ADITYAHRDAYAM-INTRODUCTION

ఆదిత్యహృదయ స్తోత్ర పరిచయము ************************ " జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం హిరణసమిత పాపద్వేష దుఃఖస్య నాశం అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." వేదము-వేదమునుండి ఇతిహాసము-ఇతిహాసములోని స్తోత్రము కథనము ద్వారా సామాన్యులకు సులభసాధ్యముగా,సౌరవిజ్ఞామునంతా రంగరించి,శబ్దగుళికగా మలచి,మనకు అనుగ్రహించిన స్తోత్రరాజము "ఆదిత్యహృదయము" బ్రహ్మర్షి పరబ్రహ్మ నారదునకు స్పూర్తినీయగా,దేవర్షి నారదుడు వాల్మికి కి తారకమంత్రమును(రామ) ఉపదేశించగా,మహర్షి వాల్మికి ఆదికావ్యమైన రామాయనములో నిక్షిప్తపరచి స్తోత్రముగా అందించగా,రాజర్షి అగస్త్యుడు రామచంద్రునికి రణభూమిలో ఉపదేశించగా దానిని భక్తిశ్రద్ధలతో జపించి Fఅలసిద్ధిని పొందిన రాముని ఉదహరిస్తూ,సకల చరాచరములచే/చేతనులచే, " నమస్తే బ్రహ్మ రూపాయ నమస్తే విష్ణురూపిణే నమస్తే రుద్రరూపాయ భాస్కరాయ నమోనమః" అని కీర్తించే అవకాశంచేతనులకు లభించినది. స్తోత్రమును (సహేతుకముగా-సంప్రదాయముగా/తక్కువ వ్యవధిలో/అభ్యాగతియై/రావలిసిన సమ...