Thursday, February 8, 2024

ADITYAHRDAYAM-INTRODUCTION


     ఆదిత్యహృదయ స్తోత్ర పరిచయము

    ************************

 " జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం

   హిరణసమిత పాపద్వేష దుఃఖస్య  నాశం

   అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం

   సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."


    వేదము-వేదమునుండి ఇతిహాసము-ఇతిహాసములోని స్తోత్రము కథనము ద్వారా సామాన్యులకు సులభసాధ్యముగా,సౌరవిజ్ఞామునంతా రంగరించి,శబ్దగుళికగా మలచి,మనకు అనుగ్రహించిన స్తోత్రరాజము "ఆదిత్యహృదయము"

 బ్రహ్మర్షి పరబ్రహ్మ నారదునకు స్పూర్తినీయగా,దేవర్షి నారదుడు వాల్మికి కి తారకమంత్రమును(రామ) ఉపదేశించగా,మహర్షి వాల్మికి ఆదికావ్యమైన రామాయనములో నిక్షిప్తపరచి స్తోత్రముగా అందించగా,రాజర్షి అగస్త్యుడు రామచంద్రునికి రణభూమిలో ఉపదేశించగా దానిని భక్తిశ్రద్ధలతో జపించి Fఅలసిద్ధిని పొందిన రాముని ఉదహరిస్తూ,సకల చరాచరములచే/చేతనులచే,

" నమస్తే బ్రహ్మ రూపాయ

  నమస్తే విష్ణురూపిణే

  నమస్తే రుద్రరూపాయ

  భాస్కరాయ నమోనమః" అని కీర్తించే అవకాశంచేతనులకు లభించినది.


 స్తోత్రమును (సహేతుకముగా-సంప్రదాయముగా/తక్కువ వ్యవధిలో/అభ్యాగతియై/రావలిసిన సమయమునకు వచ్చి)ఉపదేశించినది అగస్త్య భగవానుడు.

 కనుక ఆయనకర్త-గురువు.

 1.అగస్త్యుడు సూర్యపుత్రుడు.

 2.సూర్యవంశ రాజుల పదాతిదళ సంరక్షకుడు.

 3.రాముని వనవాస సమయమున పంచవటి ఆశ్రమమును సూచించినవాడు.

 4.ధర్మరక్షణమునకై వాతాపిని చంపినవాడు,వింధ్యను శాసించినవాడు.సముద్రజలమును బంధించి కావేరినదిగా మలచినవాడు.


   రామచంద్రుడు కర్మ.యుద్ధఫలితమును అనుభవించువాడు.

   జయవిజయులకు సనకసనందాదులు ఇచ్చిన శాపమును గౌరవించువాడు.నందీశ్వరుని శాపమును సైతము గౌరవించువాడు.

   రావణుని ఆగడములు భరించలేని దేవతలు జహి రావణ సంహరే అన్న,నరం బ్రూత్వా,రామా నరునిగా రావణుని సంహరింపుము అన్న వారి అభ్యర్థనమును మన్నించు భావనలో నున్నవాడు.

   అంతేకాదు,బాలునిగా విశ్వామిత్ర మహర్షితో   

 యాగ సంరక్షణమునకై వెళ్ళినప్పుడు,

 'కౌసల్య సుప్రజా రామ-పూర్వాసంధ్యా ప్రవర్తతే,

 తూరుపు దిక్కు ప్రకటింపబడుతున్నది,దైవమాహ్నికములు నేరవరెచు కర్తవ్యము పాటించువాడు కనుక

  ఉపదేశమును పొందుటకు అర్హుడని సనాతనము నమ్ముతుంది.

  పిండాడములోని చైతన్యము-బ్రహ్మాండములోని చైతన్యమును స్థూల-సూక్ష్మములుగా గ్రహింపచేయునదే ఉపాసన.దానిని నిర్దేశించునదే ఉపదేశము.

 స్థూల సౌరవిజ్ఞానమును తెలియచేయు సూక్ష్మ శబ్దగుళికయే "ఆదిత్యహృదయము"

 రామచంద్రుడు సూర్యవంశజుడు.

 రామచంద్రుడు అయోధ్యానరపతి.

 రామచంద్రుడు మూర్తీభవించిన ధర్మము.

 "రామో విగ్రహవాన్ ధర్మః".

     కాని,

 రావణాసురుడు ఇంద్రియలోలుడు

 రావణాసురుడు శాపగ్రస్తుడు

 రావణాసురుడు ధర్మాధర్మవిచక్షణ లేనివాడు.

  కనుకనే

 ఈ యుద్ధమునకు పేరులేదు.తతో యుద్ధము.

 గగనమునకు గగనమే పోలిక.

 సాగరమునకు సాగరమే పోలిక

  రామ-రావణ యుద్ధము కథనము

  ధర్మ-అధర్మముల యుద్ధము మథనము

      అంతర్మథనము 

 జీవిని-దేవినికి నిత్యముజరుగు సమరము.

 చింతాశోక సమన్వితము.కనుక 

 "చింతాశోక ప్రశమనము" యొక్క ఆవిర్భావము.

   త్వం మాత-త్వం దాత-త్వం ధాత -త్వం ఆచార్య అని సాంబునిచే సంకీర్తింపబడిన పరమాత్మ పలికించినంతమేరకు మీతో పంచుకునే ప్రయత్నము చేస్తాను.

 నా అహంకారము చేసే తప్పులను భాస్కరుడు మన్నించి,మనలనందరిని ఆశీర్వదించును గాక.


 " తం సూర్యంప్రణమామ్యహం."


 

   



   

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...