SREECHAKRADHARINI-02-SARVASAPARIPURAKA CHAKRAMU
.jpg)
శ్రీచక్రధారిణి-02/సర్వాశాపరిపూరకచక్రము *************************** ' తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై అష్టాదశ మహాద్వీపం సమ్రాడ్భోక్తా భవిష్యతి" ఇప్పటి వరకు ************ అణిమా సిద్ధిమాత+ సర్వ సంక్షోభిణి ముద్రామాత నివాసమైన త్రైలోక్య మోహన చక్రములో "విశ్వన్" పేరుతో నున్న సాధకుడు, జాగ్రదావస్థలో నుండి తన మనసునునిద్రాణము చేస్తూ,తన ఇంద్రియములను మెలకువలోనుంచుతూ అనేక పనులతో సతమతమవుతుంటాడు.అలిసిన స్థూల శరీరము విశ్రాంతిని కోరుకుంటూ తదుపరి పనుల బాధ్యతను సూక్ష్మశరీరమునకు అప్పగిస్తుంది తనతో పాటుగా తన ఇంద్రియములను సైతము నిద్రలోనికి జార్చుతు,రెండవ ఆవరణమైన సర్వాశా చక్రములోని ప్రవేశింపచేస్తుంది. ఇప్పుడు ***** పరమేశ్వరుడు పార్వతీదేవికి , " స కారః చంద్రమా భద్రే కళా షోడశమాత్మకం" అని చంద్రబీజమును కలిగి,షోడశకళలు షోడశదళ పద్మముగా వృత్తాకారముగా నున్న ఆవరణము లోనికి "తైజసునిగా" తనపేరుని మార్చుకుని ప్రవేశిస్తాడు. స్తోత్రము ******* ...