OM NAMA SIVAAYA-90

ఓం నమః శివాయ-40 ******************** ఎప్పుడేమి అనిపిస్తే అప్పుడది చేస్తావు తప్పొప్పులు గమనించక పప్పులో కాలేస్తావు అంబ రెందు కన్నులను ఆటగా మూసావు అంధకారములోనుండి అంధకాసురుడుదయించాడు మూడో కంటి అగ్గిని జలధిలో దాచావు ఆ జలధిలో నుండి జలంధరడుదయించాదు కపాలమును గిల్లుటుకై గట్టిగ హుంకరించావు అతిభయంకరముగ కాలభైరవుడుదయించాడు. కుడి-ఎడమని చూడకుండ జటను విసిరికొట్టావు భద్రతనే మరిచిన వీరభద్రుడుదయించాడు హద్దు అదుపులేనివారి పనులను వద్దనవు నీవని ఒక్కటే నిష్ఠూరములుర ఓ తిక్కశంకరా. శివుడు తనకు ఏ పనిచేయాలనిపిస్తే దానిని ఆలోచించకుండా చేసే తొందరపాటు స్వభావము కలవాడు.కనుకనే అంధకాసురుడు-జలంధరుడు-కాలభైరవుడు-వీరభద్రుడు జన్మించారు.వారు యుక్తాయుక్తములను మరచి హింసాప్రవృత్తితో ముజ్జగములను గడగడలాడించారు.తిరిగి శాంతిని నెలకొల్పుటకు అంధకుని-జలంధరుని అంతమొందించవలసినది.మిక్కిలి కష్టముతో వీరభద్రుని-కాల భైరవుని శాంతింపచేసినారు.ఇదంతా శివుని నిర్వాకమే-నింద. జ...