Posts

Showing posts from January 4, 2024

TIRUPPAAVAI-PASURAM-20

Image
      తిరుప్పావై-పాశురం-20    *********************    " నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం      పారార్థం స్వశృతిశతశిరస్సిద్ధమధ్యాపయంతీ      స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యా బలాత్ కృత్యభుంగ్తే      గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏ వాస్తుభూయః."    పూర్వ పాశుర ప్రాభవము    ******************       అమ్మనీళాదేవిపురుషకార/ఉపకార స్వభావమును ,వారి శయ్యగా అలరారు అర్థపంచకమును,వారి మంచపుకొళ్ళగా నున్నచర్తుర్విధ పురుషార్థములను,కీర్తించి,తనతో పాటుగా మమ్ములను స్వామి,గుణవైభవమనే మడుగులో పంచేంద్రియ పరిశుద్ధతత్లో మునకలు వేయుటకు స్వామిని తోడ్కొని,నోముస్థలికి రమ్మని,ప్రార్థించిన,గోదమ్మ,  ప్రస్తుత పాశుర ప్రాభవము  ******************   స్వామి, !.ఋజుత్వమును 2.అమ్మ పోషకత్వమును 3.ముప్పదిమూడుకోట్ల అమరులను  ముప్పదిమూడుకోట్లు-అనగా  అష్టవసువులు-8  ఏకాదశ రుద్రులు-11  ద్వాదశాదిత్యులు-12  అశ్వనీదేవతలు-2   ఇక్కడ కోట్ల అను పదము సమూహమునకు సంకేతముగా చెప్పబడినది.వార...