*************************
" గో" శబ్దమునకు పవిత్రము-ధర్మము అను అర్థములను పెద్దలు చెబుతారు.ధర్మమును రక్షించు పరమేశ్వరుని గోపాలునిగా,ధర్మ సంరక్షకునిగా భావిస్తే ,శివుడు-శివుని కొలిచే భక్తులు గోపబాలురే కదా.శివోహం.
కార్తిక సోమవార శుభకామనలతో నేటి కథను ప్రారంభిద్దాము పరమేశ్వరానుగ్రముతో.
భగవంతుడు-భక్తులు ఇద్దరు గోపబాలురే
" నమః శంగాయచ-పశుపతయే నమో నమః"
"శం" అనగా సృష్టించి,సృష్టించిన దానియందు జీవులకు తాదాత్మ్యమును కలిగించి,అన్యము ఏదియును లేదనిపించి,ఆత్మార్పణను చేయించే శక్తి.ఆ శక్తియే " ఈశ్వర చైతన్యము." నమోవాకములు.
సస్వరూపమును తెలిసికొనలేని జీవులు పశువులు.వారిని పాలించే ఏకైక నాయకుడు పశుపతి.ఓం పశూనాం పతయే నమః."
పశుపాలకులు ఈశ్వరతత్త్వమును గ్రహించిన ధన్యులు.కనుకనే వారు పశువుల కొట్టములో పశుపతిని దర్శించగలిగారు." ఓం నమో గోష్ఠాయచ."వారికా దివ్యత్వము లభించుటకుకారణము రుద్రుడే సుమా.ఇది చదివితే కాదనగలరా?
సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం.
" ఉతైనం గోపా అదృశ నదృశ నుదాహార్యః" తన కిరణముల స్పర్శతో సూర్యభగవానుడై ఉదయిస్తూ స్వామి ఉద్ధరిస్తున్నాడు. ఎవరిని ఉద్దరిస్తున్నాడు?ఏ మాత్రము ఎరుకలేక గోవులను తోలుకువెళ్తున్న గోపాలురను,నీటిని మోసుకెళ్తున్న వారి స్త్రీలను.అత్యద్భుతము భూతనాథుని దయాస్వభావము.కనుకనే వారు సవినయులై,
" ఏషాం పురుషాణాం-ఏషాం పశూనాం మా భేః" రుద్రుని ప్రార్థించుచున్నారు.
సూర్య స్వరూపముగా సాక్షాత్కరించుచున్న రుద్రా ! మా పురుషులను-పశువులను బాధించకుము.నమస్కారములు.
భగవంతుని అనుగ్రహమును పొందిన భక్తులెంత ధన్యులో.వారి స్మరణము సకలార్థ సాధనము.శివోహం.
" అకాయో భక్త కాయస్య" ఏ రూపములేని స్వామి అపురూపమైన తనభక్తులలో ప్రకాశిస్తుంటాడు.ఎల్లమంద ప్రాంతలోని " సాలంకయ్య" అను పశువుల కాపరి శివభక్తులసేవయే శివునిసేవగా భావించి,అర్చించెడివాడు.
మాయతో భక్తులతో ఆడుకుంటాడు..మమతతో ఆదుకుంటాడు ఆ మారేడుదళముల వాడు.సాలంకయ్య దగ్గరకు వచ్చి,ఆతిథ్యమును స్వీకరించిన తరువాత ఆట ప్రారంభించాడు .
తన మాటలతో.తాను కొన్నిరోజులు సాలంకయ్య దగ్గర ఉండి పూజాపునస్కారములు చేసుకొందామనుకుంటున్నానని పావులు కదపసాగాడు ఆ పాములు దాల్చినవాడు.పరమ సంతోషముతో అంగీకరించాడు సాలంకయ్య.రోజులు అతిథిసేవలో ఆనందంగా గడుస్తున్నాయి.ఘాటుభక్తికి కి పరీక్షపెట్టాలని అనుకున్నదే తడవుగా మాటున దాగాడు చోటుతెలియనీయకుండ.పనిమీద బయటకు వెళ్ళి తిరిగి వచ్చిన సాలంకయ్య అతిథి కనిపించనందున వెతికివెతికి వేసారి పోయాడు.తల్లడిల్లుతున్నాడు.దర్శనమునకై తపించిపోతున్నాడు
" నమో భవాయచ-రుద్రాయచ"
ప్రాణులందరికి కారణమైన భవునకు నమస్కారము.వారి రోదనమునకు హేతువైన దుఃఖమును పోగొట్టు రుద్రునకు నమస్కారము.
.తరుణ మాసన్నమయినదేమో కరుణగలవాడు కొండగుహకు రప్పించుకొని,తనలో ఐక్యము చేసుకొన్నాడు.ద్వైతము అద్వైతమైనది.అత్యద్భుత లింగ పరిణామమును దాల్చి,పరిపరి విధముల కొలువబడుతోంది." ఓం నమో గిరిశాయచ-శిపివిష్టాయచ."
భక్తుల రక్షణార్థమై కైలాస పర్వతమున ఉమామహేశ్వర రూపమున స్థిరముగనున్న శివునికి నమస్కారము.లోక రక్షణకై విష్ణుస్వరూపుడైన రుద్రునకు నమస్కారములు.
మళ్ళీ ఆటను ప్రాంభించాడు.ప్రత్యర్థి పశువులకాపరియే.ఆనందవల్లి
నందిపాడు గ్రామవాసి.నందివాహనుని మనోనివాసి.గోవులను మేపుతు,నిత్యము గోక్షీరముతో స్వామిని అభిషేకించి అర్చించేది.యుక్తవయసు రాగానే పరమయోగ్యుడైన సుందరయ్యతో వివాహము జరిగినది.
" నమస్తామ్రాయచారుణాయచ" అని స్వామిని కీర్తిస్తు ,తమ

గోసంరక్షణను చేసుకొనుచు,గోక్షీరముతో స్వామిని అభిషేకములతో,,అర్చనలతో ఆరాధించెడివారు.శివానుగ్రహము వలన ఆనందవల్లి గర్భవతి అయినది
" నమో మధ్యమాయచాపగల్భాయచ."
మధ్యములైన వారికి.ఇంద్రియజ్ఞానములేని తల్లి గర్భములో నున్న శిశువు రూపములో నున్నశివునికి నమస్కారములు.
.క్రమము వీడక ప్రతిరోజు కడవనిండా గోక్షీరముతో కొండనెక్కి స్వామికి పాలాభిషేకమును చేసి పొంగిపోవుచుండెది.ఒకరోజు కొండనెక్కి అలసి,కొంచము విశ్రాంతికై కూర్చున్న సమయమున,ఒక కాకి అమె పాలకుండను పడవైచినదని,అందులకు కోపించి ఆమె కాకులకు ఆ ప్రదేశములో ప్రవేశము లేకుండునట్లు చేసెనట.సద్భక్తుల వాక్కు-సత్యవాక్కు కదా!

".సత్య-శివం-సుందరం "అయిన స్వామి సాధ్విని కరుణించాలనుకున్నాడు.సాంబశివుడు.వాత్సల్యలక్ష్మీ విలాసము కలవాడు కద కందర్పహరుడు."
నమో అక్ఖిదతేచ-ప్రక్ఖిదతేచ."కొంచముగా శ్రమపెట్టువాడు-బాగుగా శ్రమపెట్టువాడు రెండు వాడే.
నమో అక్ఖిదతేచ-ప్రక్ఖిదతేచ."కొంచముగా శ్రమపెట్టువాడు-బాగుగా శ్రమపెట్టువాడు రెండు వాడే.
ఆనందవల్లి స్వామి అభిషేకమునకై కొండెక్కి రాలేక పోతున్నానని,దయతో స్వామినే కొండదిగివచ్చి,నిత్య అభిషేకములు-అర్చనలు స్వీకరించమని కోరినది.కాదనగలడా కపర్ది
.అందులో ధావతే-పరుగెత్తువాడు-ఎవరివెనుక-సత్వానాం-సాత్వికులైన భక్తుల వెనుక పరుగెత్తేవాడు.ఆనందంగా అంగీకరించాడు.ఆయనకు కావలిసినది కూడా అదే.అందుకే ఈ దోబూచులాటలు.ఒక షరతు పెట్టాడు ఆనందవల్లికి.తాను కొండ దిగి క్రిందకు వస్తున్నప్పుడు ఆనందవల్లి వెనుకకు తిరిగి చూడరాదని.ఆనందంతో అంగీకరించి క్రిందకు నడకను ప్రారంభించింది.పులస్తుడు ముందు తానుండి భక్తుల నడిపించు రుద్రుడు ఆనందవల్లి వెంట గోవు వెంట సాగు దూడ వలె కదులుచున్నాడు.కథసాగితే కావలిసిన పని ఎలా జరుగుతుంది.అందులోను తాను ఆనందవల్లికి మాట ఇచ్చినవాడు.హరోం హర శంకరా! హరహర మహాదేవ.వేదఘోష వేనోళ్ళ సాగుతోంది.హరి వెంట సిరి,సిరివెంట---- వాడిని స్తుతిస్తూ,
"గణేభ్యో గణపతిభ్యశ్చవో నమః అంటు ప్రమథ గణంబులు
," వ్రాతేభ్యో వ్రాత పతిభ్యశ్చవో నమః అంటు అనేక సమూహములు
,భవాయచ రుద్రాయచ అని స్తుతిస్తూ ఋషిగణములు స్వామిని అనుసరించాయి.ఒకటే కోలాహలము.
ఆనందవల్లి ఏకాగ్రతకు ఏదో ఆటంకం.
నీలకంఠునికి కావలిసినది అదే కదా . భక్త పరాధీనుడు.ఆనందవల్లి స్వాధీనము తప్పిన మనసు, ఆన తప్పునట్లు చేసి.ఆదిదేవుని అక్కడే ఆపేసినది.అదియే కదా శివ చమత్కారము.
".నమో విశ్వేభ్యో విశ్వపతిభ్యః "
విరూపాక్ష పాహిమాం-పాహిమా-విశ్వపాలకా రక్షమాం-రక్షమాం.ఆ విధముగా ఆనందవల్లి స్వామి కొండ మధ్యలో వెలియుటకు కారణమైనది.ఆ స్వామిని అర్చించి తరించినదిఆనందవల్లి.అజరామరమైనది.అదియే నేటికిని.కోటానుకోట్ల భక్తులతో కళకళలాడు కోటప్పకొండ.త్రికూటాద్రి.సర్వం శివసంకల్పమస్తు.శుభం భూయాత్.
స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.
( ఏక బిల్వం శివార్పణం)

( ఏక బిల్వం శివార్పణం.)