Friday, December 1, 2023

KADAA TVAAM PASYAEYAM-19




 


   కదా   త్వాంపశ్యేయం-19

   ********************

 "జిహ్వ చిత్త శిరోంఘ్రి నయనశ్రోతైః అహం  ప్రార్థితం

  నమామి భగవత్పాదం  శంకరం  లోక శంకరం"

  

 "  ఏకో వారిజబాంధవో క్షితి-నభోవ్యాప్తం తమోమండలం

   భిత్వా లోచక గోచరోపి భవతి త్వం కోటిసూర్య ప్రభోః

   వేద్యః కిం న భవస్యహో ఘవతరం కీ దృక్ భవేత్నత్నమః 

  తత్ సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ."



  మహాదేవ నీవు మా ప్రభువువు,నీ అనంతకోటి సూర్యకాంతులతో సమస్త చీకటులను తరిమివేయుచున్నావు.నా అంతరంగమును నందలి చీకటిని/అజ్ఞానమును పారద్రోలి నన్ను అనుగ్రహింపుము అని మనసారా ప్రార్థిస్తూ,  ఈనాటి  బిల్వార్చనమును ప్రారంభించుకుందాము.

 "హర హర మహాదేవ శంభో"

 " జయ జయ శంకర-హరహర శంకర

   జయజయ శంకర-హరహర శంకర

   జయజయ శంకర-హరహర శంకర

   హరహర శంకర-జయజయ శంకర"

  నాదం తనుమనిశం శంకరం_ఎటుచూసినా ఈశ్వరనామస్మరణమే,

  

  ఆ కోలాహలములో కోర్కెలు కోరుకునేవారు,తీరినకోరికలు కలవారు,నిత్యానుష్ఠానపరులు,నిమిత్తానుష్ఠానుపరులు,లావాదేవీలు తేల్చుకునే వారు,స్వామిని సాక్షాత్కరింపచేసికొనిన వారు, స్పర్శించే వారు-దర్శించేవారు,స్తుతించేవారు,భజించేవారు,అర్థనిమీలిత నేత్రాలలో ఆనంద్సాశ్రువులతో అభిషేకించేవారు,వీడిన మోహపు బూదిని అలదేవారు,అబ్బిన జ్ఞాన చందనమును సమర్పించేవారు,ఆసనమనే వారు,అర్ఘ్యమనేవారు,పాద్యమనే వారు,ఏమని వర్ణించగలనని వాక్కు సైతము మౌనమైన వేళ,

  శంకరయ్యను ఎవరు చేర్చారో,ఎప్పుడు చ్జేర్చారో,ఎలా చేర్చారో తెలియదు కాని ఒక స్తోత్ర కాలక్షేప ప్రదేశములో నిలబడ్దాడు.

 అక్కడ ఒక తేజోమూర్తి చుట్టు ఎందరినో కూర్చోబెట్టుకుని, ,

 నాయన లార! ఈనాటి మన వాక్పుష్పములు "ప్రార్థనా భక్తి" గా పరమేశ్వరుని ఆనను/అనుగ్రహమును వివరిస్తామంటున్నాయి,అంటూ,

 శంకరయ్య ను చూస్తూ,తమరు నూతన వ్యక్తిలాగా కనిపిస్తున్నారు.

 మాది సనాతన ప్రసంగము.అభ్యంతరము లేకపోతే ఆస్వాదించవచ్చును అని ఆహ్వానించాడు.

  మనసు మెత్తపడుతోండి.మాయ చెదిరి పోతోంది.మౌనముగా కూర్చున్నాడు శంకరయ్య.

 " మనస్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్రఫణితౌ

  కరశ్చ్చాభ్యర్చాయాంశ్రుతిరపికథాకర్ణవిధౌ

  తవ ధ్యానేబుద్ధిః నయన యుగళమూర్తి విభవే 

  పరన్ గ్రంధాన్ కైర్వా పరమశివ జానే పరమత:."
 'కైర్వాన్ జానే పరమతః-పరమశివ ,
   నన్ను పరీక్షించకు స్వామి,అంటూ,వినయముగా నమస్కరిస్తూ,ప్రసంగమును ప్రారంభించారు .



 " నమస్కార కథాశ్యేశ్చ సిద్ధాంతోక్తి పరాక్రమః

   విభూతిః ప్రార్థనాచేతి షడ్విధం స్తోత్ర లక్షణం."



   పరమాత్మను నమస్కార విధానముచేగాని,కథాశ్రవణ-వచన విధానముచే కాని,సిద్ధాంతీకరణ  విధానముచే కాని,పరాక్రమవైభవ ప్రశంసావిధానముగా కాని,మహిమలను గుర్తించి కృతజ్ఞతా పూర్వకముగా కాని,ప్రార్థనా విధానముగా కాని స్తుతించి,సాయుజ్యమును పొందవచ్చునని  ఆర్యోక్తి.

 శంకరయ్య మస్తిష్కము లో ఆలోచనలు, ఆ  ఆరు విభాగములలో  ఎన్నివిధములు నేను గమనించగలిగాను అనుకుంటుంటే 
,అయ్యో పాపం ఇదీసంగతి.

  శంకరయ్య మనసు ఏకాగ్రతకై ఇంకా ప్రయత్నముచేస్తూనే ఉంది .మేమేమి తక్కువ వారలము కామంటూ, (కైర్వాన్)  
 ఇంద్రియములు సైతము ఆ ప్రయత్నమును అడ్డుకుంటున్నాయి . చెవి ఒకసారి తక్కిన ఇంద్రియములను  చూస్తూ,నేను శంకరయ్య దృష్టిని మరలుస్తాను.మీరు సైతము సహకరించంది అంటూ అటువైపుగా మాట్లాడుకుంటూ వెళుతున్న వారి మాటలవైపునకు శంకరయ్యను ఆకర్షింపచేసినది.

 మొదటి వ్యక్తి రెందవ వ్యక్తితో,

 ఇదిగో ఈ ప్రసంగములు చేసే గురువు సైతము పూర్వాశ్రమములో మహా అహంకారి అట.

 వాళ్ళ గురువుగారు "రేపు పుష్పార్చనకు అందరు సిద్ధంగా రండి"అన్నారట.

 అంతే అందరిలో తానే గురువుగారి మెప్పును పొందాలని,

 రెట్టించిన ఉత్సాహముతో  ఎత్తైన చెట్లనెక్కి,గుట్టలనెక్కి ,అడవులలోకెళ్ళి,ఇంకా చెబుతా వినండి నేను ఈతకొట్ట గలను అనుకుంటూ,,చెరువులలోకి దూకి అనేకానేక పుష్పములను తీసుకువచ్చి,గురువుగారి ముందు ఉంచి,

"గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే"

 అంటూ శ్లోకము ప్రారంభించారట.

 అప్పుడు గురువుగారు నవ్వుతూ,

 " భ్రమతి కుసుమార్థం జడమతి" అన్నారట.

 అంతే..దెబ్బకు.. ఏదోచెప్పబోయే లోపల ఆ రెండవ వ్యక్తి,

 అదా విషయం.పోనీలెండి.ఇప్పుడు ఆ పరిస్థితి లేదుగా.పరివర్తనకలిగినదిగా.తాను అనుభవము ద్వారా తెలుసుకున్న సత్యమును పదిమందికిచెప్పి ,ప్రాయశ్చిత్తము చేసుకుంటున్నాడుగా అని శాంతముగా మందలించి,వెళ్ళిపోయాడు.
  ఒకరి వాగింద్రియమును మరొకరి వాగింద్రియము సవరించుచున్నది.పరమాద్భుతము.


 శంకరయ్యను మారుద్దామనుకున్న చెవి శంకరయ్య అజ్ఞానపు తాళ మును తీసే తాళపుచెవిగా మారినది.
     అంతే,

 ఆ పువ్వులు ఏమిటి? అవిచేసే అర్చన ఏమిటి?

  కుతూహల లహరులు కుమ్మక్కవుతుంటే,కింకర్తవ్యం అంటూ ఉండిపోయాడు శంకరయ్య.

 కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ.

    'తన్మై మనః శివ సంకల్పమస్తు

     వాచే మమశివపంచాక్షరస్తు

     మనసే మమ శివభావాత్మ మస్తు".

     పాహిమాం పరమేశ్వరా.

    (ఏక బిల్వం  శివార్పణం)









TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...