Monday, March 8, 2021

05


 తిరువెంబాయ్-005

  ***************

 మాలరియ నాం ముగనుం కాణా మలైనాం నాం
 పోలారివోం ఎన్రుళ్ళ పొక్కంగళే పేశుం

 పాలూరు తేన్వాయ్ పడిరీ కడై తిరవాయ్
 న్యాలామే విణ్ణె పిరవే అరివరియాన్

 కోలముం నమ్మైయాట్ కొండరుళి కోడాట్టు
 శీలం పాడి శివనే శివనే ఎన్రు

 ఓలం ఇడినుం ఉడరాయ్ ఉడరాయ్ కాణ్
 ఏలా కుళలి పరిశేలో రెంబావాయ్.


 స్మరణాత్ అరుణాచలమే ముక్తి-పోట్రి
 ******************************


 తిరు మాణిక్యవాచగరు ఈ పాశురములో స్థలపురాణప్రాశస్త్యమును మనకు చెలుల సంభాషణము ద్వారా వివరించుచున్నారు.
  అరుణాచల అంతరార్థము చెలులు నిదురలేపుచున్న చెలితో ఈ విధముగా చెప్పుచున్నారు.దీనికి నిదర్శనముగా మూడు విషయములను చెప్పుచున్నారు.
మొదటిది-న్యాలమే-భూమండలము
 భూమండలమునంతటిని కొలిచినను స్వామి మూలమును తెలుసుకొనలేము.విష్ణు కిందకు వెళ్ళి వెళ్ళి-వెతికి వెతికి కనుగొనలేకపోయినాడు.

 రెండవది-విణ్ణే-ఆకాసమునంతటిని కొలిచినను స్వామి మూలమును కనుగొనలేము అని బ్రహ్మ హంసనెక్కి పైపైకి సాగినను స్వామి మూలమును కనుగొనలేకపోయినాడు.

 మూడవది-పిరవే-భూమ్యాకాశములకు మధ్యనున్న స్థలములను కొలిచినను స్వామి మూలమును కనుగొనలేము .దేవతలు సైతము మనకు అర్థము కారు.అటువంటి వారలమైన మనకు దేవాదిదేవుడైన మహాదేవుని ఉనికిని ఇది అని-ఇంత యని-ఇక్కడని చెప్పగలమా?అసాధ్యము.
 అయినప్పటికిని,
ఓ ఏలా కుళలి! ఓ సుగంధ-సుందర కేశిని,
 నీవు మధుర శంభాషణా చాతుర్యము కలదానివి కనుక మాతో,
కాణాం మలయైనాం-నేను పర్వతమును చూశాను.
 అంతే కాదు నాకు,
ఆ పర్వతము గురించి,
 పోలారిరోం-నాకు బాగా తెలుసు/మూలము తెలుసు/మహిమలు తెలుసు అంటూ,
 పాలూర్ తేన్వాయ్-తేనె కలిపిన పాలలో ముంచిన కలుగు మాధుర్యము కలుగు తియ్యని మాటలు పలికినావు.
 కాని నిజమునకు అవి పొక్కంగళే పేశు-

 నమ్మికలేని/విలువలేని,ఆధారములేని/వ్యర్థమైన మాటలనిపించుచున్నవి.
 నీవు మాతో నమ్మ బలికినావు
మాలరియాం-కపట స్వభావము నీది.

   కోలము నమ్మై-స్వామి దివ్యమంగళ స్వరూపమును మనసులో ముద్రించుకొని,
  కోదాట్టి శీలము-దివ్య గుణగానములను 

 ఓలం ఇడినుం-బిగ్గరగా ఆలపిస్తున్నాము/సంకీర్తిస్తున్నము.
 అది నీకు వినబడుట లేదు.
 ఉణరాయ్-ఉణరాయ్-నిద్ర మేల్కాంచు
  శివ నోమును నోచుకుందాము.

 తిరు అన్నామలయై అరుళ ఇది
  అంబే శివే తిరువడిగళే పోట్రి
    నండ్రి.వణక్కం.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...