కదా త్వాంపశ్యేయం/ఇదేయం త్వాం పశ్యామి
ధన్యోస్మి దయామయా.-30
************************
" జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహంప్రార్థితం
నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం."
" సకలము నీవే సదాశివా-సంకల్పము నీవే సర్వేశ్వరా
మూలము నీవే హరోంహరా-మూలాధారము నీవే పరాత్పరా
నీలి గగనము నీవే-వాయుపవనమును నీవే
నీటికి మూలము నీవే -చీకటికి దీపము నీవే
పుడమియు నీవే-గుడియును నీవే
రవి శశి గ్రహముల గమనము నీవే
సమయము నీవే-సంరక్షణయును నీవే
ఏకము నీవే-అనేకము నీవే
వెలుపల నీవే-లోపల నీవే
గమనము నీవే-గమ్యము నీవే
నమకము నీవే-చమకము నీవే
కరుణయు నీవే-శరణాగతియును నీవే
పాహిమాం-పాహిమాం అనిపరమేశ్వరుని
ప్రార్థిస్తూ, ఈనాటి బిల్వార్చనమును ప్రారంభించుకుందాము.
ఎంతటి పరమాద్భుత తాండవము.సకలమును సముచిత స్థానములలో నిలుపుటయే కదా స్వామి అమ్మతో కలిసిచేసే లాస్య-తాందవములు.
ఇంతలో పిల్లలు శంకరయ్యగారు నిన్నగుఱ్ఱములు మోకాళ్ళపై కూర్చుండిపోవుటచే యుద్ధము జరుగలేదని చెప్పారు కదా.
మరి అప్పుడు ఆ రాక్షసులు ఏమయ్యారు?ఎవరు సంహరించారు? అసలు ఎందుకు అలా జరిగింది త్వరగా చెప్పండి అంటూ ఆసక్తిగా నున్నారు.
అప్పుడు శంకరయ్యగారు మీరు తరగతిలో పాఠములు వింటారు.మైదానములో ఆడుకుంటారు.పాఠములు గురువులు చెబుతూనే ఆటలు ఆడిస్తారు.తిరిగి ఇంటికి వచ్చేస్తారు.అమ్మ-నాన్నలతో ఉంటారు.
అదేవిధముగా పరమాత్మ తన పిల్లలకు వేర్వేరు పనులను అప్పచెప్పి వారిచే సరిగా జరుగునట్లు చూస్తాడు.ఎవరికి చెప్పిన పనిని వారు చేయాలి.అప్పుడే అన్నిలోకములు ఆనందము తో ఉంటాయి.అవునా? అని అడిగగానే అందరు సంతోషముగా నవ్వుకున్నారు.
ఇక్కడ దేవతలు ఏఋపరచిన రథముసహజమైనదికాదు .అది తనపనిని చేయకుండా వేరొక పనిని,తన స్వరూప-స్వభావములకు కూడనివి చేయాలి.
అంటే-అదేవారు గణేశుని విఘ్నములు తొలగించమని ప్రార్థించలేదు.కుమారస్వామిని సేనలను రక్షించమని అడుగలేదు.
అంతా తమగొప్పతనమే అన్నభ్రమలో ఉన్నారు.
అర్థము కావటములేదుకదూ మీకు.
ఇదిగో వినండి.
తనచుట్టు తాను తిరిగే భూమి ఆకాశమువైపునకు తిరగాలి.వారు రథమునకు సూర్య-చంద్రులను రథచక్రములుగా కట్టారు.అంటేఒకచక్రము(పగలు) ముందుకు సాగుతుంటే రెండవచక్రము (రాత్రి)వెనుకకు లాగుతుంది.రెండుచక్రాలు ఒకే మార్గములో కదలాలికదా.
అవునవును.
నిశ్చల-నిష్కళంక -నిర్మలహృదయాంతరాలలో నిర్విరామముగా నినదించు ప్రణవము-నిర్దాక్షిణ్యముగా,గుఱ్ఱములను విదిలించే కొరడా గా ఎలా మారుతుంది.
" యతో వాచ్యం నివర్త్యంచ అప్రాప్య మనసా సహ"
ఎక్కడ మనసు వాక్కు తమ సహజస్థితిని మరచి ఏకాగ్రమవుతాయో అదియే కదా పరబ్రహ్మము.శబ్ద పరబ్రహ్మమే ప్రణవము కదా.
సృష్టి జరుపుట బ్రహ్మపని.ఆయన రథసారథ్యము ఎలా చేయగలడు.బ్రహ్మ నాలుగు ముఖములు ఎప్పుడు నాలుగు వేదాలను చదువుతుంటాయని బ్రహ్మయ్య చెప్పాడుగా.పూజించే వేదములను బ్రహ్మ కొరడాతో ఎలా కొట్టగలడు?
అవును.నిజమే కదా ఆసక్తిగా చూస్తున్నారు శంకరయ్యవంక పిల్లలు.పైగా,
పరబ్రహ్మము ఉండే చిరునామాను చూపించుటయే వేదములకు పరబ్రహ్మము నిర్దేశించిన కర్తవ్యము. ఎక్కడ ఉంటాడో,ఎలా గుర్తించాలో చెబుతాయి.అంతేకాని వెంటవెళ్ళవు.అవి బ్రహ్మగారి మాటను గౌరవించి ఒక్క అడుగువేసి,పరబ్రహ్మము ఆనతిని పాటించి . అశ్వములైన వేదములు మోకాళ్ళపై కూర్చున్నవి.
బ్రహ్మ సృష్టి తాత్కాలికముగా ఆగినది.శంకరుడు సంహారమునకు ఉపక్రమిస్తున్నాడు.స్థితికారకుడు అయిన విష్ణువు తత్ క్షణ కర్తవ్యమును బోధించమని మహాదేవుని ప్రార్థించాడు.వెనువెంటనే
వృషభ వాహనమై రథమునకు ముందు నిలిచి కదిలించాడు.దేవతల ముచ్చట తీర్చుటకై,మహాదేవుడు మేరుపర్వతమును విల్లుచేసి,ఆదిశేషుని వింటినారిగా మలచుకుని,తనమూడవనేత్ర శక్తిని,బాణముగా మారిన హరికి ప్రసాదించి,త్రిపురములను అసురులను సమసింపచేసినాడు.
ఆ త్రిపురములు త్రికరణములు-త్రిగుణములు-త్రి స్థితులు-త్రిసంధ్యలు-త్రికాలములు మొదలగునవి.వాటికి అతీతముగా ఉండగలుగుటయే తురీయము.బ్రహ్మానందము.నిరవధికము-నిర్యాణము.అదియే జీవన్ముక్తి.
ఆ యదార్థమును చాటువారందరును "బ్రహ్మశ్రీ వేదమూర్తులే."
అయితే మీరిప్పుడు "బ్రహ్మశ్రీ వేదమూర్తి శంకరయ్య గారు అన్నారు చప్పట్లుకొడుతు.
లోక విరుద్ధముగా అమర్చబడిన రథము ఆగిన వేళ-అది సముచితమైనది కాదని తెలిసికొనిన దేవతలు,వినయముతో,ప్రార్థించగా,పరమదయాళువైన స్వామి,
.
"తృణకణముల భంగి త్రిపురములదహించి
పరముడవ్యయుండు భద్రయశుడు
శివుడు పద్మజాది జేగీయమానుడై
నిజ నివాసమునకు నెమ్మి జనియె" అని సంకీర్తించారు సహజకవి పోతన.
ఒక్కసారిఉలిక్కిపడ్దాడు శంకరయ్య,ఎవరో తన భుజము మీద చేయివేసినట్లనిపించి.
ఆశ్చర్యము ఎదురుగా శివయ్య నవ్వుతూ ,
అమ్మయ్య! ఇంక నేను నీ వెనుక వెనుక రానవసరములేదు అంటూ నవ్వాడు.
ఇంతలో అందరు అదిగో శ్రీశైల శిఖరము.ఇంకపునర్జన్మ ఉండదు.పదండి ధూళిదర్శనము చేసుకుందాము శంకరయ్యగారు అంటు కదులుతున్నారు.
.వారికి నాయకత్వము వహిస్తున్నదా యన్నట్లు తనను ప్రశ్నలువేసిన నెమలి కాదుకాదు నీలకంఠుడు వస్తున్నాడు.
సమాధానము దొరికింది.సత్కృప లభించింది.అనుకుంటుండగా నెమలికి బదులు శివయ్య.
ఏమిటి శంకరయ్య వింతగా చూస్తున్నావు నన్ను అని చిలిపిగా అడిగాడు.
"సోమకళాధర మౌళౌ
కోమలఘన కంథరే మహా మహసి
స్వామిన్ గిరిజా నాథో
మామక హృదయం నిరంతరం రమతాం"
ఎవరిగురించి నీ మాటలు శంకరయ్యా?
ఇంకా నన్ను పరీక్షించకు స్వామి,
" కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం
ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం
శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునః
ర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం "నతిరియం"
అని నమస్కరించుచుండగా ఆదిదంపతులు అందరిని ఆశీర్వదిస్తున్నారు.
"స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా
న్యాయేన మార్గేణ మహీం మహేశః
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం
లోకాః సమస్తా సుఖినో భవంతు.
సర్వం ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు.