తిరువెంబావాయ్-30
*************
బువనయిర్ పోయ్ ప్పెర వామైయిన్ నాళాం
పోక్కుకిన్రోం అవమే ఇంద బూమి బూమి
శివన్ ఉయ్యర్ కొల్కిన్ర వారెన్రు నోక్కిత్
తిరుపెరుం తురైయురై వాయ్ తిరుమాలాం
అవన్ విరుప్ పెయిదవుం మలర్వన ఆశై
పాడవుం ఇన్ అలర్దామయె కరుణయు నీయుం
అవనియర్ పుగుందెమ్మై అత్కోళ్ళ వల్లాయ్
ఆరమదే పళ్ళి ఎరుందరుళాయ్
పరంజ్యోతియే పోట్రి
*********************
మహాదేవుని సాన్నిధ్యమును పొందుటకు మానవజన్మను మించిన మార్గములేదని తెలుసుకున్నాము.దీనిని వ్యర్థముచవ్యకుండా పరమార్థమునకు పాదదాసులమగుదాము.బ్రహ్మ-విష్ణులకు సైతము లభించలేని భాగ్యమును మనకందించుటకై స్వామి పెరుంతురైకు విచ్చేసి కరుణామృత వర్షముతో మనలను అనుగ్రహించుచున్నాడు.చరణసేవాసక్తులమై తరించుదాము రండి.
అంబే శివే తిరు వడిగలే శరణం.