందలముపై ప్రసరింపచేయుటకు నక్షత్రములను-తారలను-గ్రహములను కొన్ని పరికరములను ఏర్పరచి,తాను అంతర్యామియై వానిలో ప్రవేశించి,పన్నెందు విభాగములుగా కాలమును,పది ఇంద్రియములు బుద్ధి-మనసు అను విభాగములను చేతనులలో ఏర్పాటుచేసిన విధానమును వివరించిన,అగస్త్య భగవానుడు "కవి" గా స్వామి ప్రపంచ కల్పనాచాతుర్యమును కన్నులముందుంచిన తరువాత, ప్రస్తుత శ్లోకములో స్వామి ఉదయాస్తమాన ప్రక్రియను ప్రశంసిస్తున్నారు. శ్లోకము. ***** " నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః." తూరుపు దిక్కును తన రశ్ములచే ప్రకటింపచేసినసూర్యునకు నమస్కారములు. ( పశ్చిమ దిక్కును చేరి మరొక ప్రదేశములో తన రశ్ములచే ఉదయిస్తూ తూరుపుదిక్కుగా ప్రకాశిస్తున్న) పశ్చిమ అద్రిపై వాలుచున్న సూర్యునకు నమస...