Posts

Showing posts from December 24, 2025

TIRUVEMBAVAY-10

Image
     తిరు వెంబావాయ్-10    ***********  కృపాసముద్రం సుముఖం త్రినేత్రం  జటాధరం పార్వతీ వామభాగం  సదాశివం రుద్రం అనంతరూపం  చిదంబరేశం హృది భావయామి.  సందర్భము  *********  స్వామి అనుగ్రహముతో భాగవత సేవా ప్రాశస్త్యమును గ్రహించిన భాగ్యశీలురైన కన్నియలు ప్రస్తుత పాశురములో,  శివ లక్షణములను/శివ రహస్యమును తిరు మాణిక్య వాచగరు దర్శనమును మనకు అందించుచున్నారు.  పాశురము  ********  పాతాళం ఏళినుం కీళ్ శొర్కళియో పాదమలర్  పోదార్ పునై ముడియుం ఎల్లా పొరుళ్ ముడినే  పోదై ఒరుప్పాల్ తిరుమేనిఒండ్రొల్లన్  వేదముదల్ విణ్ణోరుం మణ్ణుం తుదిత్తాళు  ఓద ఉళవ ఒరు తోళన్ తొండరుళన్  కోదిల్ కుళత్తరన్ కుళత్తు అరన్ తాంకోయిల్ పిళ్ళైగళ్  ఏదవన్ ఊర్? ఏదవన్ పేర్? ఆర్ ఉట్రార్"ఆర్ అయరార్?  ఏదవనై పాడుం? పరిశేలోరెంబావాయ్.       " సకలములో శివుడు-శివుడే సకలము" ఈ రెండు వాక్యములలో ఏది నిజము?ఏది అబద్ధము?   ఆ చిత్స్వరూపమును సూక్ష్మము అందునా అనలేను.ఎందుకంటే కింది ఏదులోకముల కొసలను వెతికినా పాదపద్మములు కానరావు.ఊర్...