Wednesday, December 2, 2020

MEEDHUSHTAMA SIVATAMA-24



   మీఢుష్టమ శివతమ-24
  ***********************



   మనసున మసలుము సదాశివా
   మాయాతీత మహాదేవ నా
   మనసున మసలుము సదాశివా.





   ఏమిటీ వేళాకోళం రుద్రా.



 మల్లయ్యను పిలువమంటే,మల్లయ్యతో,



 మీరు శ్రమపడి రావద్దు.మీదగ్గరున్న కరంటును తెప్పించే శక్తిని మాత్రమే రమ్మన్నావు.

వాడు రాలేదు.చీకటి పోలేదు.



  విషయము అర్థమవ్వటములేదు నీకు.ఎవరిని పిలవాలో,ఎలా పిలవాలో, ఎలా పనులు చేయించుకోవాలో తెలియనట్లుంది నీకు అన్నాడు సాధకుడు చిరాకుగా.




  అంతలోనే నాన్నా! తలుపు రెక్క విరిగింది.మూయటానికి రావటములేదు అంటూ వచ్చాడు పదేళ్ళ కొడుకు.



 ఈసారైనా మర్యాదగా వచ్చి తలుపు బిగించివెళ్ళమని వడ్రంగికి చెప్పు.వాడిపేరు కూడా మల్లన్నే.



    రుద్రుడు,   అసలేమి జరగనట్లు ఫోను తీసుకుని చేసాడు.కలిసింది.



 అయ్యా ఇవతల రుద్రుడు మాట్లాడుతున్నాడు.అవతల మీరు.?
.నా  పేరు మల్లన్న.వడ్రంగిని.



 సాధకుని గారింట్లో తలుపురెక్క విరిగింది.మీరు మాత్రమే..నేను మళ్ళీ చెబుతున్నాను  వినండి.సామానులు-సంచీలు వద్దు.మీరు మాత్రమే వచ్చి తలుపు బిగించి వెళ్ళండి అన్నాడు మరింత అమాయకముగా.



   ఉత్తచేతులతో ఉరికి వచ్చాడు వడ్రంగి మల్లన్న.



  తలుపును చూసాడు.తలను అడ్డంగా తిప్పాడు.పనిముట్లు లేవండి.రేపు తెచ్చుకుని చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు.



   ఏమిటిది రుద్రా? ఎంతో కోపంగా అడిగాడు సాధకుడు.



  ఎంతో మర్యాదగా మీరన్నట్లే మర్యాదగా అతనినే పిలిచాను అన్నాదు రుద్రుడు అర్థంకానివాడిలాగ.



  గంగవెర్రులెత్తుతోంది సాధకునికిపొంగిపోతోందినెత్తిమీది గంగ రుద్రునికి.



   రుద్రా! గట్టిగా అరచి,నీకిదే చివరి అవశం
 .పని నేర్చుకో.నా పని పూర్తికావాలి.నీవెలా చేసినా సరే అన్నాడు.



  అమితానందముతో గిరగిర తిరుగుతున్నాడు రుద్రుడు వసారాలో ఆడుకుంటూ-పాడుకుంటూ.



   విద్యుత్ శక్తి మల్లన్న కలిసిరండి

   వడ్రంగి శక్తి మల్లన్న కలిసిరండి

   కుమ్మరి శక్తి మల్లన్న కలిసి రండి


   కమ్మరి శక్తి మల్లన్న కలిసి రండి

   కర్షక శక్తి మల్లన్న కలిసి రండి

      శక్తి-రూపము కలిసి రండి.

   సజోతషే-సజోతషే అంటూ ,



  ఈ పాట ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నాడు  సాధకుడు.




   అదే అదే,



 అగ్నిశ్చమ-ఇంద్రశ్చమే

 సోమశ్చమ -ఇంద్రశ్చమే

 సవితాచమ-ఇంద్రశ్చమే

 సరస్వతీచమ-ఇంద్రశ్చమే,



చిలిపిగా నవ్వుతున్నాడు రుద్రుడు.పశ్చాత్తపమునకు అది పిలుపుగా భావించాడు సాధకుడు.



 రూపము దానిలో నిక్షిప్తమైన శక్తి రెండు జతగా వస్తేనే సమర్థవంతము కదరా సాధకా!

   పమాత్మ-విభూతి కద ప్రపంచము.



   గుణసంబంధ శక్తి నిక్షిప్తము.దానిని దాచుకొనిన రూపము ప్రకటనము.అని బోధిస్తున్నట్లున్నది కొత్తగా.

   ఇంద్రుడు/ఈశ్వరుడు నిక్షిప్తశక్తి.

  అగ్ని-సోమ-సవిత-సరస్వతీ మొదలగునవి దానిని ప్రకటనము చేయు రూపములు.



 " శక్వరీరంగులయో దిశశ్చమే"-విరాట్పురుషుని అంగుళీ-వేల్లు. వివిధఛందస్సులు.మనము అజ్ఞానముతో మన పంచేద్రియ శక్తులను కన్ను-ముక్కు అంటు అవయములుగా భావిస్తున్నాము ,శక్తిని విస్మరించి దాని ప్రకటనద్వారములను మాత్రమే గమనిస్తూ.

   పాహి-పాహి  సదాశివా-శరనాగతరక్షకా,

   మాయతెర  మాయమైనది.



  పశ్చాత్తాపముతో పరుగున వచ్చి రుద్రుని పాదములపై పడ్డాడు సాధకుడు.



   దీనవదనముతో శరణుకోరుతున్నాడు సాధకుడు.

   మౌనవ్యాఖ్యలతో కరుణచూపుతున్నాడు రుద్రుడు.



   కదిలేవి కథలు-కదిలించేది కరుణ.



  అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.



 శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.



 ఏక బిల్వం  శివార్పణం.





.


MEEDHUSHTAMA SIVATAMA-23


 




  మీఢుష్టమ శివతమ-23


 *********************




ఈ రోజు నుండి పరమాత్మ బ్రహ్మశ్రీ సామవేదం వారి అమృతగుళికలతో మనలను ఆశీర్వదిస్తారు.




 వారికి సభక్తిపూర్వక నమస్కారములు.




 "హరిహరులకు ప్రియమైనది కార్తికమాసం


 సరిలేని వ్రతపూజలు సలుపుటకవకాశం."




  శ్రీ ఆకెళ్ళ విభీషణశర్మగారికి నమస్కారములతో.




    రుద్రా! రేపు పూజచేసుకోవాలంటు ఇంట్లో ఒకటే పోరు.తప్పించుకోలేని హోరు.నేను పూజను పీటలమీదనుండి లేవకుండ కూర్చుని ముగించాలంట.పిల్లలు నిర్వహిస్తారన్న నమ్మకం లేదు.




   పోనీ మానేద్దాం అంటే నాభార్య ససేమిరా వీల్లేదంటున్నది.ఏమి చేయాలో పాలుపోవటంలేదు అనగానే,




  పాలుపంచుకోవటానికి నేనున్నానుగా సాధకా! ఇంకెందుకు దిగులు అన్నాడు




  అసలది ఈశ్వర సంకల్పమేకదా సంకల్ప-వికల్పములను తొలగించుటకు జరుపబోవుచున్నది-జరుపుచున్నది.





  రుద్రా! పీటలు.

 రుద్రా!దీపములు.

 రుద్రా! గంగాజలము.

 రుద్రా! పుష్పములు.

 రుద్రా! పంచామృతములు.

 రుద్రా ఇది.రుద్రా అది

 .రుద్రా! రుద్రా! రుద్రా!..చిరునవ్వుతో అందిస్తున్నాడు రుద్రుడు



  " అనుక్షణము శివనామమే అనుచు శివుని కానరే


    ఘనుడౌ శంకరుడు మనల కరుణ చూచి ఏలగా"




   వస్తున్నారు అతిథులు.చేస్తున్నాడు రుద్రుడు వారికి మర్యాదలు.






  ఘంటానాదముతో పాటుగా గళఘంటికా నాదము కలిసి




 " శివ నామమా! చేతులార మొక్కి నిన్ను


   శరణంటినో తల్లి"


 శివతేజమా! నిన్ను కన్నులారా గాంచి,పులకించితిమో అమ్మా- శివనామమా-

హరహర నమః శివాయ-శివశివ నమఃశివాయ

భవభవ భవ నమ@ శివాయా-సివనామమా ! శివనామమా.....




  ఏ చోటను కన్నా శివవైభవమే-ఏ నోటను విన్నా శివనామస్మరణమే



.ప్రణవానందమో అది పరమానందమో పలుకు పలుకు మధురమే.





   పూజ బాహ్యమున ముగిసినది.తీర్థ-ప్రసాదములను స్వీకరించి ఎవరిళ్ళకు వారెళ్ళిపోయారు.




  సాధకుని క్రీగంట చూసాడు రుద్రుడు.ఇంచుక అహమునకు దాసుడై ఉన్నాడు.


 వచ్చినవారు అంతటిపనిమంతుడికియజమానివీని పొగిడారుగా పొంచి ఉన్న అహము కొంచముగా జరిగినది.





 కథను మలుపుతిప్పుతున్నాడు రుద్రుడు.


.కటికచీకటి.విద్యుత్తు  తనకు మరమ్మత్తు కావాలని మొరాయిస్తున్నది.




  సాధకుడు రుద్రా ఆ కరంటు మల్లయ్యకు ఫోనుచేసి వచ్చి బాగుచేయమని చెప్పు అన్నాడు దర్పంగా.




 అలాగే అంటు ఫోనుని తీసుకొని నంబరుకలిపాడు.




 అయ్యాతమరు మల్లయ్యగారేనా?


 అవును సార్.మీరు?


  నేనా,



 నేను రుద్రుడిని.




  సాధకుని ఇంటినుండి మాట్లాడుతున్నాను.మాకు మీ పనితముతో పనిబడింది.కరంటు రావటములేదు.




   అలాగా.ఇప్పుడే వచ్చేస్తా. అని అంటుంటే,




  అబ్బే మీరు రావద్దు. మీ పనితనమును పంపిచండి చాలు అన్నాడు.




 అర్థం కాలేదు సార్.హలో హలో అంటున్నాడు అవతలి మల్లన్న.




  అర్థమవుతుందిలేఅనుకుంటూ ఫోనును ఆపేశాడు రుద్రుడు.




   నోట మాట రాక చూస్తున్నాడు సాధకుడు.


   ఆటను మొదలెట్టేసాడు రుద్రుడు.




  కదిలేవి కథలు-కదిలించేది కరుణ.




 అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.




 శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.




 ఏక బిల్వం శివార్పణం.








    .




 

    .


 

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...