Posts

Showing posts from February 14, 2018

SAUNDARYA LAHARI-01

Image
  శ్రీమాత్రే నమః   ***********   పరమ పావనమైన సౌందర్య లహరి ఆవిర్భావమునకు సంబంధించిన ఒక ప్రస్తావనతో నేను నా ప్రయత్నమును ప్రారంభిస్తాను.పరమశివుడు 5 స్పటిక లింగములను ,అమ్మవారు ఒక పుస్తకమును మన శంకరులకు వాత్సల్యముతో అనుగ్రహించారట.కాని నందీశ్వరుడు వానిని తీసుకుని పుస్తకములోని సగభాగమును మాత్రమే శంకరులకు ఇచ్చి,కాగల-రాగల మి గిలినభాగమునకు కారణమయ్యాడట.అవియె 41 శ్లొకములు గల ఆనంద లహరి,51 శ్లోకములు గల సౌందర్యలహరి.పరమేశ్వర లీల పరిణామములు పరమాద్భుతములు-పతిత పావనములు.    అమ్మ అనేది ఒక రూపముకాదు.అది ఒక తత్త్వము.మనము బాహ్య రూపముతో ఆగిపోకుండా సాగిపోతు అమ్మ తత్త్వమును తెలిసికొని,తన్మయమగుటకు ప్రయత్నించాలి.ఆనందకరమైన అచంచలమైన అజరామరమైన ప్రతిది అందమే.సర్వ ఉపనిషత్తులు ప్రతిపాదింపబడిన తత్త్వమే అమ్మ.పరబ్రహ్మ తత్త్వమే ఆనందము.చిదానందము అంటే ఇంద్రియాతీత పరతత్త్వము.శుభకరమైన శుభములను ప్రసాదించునదైన అందమే సౌందర్యము.          స్థూల,సూక్ష్మ,సూక్ష్మ తర,సొక్క్ష్మ తల సౌందర్యము.నాలుగు కలిసినది సౌందర్యము.ముందు స్ఫురించేది స్థూల సౌందర్యము ఆ సౌందర్యము జ్యోతిర్మయము.మ...