TIRUVEMBAVAY-10
తిరు వెంబావాయ్-10
***********
కృపాసముద్రం సుముఖం త్రినేత్రం
జటాధరం పార్వతీ వామభాగం
సదాశివం రుద్రం అనంతరూపం
చిదంబరేశం హృది భావయామి.
సందర్భము
*********
స్వామి అనుగ్రహముతో భాగవత సేవా ప్రాశస్త్యమును గ్రహించిన భాగ్యశీలురైన కన్నియలు ప్రస్తుత పాశురములో,
శివ లక్షణములను/శివ రహస్యమును తిరు మాణిక్య వాచగరు
దర్శనమును మనకు అందించుచున్నారు.
పాశురము
********
పాతాళం ఏళినుం కీళ్ శొర్కళియో పాదమలర్
పోదార్ పునై ముడియుం ఎల్లా పొరుళ్ ముడినే
పోదై ఒరుప్పాల్ తిరుమేనిఒండ్రొల్లన్
వేదముదల్ విణ్ణోరుం మణ్ణుం తుదిత్తాళు
ఓద ఉళవ ఒరు తోళన్ తొండరుళన్
కోదిల్ కుళత్తరన్ కుళత్తు అరన్ తాంకోయిల్ పిళ్ళైగళ్
ఏదవన్ ఊర్? ఏదవన్ పేర్? ఆర్ ఉట్రార్"ఆర్ అయరార్?
ఏదవనై పాడుం? పరిశేలోరెంబావాయ్.
" సకలములో శివుడు-శివుడే సకలము" ఈ రెండు వాక్యములలో ఏది నిజము?ఏది అబద్ధము?
ఆ చిత్స్వరూపమును సూక్ష్మము అందునా అనలేను.ఎందుకంటే కింది ఏదులోకముల కొసలను వెతికినా పాదపద్మములు కానరావు.ఊర్థ ఏడులోకములను వెటికినా జటాజూటము (పూలతో అలంకరింపబడి సుగంధములను వెదజల్లుతూ కానరాదు.
పురుషుడు అని అనుకొందునా కాదు కాదు.
పోద ఒరుప్పాల్-వామభాగమున స్త్రీమూర్తిగా కనబడుతున్నాడు.
నల్లని రూపము అందుదా లేక తెల్లని రూపము అందునా
కుడిపక్క తెల్లగా-ఎడమపక్కన నల్లగా
నీల-లోహిత రూపుడై నిలిచి యున్నాడు.
పోనీ ఊరు పేరు చెబుదామంటే వారిది ఏ ఊరో తెలియదు.
కనీసము పేరైన తెలియదు
రూపము సంగతి సరేసరి.కనీసము స్వభావము గుర్తించుదామంటే,
వానికి
ఆర్ ఉత్రార్ ఆర్ ఉయరార్?
ఎవరు శత్రువులో-ఎవరు మిత్రులో తెలియదు కనుక చెప్పలేము.
ఒక్కడే అనుకుందామంటే అమ్మ తో కలిసి రెండుగా కనిపిస్తున్నాడు.
ఇద్దరు అనుకుందామంటే అందరిలో కనిపిస్తున్నాడు.
అందరిలో కేవలము చరములలోనే అనుకుందామంటే అచరములలోని అనిపిస్తున్నాడు.
చరాచర మిదం సర్వం శివమయం అని అనిపిస్తున్నాడు.
అట్టి "తిరుమేని" వానిని
"ఏమని వర్ణించగలము"?
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనంతము తక్క.
అంబే శివే దివ్య తిరువడిగళే శరణం.
ఏక బిల్వం శివార్పణం.

Comments
Post a Comment